సరికొత్త ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఔట్‌లుక్ 2007

సమయాన్ని, సమాచారాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి, విస్తృత సంబంధాల ఏర్పాటుకు కావలసిన భద్రత, నియంత్రణలను ఆఫీస్ ఔట్‌లుక్ 2007 యూజర్లకు అందిస్తుంది. మెరుగైన పనితీరు, మరింత సమన్వయం దిశగా ఆఫీస్ ఔట్‌లుక్ 2007కు సంబంధించిన ఉపయుక్త సమాచారం ఇది...

ఆఫీస్ ఔట్‌లుక్ 2007, మొబైల్ ఫోన్ల మధ్య టెక్ట్స్, పిక్చర్ మెసేజీలు అందుకోవడానికి, పంపడానికి ఔట్‌లుక్ మొబైల్ ఫీచర్ తోడ్పడుతుంది. ఔట్‌లుక్ ఇ-మెయిల్, కాంటాక్ట్‌లు, అపాయింట్‌మెంట్లు, టాస్క్‌లను మీకు లేదా ఇతరులకు టెక్ట్స్ మెసేజీలుగా పంపడానికి కూడా ఔట్‌లుక్ మొబైల్ సర్వీస్ వీలు కల్పిస్తుంది.

ఫ్లాగ్ చేసిన మీ మెయిళ్లు, టాస్క్‌లను స్పష్టంగా చూపించే To-Do బార్ నుంచి మీ రోజువారీ ప్రాధాన్యతల్ని తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్, వన్ నోట్, మైక్రోసాఫ్ట్ విండోస్ షేర్‌పాయింట్ సర్వీసెస్ టెక్నాలజీ వంటి ఇతర మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోగ్రామ్‌లలో మీరు ఉంచిన టాస్క్‌లతో కూడా ఈ To-Do బార్ కనెక్ట్ అవుతుంది. చివరిగా, ఈ To-Do బార్‌ని క్యాలెండర్‌తో అనుసంధానించుకోవడం ద్వారా మీ కార్యకలాపాలను సులభంగా ప్రణాళిక చేసుకోవచ్చు.

మీ క్యాలెండర్‌ను మీరు పనిచేసేచోట లేదా బయటివారితో పంచుకోవడానికి కావలసిన క్యాలెండరింగ్ కార్యకలాపాలను ఈ కొత్త ఆఫీస్ ఔట్‌లుక్ 2007 అందిస్తుంది. ఇందువల్ల మీకు ముఖ్యమైనవారంతా మీ సమాచారాన్ని పొందగలుగుతారు. మీరు ఇంటర్నెట్ క్యాలెండర్లను తయారుచేసుకుని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆన్‌లైన్‌లో పబ్లిష్ చెయ్యవచ్చు. ఇంటర్నెట్ క్యాలెండర్ సబ్‌స్క్రిప్షన్లు, ఇ-మెయిల్ క్యాలెండర్ స్నాప్‌షాట్స్‌కు చేర్చవచ్చు, పంచుకోవచ్చు. ఇంకా, క్లయింట్స్‌కు కస్టమైజ్డ్ ఎలక్ట్రానిక్ బిజినెస్ కార్డ్ పంపవచ్చు. దీంతో ప్రతి ఒక్కరితోనూ మీరు సులభంగా కమ్యూనికేట్ చెయ్యవచ్చు.

ఆఫీస్ ఔట్‌లుక్ 2007ను ఎక్స్‌ఛేంజి సర్వర్ 2007తో అనుసంధానించవచ్చు. ఎక్కువ సమయం పట్టే క్యాలెండరింగ్ పనులను ఆటోమేట్ చేసే షెడ్యూలింగ్ అసిస్టెంట్‌తో యూజర్లు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అత్యధిక భద్రతనిచ్చే మల్టిపుల్ మెసేజింగ్ సదుపాయాన్ని ఆఫీస్ ఔట్‌లుక్ 2007, ఎక్స్‌ఛేంజి సర్వర్ 2007ల సమ్మేళనం అందిస్తుంది. సందేశాల భద్రతపై యూజర్లు నమ్మకంగా ఉండవచ్చు.

జంక్ మెయిళ్లు, వెబ్ సైట్ల ద్వారా ఎదురయ్యే 'ఫిషింగ్' నుంచి భద్రతనిచ్చే కొత్త ఏర్పాట్లను ఆఫీస్ ఔట్‌లుక్ 2007 చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని వెబ్ సైట్లు చోరీ చెయ్యకుండా రక్షించేందుకు కొత్త అంశాలతో మెరుగైన జంక్ ఇ-మెయిల్ ఫిల్టర్‌ను అందజేసింది. ముప్పు తెచ్చే అవకాశాలున్న లింక్‌లను నిలిపివేస్తుంది. మీకు వచ్చే ఇ-మెయిల్ సందేశంలోని ప్రమాదకరమైన అంశాల గురించి ఇది హెచ్చరిస్తుంది.

మీ సమాచారాన్ని వెదికి పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా? ఇ-మెయిల్, క్యాలెండర్, కాంటాక్ట్‌లు లేదా టాస్క్‌లలోని అంశాలను గుర్తించేందుకు కీవర్డ్స్, తేదీలు లేదా ఇతర అనుకూల ప్రమాణాలను ఉపయోగించి ఆఫీస్ ఔట్‌లుక్ 2007 ద్వారా వెదకండి. సమయం ఆదా అవుతుంది.