ఆఫీస్ మొబైల్ 6.1 గురించి కొన్ని వివరాలు

ఆఫీస్ మొబైల్ సరికొత్త వెర్షన్‌తో మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 ద్వారా తయారు చేసుకున్న అన్నిరకాల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్ ఫార్మాట్లతోనూ పనిచేసుకోవచ్చు. పైల్ పరిమాణాన్ని తగ్గించి, మరింత భద్రత, విశ్వసనీయతను అందిస్తూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 సరికొత్త ఫైల్ ఫార్మేట్‌ను కలిగి ఉంది.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ సరికొత్త వెర్షన్‌ను ఉపయోగించి మీరు ఎలాంటి కార్యకలాపాలు చేసుకోవచ్చంటే:
  1. ఎక్సెల్ మొబైల్ ద్వారా రిచ్ చార్ట్‌ల రూపకల్పన
  2. పవర్ పాయింట్ మొబైల్ ద్వారా SmartArtలు, థీమ్స్ వాడకం
  3. కంప్రెస్ (జిప్ చేసినవి) అయి ఉన్న ఫోల్డర్లలోని అంశాలను వీక్షించడం
మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ పాత వెర్షన్లలో తయారు చేసుకున్న డాక్యమెంట్లను కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ కొత్త వెర్షన్‌లో ఉపయోగించుకోవచ్చు.
పాకెట్ వర్డ్, పాకెట్ ఎక్సెల్ ద్వారా తయారు చేసుకున్న డాక్యుమెంట్లను వీక్షించడానికి కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ 6.1 సహకరిస్తుంది.
ఇంకా... విండోస్ మొబైల్ 5.0 (మెసేజింగ్, సెక్యూరిటీ ఫీచర్ ప్యాక్.. 14847 కంటే ఎక్కువ విలువగల బిల్డ్), విండోస్ మొబైల్ 6 నాన్-టచ్ స్క్రీన్ డివైజెస్, విండోస్ మొబైల్ 6 టచ్ స్క్రీన్ డివైజెస్‌తో పనిచేసేలా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ సరికొత్త వెర్షన్ రూపకల్పన జరిగింది. ఇది విండోస్ మొబైల్ 5.0 నాన్-టచ్ స్క్రీన్ డివైజ్‌తో పని చెయ్యదని గుర్తుంచుకోండి.
మీ విండోస్ మొబైల్ డివైజ్‌ను కొన్నప్పుడు అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీరు అర్హులు. విండోస్ తాజా వెర్షన్ ఉన్న పీసీకి మీ ఫోన్‌ను సింక్రనైజ్ చెయ్యడం ద్వారా మీ ఫోన్‌లో దీనిని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
మీ విండోస్ మొబైల్ డివైజ్‌ను కొన్నప్పుడు అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ ఇన్‌స్టాల్ అయి ఉండకపోతే, మీ డివైజ్ అందుకు తగినదా కాదా అనేది నిర్ణయించుకోండి. అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ తాజా వెర్షన్‌తో పని చేయగలిగేది అయితే, మీరు సాఫ్ట్‌వేర్‌ను కొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సిస్టం అవసరాలకు తగినట్లుగా మీ కంప్యూటర్, మొబైల్ డివైజ్ ఉన్నట్లయితే, మీ మొబైల్ డివైజ్‌లో OneNote మొబైల్ ప్రోగ్రాం ఇన్‌స్టాల్ చెయ్యడానికి సంబంధించిన ఆటోమేటిక్ సందేశం వస్తుంది. మీ పీసీలో OneNote 2007ను తెరచి, పీసీకి మీ మొబైల్ డివైజ్‌ను కనెక్ట్ చేసి, టూల్స్ మెనూ నుంచి OneNote మొబైల్‌ను స్వయంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.