శక్తిమంతమైన సాధనాలతో ఆఫీస్ ఎక్సెల్ 2007

సమాచార విశ్లేషణకోసం విస్తృతంగా వాడుకునేలా ప్రజలకు చేయూతనిచ్చే శక్తిమంతమైన సాధనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది. ఆఫీస్ ఎక్సెల్ 2007, ఎక్సెల్ సేవలను ఉపయోగించుకుని మీ విశ్లేషణలను, పరిశీలనలను సహోద్యోగులు, కస్టమర్లు, భాగస్వాముల మధ్య ఎంతో విశ్వసనీయతతో పంచుకోవచ్చు, వినియోగించుకోవచ్చు.

ఒక పట్టిక రూపకల్పన లేదా ఫార్ములా రాసుకోవడానికి గాని అవసరమైన కమాండ్స్‌ను ఆఫీస్ ఎక్సెల్ 2007 అందిస్తుంది. తద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. విస్తృతమైన స్ప్రెడ్‌షీట్ల ద్వారా భారీ స్థాయిలో గణాంకాల దిగుమతి, నిర్వహణ, వాడకం సాధ్యమవుతుంది.

ఒక మిలియన్ పంక్తులు, 16,000 నిలువు వరుసల మేరకు విస్తరించుకునేలా స్ప్రెడ్‌షీట్లను రూపొందించుకుని అత్యంత భారీ డేటాతో పని చేసుకోవడానికి ఆఫీస్ ఎక్సెల్ 2007 సహకరిస్తుంది. స్ప్రెడ్‌షీట్లలోని సంక్లిష్టమైన ఫార్ములాలతో శరవేగంగా లెక్కలు కట్టేందుకు గాను మల్టీకోర్ ప్రాసెసర్ ప్లాట్‌ఫాంకు ఆఫీస్ ఎక్సెల్ 2007 తోడ్పాటునిస్తుంది.

నైపుణ్యం ఉట్టిపడేలా కనిపించే మీ చార్ట్‌లలోని విశ్లేషణాత్మక సమాచారంతో వివిధ కార్యకలాపాలు చేసుకోవడం కోసం సరికొత్తగా సిద్ధం చేసిన ఆఫీస్ ఎక్సెల్ 2007లోని చార్టింగ్ ఇంజన్‌ను ఉపయోగించుకోండి. చార్టింగ్ టూల్స్ ఉపయోగించి తక్కువ క్లిక్‌లతోనే వేగంగా నైపుణ్యం ఉట్టిపడే చార్ట్స్ తయారు చేసుకోండి. 3-డి ఎఫెక్ట్‌లు, సాఫ్ట్ షాడోయింగ్, ట్రాన్స్‌ఫరెన్సీ వంటి ప్రత్యేకతలను చేర్చుకోవచ్చు. ఆఫీస్ ఎక్సెల్‌లోని చార్టింగ్ ఇంజన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్‌పాయింట్ 2007తో కూడా కలసి పనిచేసేది కావడం వల్ల అప్లికేషన్‌తో నిమిత్తం లేకుండా చార్ట్‌లు తయారు చేసుకోవచ్చు, కార్యకలాపాలు జరపవచ్చు.

మీ డేటాపై మీరు సంధించే పలు ప్రశ్నలకు సమాధానాల్ని పొందడం కోసం త్వరితగతిన డేటా దిశలు మార్చుకోవడానికి PivotTable దృశ్యాలు సహకరిస్తాయి. చూపించాల్సిన చోట ఫీల్డ్స్‌ను సులభంగా డ్రాగ్ చేసి, వేగంగా సమాధానాలు రాబట్టడంకోసం PivotTable దృశ్యాలను తయారుచేసుకుని ఉపయోగించుకోండి.

మీ సమాచారానికి కండిషనల్ ఫార్మాటింగ్‌ని వర్తింపజేసుకుని సులభంగా మీడేటా రూపురేఖల్ని మార్చవచ్చు, దాని తీరును ప్రత్యేకంగా గుర్తించవచ్చు. కొత్త సాధనాల్లో కలర్ గ్రేడియంట్లు, హీట్ మ్యాప్‌లు, పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్ ఐకాన్లు ఉన్నాయి.

స్ప్రెడ్‌షీట్లను ఇతరులతో ఎంతో భద్రంగా పంచుకోవడం కోసం ఆఫీస్ ఎక్సెల్ 2007, ఎక్సెల్ సర్వీస్‌లను ఉపయోగించుకోండి. ఒక స్ప్రెడ్‌షీట్‌ను డైనమిక్‌గా హెచ్‌టిఎంఎల్ రూపంలోకి మార్చి వైబ్ బ్రౌజర్ ద్వారా ఇతరులు ఆ సమాచారాన్ని అందుకునేలా ఎక్సెల్ సర్వీసెస్ తోడ్పడుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షేర్‌పాయింట్ సర్వర్ 2007లోని ఒక ఫీచర్. వెబ్ బ్రౌజర్‌లోనే సమాచార క్రమబద్ధీకరణ, వడబోత, విభజన, పేరామీటర్లను అందజేయడం లాంటివి చెయ్యవచ్చు.

భారీ పరిమాణాన్ని కుదించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఆపీస్ ఎక్సెల్ ఎస్ఎంఎల్ ఫార్మాట్, పాడైన ఫైళ్ల నుంచి డేటా పునరుద్ధరణ లాంటి సదుపాయాలున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యుఎల్ సర్వర్ 2005కు మద్దతు కూడా ఉంది.