About BhashaIndia | Contribute | SiteMap | Register | Sign in to Windows Live ID
  Patrons Developers
Hindi Tamil Kannada Gujarati Marathi Telugu Bengali Malayalam Punjabi Konkani Oriya Sanskrit Nepali
Home > Patrons > LanguageTech > Internet Explorer 7 Welcome Guest!

ఎన్నో ప్రయోజనాల ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7

బ్రౌజింగ్ అనగానే నెటిజన్లందరి మదిలోనూ స్ఫురించే బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. తాజాగా మరిన్ని సౌకర్యాలతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్ 7 ఇప్పుడు కంప్యూటర్ ప్రపంచంలోని డెస్క్‌టాప్‌లన్నిటినీ ఆక్రమిస్తోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7 ప్రత్యేకతలు ఇవిగో మీ కోసం....

డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్: http://www.microsoft.com/windows/ie/

కనీస కాన్ఫిగరేషన్:

కంప్యూటర్:
233 మెగాహెడ్జ్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రాసెసర్ గల కంప్యూటర్ (పెంటియం ప్రాసెసర్ సిఫారసు చేయబడుతోంది)

ఆపరేటింగ్ వ్యవస్థ:
విండోస్ ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్ 2 (ఎస్‌పి 2)
విండోస్ ఎక్స్‌పీ ప్రోఫెషనల్ x64 ఎడిషన్
విండోస్ సర్వర్ 2003 సర్వీస్ ప్యాక్ 1 (ఎస్‌పి 1)

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్7కు కావలసిన మెమరీ:
విండోస్ ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్ 2 (ఎస్‌పి 2) - 64 ఎంబి
విండోస్ ఎక్స్‌పీ ప్రోఫెషనల్ x64 ఎడిషన్ - 128 ఎంబి
విండోస్ సర్వర్ 2003 సర్వీస్ ప్యాక్ 1 (ఎస్‌పి 1) - 64 ఎంబి
విండోస్ సర్వర్ 2003 సర్వీస్ ప్యాక్ ia64 (ఎస్‌పి 1) - 128 ఎంబి

డిస్‌ప్లే: సూపర్ విజిఎ (800 x 600) లేదా 256 రంగుల అధిక రిజల్యూషన్ మానిటర్

టూల్‌బార్ మరింత ఆకర్షణీయం:
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7లోని టూల్‌బార్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు వచ్చాయి. అదేమంటే ఇంతకు ముందులా టెక్ట్స్ కాకుండా గ్రాఫికల్ ఐకాన్‌లతో బ్రౌజర్ టూల్‌బార్ కనిపిస్తుంది. వీటికే డ్రాప్‌డౌన్ మెనులు ఉంటాయి. అంతేగాక ఇక్కడే సెర్చ్ బాక్స్ కూడా ఉంటుంది. మరో విశేషమేమంటే ఈ ఎక్స్‌ప్లోరర్‌లోనే బిల్ట్ఇన్ ఎమ్ఎస్ఎన్ సెర్చ్ ఇంజన్‌నూ చేర్చారు.

ట్యాబ్డ్ బ్రౌజింగ్:
ఈ సదుపాయం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7లో ఒక ప్రత్యేకాంశం. ఎందుకంటే, ఒకే విండో ద్వారా ఒకటికంటే ఎక్కువ వెబ్ పేజీలను వీక్షించే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. తద్వారా ఒకే విషయానికి సంబంధించిన వెబ్ పేజీలను ఒకే విండోలో చూసుకోవచ్చు. థంబ్‌నెయిల్స్ ఆధారంగా ట్యాబ్‌లతో వీటి మధ్య వేగంగా సంచరించేలా సహకరించేందుకు క్విక్ ట్యాబ్స్ సదుపాయం ఉంది.

ట్యాబ్ గ్రూపులు:
ట్యాబ్డ్ బ్రౌజింగ్ లాగే ఆయా వెబ్ పేజీలను అంశాల వారీగా వర్గీకరించుకొని ట్యాబ్ గ్రూపులుగా నిక్షిప్తం చేసుకోవచ్చు. ఫలితంగా ఒక్కసారి క్లిక్ చేయడంతోనే ఒకటికంటే ఎక్కువ ట్యాబ్‌లను వీక్షించవచ్చు. ముఖ్యమైన ట్యాబ్ గ్రూప్‌ను హోం పేజి గ్రూప్‌గా అమర్చుకోవచ్చు. దాంతో, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తెరచినప్పుడల్లా పలు వెబ్ పేజీలతో కూడిన మొత్తం ట్యాబ్ గ్రూప్ తెరవబడి మీ ముందుంటుంది.

అన్నిటికీ ఒకే బుక్‌మార్క్:
ఒకే రంగానికి చెందిన పలు వెబ్ పేజీలను మరెప్పుడైనా వీక్షించే నిమిత్తం మీరు బుక్‌మార్క్ చేసుకోదలిస్తే, వాటన్నిటినీ ఒకే బుక్‌మార్క్‌తో నిక్షిప్తం చేసుకోవచ్చు. అంటే, ఇలా నిక్షిప్తం చేసుకున్న ఒక బుక్‌మార్క్‌పై మీరు క్లిక్ చేసినప్పుడు, సంబంధిత రంగానికి చెందిన పలు వెబ్ పేజీలు ఒకేసారి మీముందు ప్రత్యక్షమవుతాయి. ముఖ్యంగా పరిశోధకులు, విశ్లేషకులకు ఇదెంతో ఉపయుక్తం.

ఆర్ఎస్ఎస్ కాంపాటిబిలిటీ:
మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను వీక్షించినప్పుడు అందులో తరచూ చోటుచేసుకొనే అప్‌డేట్లు, ఇతర సమాచారాంశాల విశేషాలను మీరు ఎప్పటికప్పుడు పొందేలా సబ్‌స్క్రయిబ్ చేసుకొనేందుకు ఆర్ఎస్ఎస్ కాంపాటిబిలిటీ సహకరిస్తుంది. సంబంధిత వెబ్‌సైట్ కొత్త అంశాలతో నవీకరించబడినప్పుడల్లా మీ టూల్‌బార్ మీకు సంకేతాలనిస్తుంది.

కట్టుదిట్టమైన భద్రత:
ప్రాథమికంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7లో యాక్టివ్ఎక్స్ నియంత్రణలు డిసేబుల్ చేయబడి ఉండటం వల్ల వినియోగదారుల అనుమతి లేకుండా వారి సిస్టమ్‌లలోకి ఏవీ డౌన్‌లోడ్ కాబోవు. ఇన్ఫర్మేషన్ బార్ లేదా యాడ్-ఆన్ మేనేజర్ ద్వారా మీకు కావలసిన యాక్టివ్ఎక్స్ నియంత్రణలను అమలు చేసుకోవచ్చు. అదే విధంగా ఆయా వెబ్‌సైట్ల భద్రత స్థాయిలను తెలియజేసేలా కలర్-కోడెడ్ నోటిఫికేషన్లను ప్రదర్శిస్తుంది. ఇందువల్ల, ఆయా సైట్ల యజమానులు భద్రతాపరంగా ఏమేరకు చర్యలు తీసుకున్నారో గమనించవచ్చు. హానికరమైన వెబ్‌సైట్లను అడ్డుకొని నిరోధించేందుకు ఇందులోని ఫిషింగ్ ఫిల్టర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అదే విధంగా అడ్రస్ బార్ ప్రొటెక్షన్, యుఆర్ఎల్ హ్యాండ్లింగ్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ డొమైన్ నేమ్ యాంటీ స్పూఫింగ్ వంటి వాటితో భద్రతాపరంగా మైక్రోసాఫ్ట్ ఈ కొత్త బ్రౌజర్‌ను కట్టుదిట్టంగా తీర్చిదిద్దింది.

పేరెంటల్ కంట్రోల్స్ (విస్టాకు ప్రత్యేకం) :
తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ వెర్షన్ పేరెంటల్ కంట్రోల్స్‌ను అందిస్తోంది. పిల్లలు వీక్షించే పలు వెబ్‌సైట్లకు సంబంధించి అమలులో ఉన్న భద్రతను తల్లిదండ్రులు రిమోట్ స్థితిలో గమనిస్తూ నియంత్రించవచ్చు. పిల్లల బ్రౌజింగ్ తీరుతెన్నులను, సమయాలనూ పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవచ్చు.

ముద్రణలో సౌలభ్యం:
ఎంపిక చేసిన పాఠాన్ని మాత్రమే ముద్రించడం సహా ముద్రణకు ఉపయోగించే పేపర్ పరిమాణానికి తగినట్లుగా వెబ్‌పేజీని సమన్వయపరుస్తుంది. లైవ్ మార్జిన్లతో మల్టీ పేజ్ ప్రీవ్యూను అందించడంతో పాటుగా డాక్యుమెంట్ క్లిప్పింగ్‌ను నివారించేలా ముద్రణ పాఠం పరిమాణాన్ని మార్చుతుంది.

ఫేవరెట్స్ సెంటర్:
ట్యాబ్ గ్రూపులు, ఆర్ఎస్ఎస్ ఫీడ్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫెవరెట్లు మొదలైన వాటిలోని మీ ముఖ్యమైన వెబ్‌సైట్‌లను సులభంగా, వేగంగా పొందేందుకు ఫేవరెట్స్ సెంటర్ వీలు కల్పిస్తుంది. కావలసినప్పుడల్లా విస్తరణకు, అతి ముఖ్యమైన వాటిని మరింత త్వరగా పొందేలా ప్రత్యేకంగా యాంకరింగ్ చేసుకోవడానికి ఈ బ్రౌజర్ తోడ్పడుతుంది.

అభివృద్ధికి టూల్‌కిట్‌లు:
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7తో లభించే ఈ అప్లికేషన్ కంపాటిబిలిటీ టూల్‌కిట్‌ను ఉపయోగించుకొని ఐటీ ప్రోగ్రామర్లు మరియు డెవలపర్లు తమ వెబ్‌సైట్లు, అప్లికేషన్ల మధ్య గల వైరుధ్యాలను గమనించి సరిచేసుకోవచ్చు. అదే విధంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అడ్మినిస్ట్రేషన్ కిట్‌ను ఐటీ నిపుణులు ఉపయోగించుకొని తమ యూజర్ల కొరకు అదనపు ప్రోగ్రామ్‌లు మరియు ప్రత్యేక సెట్టింగ్‌లను అందచేయవచ్చు.
Print Print
Broadcast Broadcast
Save this Article Save
E-mail this article link E-Mail
Rate this article
Related Articles
Contribute an article

Also read:

Related articles
Rate this article
1 2 3 4 5 6 7 8 9
Poor Outstanding
Tell us why you rated the content this way. [Optional]
 

Average rating:
7 out of 9
1 2 3 4 5 6 7 8 9
8 people have rated this article
Partner Profile | Privacy Statement | Why Passport | Testimonials
This site uses Unicode for non-English characters and uses Open Type fonts.
©2003-2007 Microsoft Corporation. All rights reserved.