మెరుగైన ప్రజెంటేషన్లకు ఆఫీస్ పవర్‌పాయింట్ 2007

విస్తృత పురోగతి, భద్రత, సులభంగా పంచుకునే సౌలభ్యంతో కూడిన అత్యంత ప్రభావవంతమైన, డైనమిక్ ప్రజెంటేషన్ల రూపకల్పనలో యూజర్లకు అండగా నిలుస్తుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్‌పాయింట్ 2007.
నూతన అనుభూతినిచ్చే దీని సరికొత్త ఆకృతి మీ ప్రజేంటేషన్ల రూపకల్పన, సమర్పణ, పంపిణీ కార్యకలాపాలను సులభతరం చేసి సహజసిద్ధమైన అనుభవాన్ని కల్గిస్తుంది. ఇందులోని శక్తిమంతమైన ఫీచర్లు, దీని సామర్థ్యాలు దృష్టి మరలనివ్వకుండా చేసి ఆశించిన ఫలితాల్ని త్వరితగతిన, సులభంగా రాబట్టేలా సహకరిస్తాయి.
ఆఫీస్ పవర్‌పాయింట్ 2007 ఉపయోగించి సంబంధాలు సూచించాలా, క్రమానుగత చిత్రాల్ని సిద్ధం చేసుకోవచ్చు. బులెట్ల జాబితాను SmartArt డయాగ్రంగా మార్చుకోవచ్చు లేదా ఉన్న డయాగ్రంలను మార్చుకోవచ్చు, ఇంకా మెరుగుపరచుకోవచ్చు. సందర్భాన్ని బట్టి ఉపయోగించుకునేలా ఇందులోని డయాగ్రమింగ్ మనూలతో శక్తిమంతమైన ఫార్మాటింగ్ ఆప్షన్ల ప్రయోజనాలను యూజర్లు సులభంగా వాడుకోవచ్చు.
ఒక ప్రజెంటేషన్‌లోని అంశాలను మరొక ప్రజెంటేషన్‌లో పునర్వినియోగం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షేర్‌పాయింట్ 2007 మద్దతుతో పవర్‌పాయింట్ స్లయిడ్ లైబ్రరీల ద్వారా ప్రజెంటేషన్లను వేర్వేరు స్లయిడ్లుగా ఒక సైట్‌లో ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆఫీస్ పవర్‌పాయింట్ 2007లో వాటిని సులభంగా మరోమారు ఉపయోగించుకోవచ్చు. ప్రజెంటేషన్ల రూపకల్పనలో ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. తర్వాత మీరు చేర్చే ఏ స్లయిడ్ అయినా సర్వర్ వెర్షన్‌తో సింక్రనైజ్ అవుతూ మీ కంటెంట్ ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉంటుంది.
ఇతరులతో పంచుకోవడం కోసం మీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లను XPS, PDF ఫైళ్ల రూపాల్లోకి మార్చుకోవడం ద్వారా విస్తృతమైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్‌పాయింట్ 2007 ఉపయోగించి మీకు కావలసిన రీతిలో స్లయిడ్ లేఅవుట్లను తయారు చేసుకుని పొందుపరచుకోవచ్చు. ఇందువల్ల మీ లేఅవుట్లను కట్ చేసి కొత్త స్లయిడ్లలోకి పేస్ట్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకోవలసిన పనిలేదు. మీకు కావలసిన రీతిలో చేసుకున్న ఈ స్లయిడ్లను పవర్‌పాయింట్ స్లయిడ్ లైబ్రరీల ద్వారా పంపిణీ చేసుకోవచ్చు. ఫలితంగా మీ ప్రజెంటేషన్లు ఒక సమన్వయంతో, నైపుణ్యత ఉట్టిపడేలా కనిపిస్తాయి.
ఒకే ఒక్క క్లిక్ ద్వారా మీ మొత్తం ప్రజెంటేషన్ కనిపించేతీరు, కల్గించే అనుభూతిని మార్చేయడానికి డాక్యుమెంట్ థీమ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. మీ ప్రజెంటేషన్‌లో కేవలం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒక్కటేకాదు, ఇతర రంగులు, స్టయిల్స్, డయాగ్రంలు, పట్టికలు, చార్ట్‌లు, ఆకృతులు, పాఠంలోని ఫాంట్లను మార్చవచ్చు.
సరికొత్త SmartArt గ్రాఫిక్ టూల్స్, ఎఫెక్ట్‌లతో ఆకృతులు, పాఠం, గ్రాఫిక్స్‌లో సవరణ చెయ్యవచ్చు. మీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో ఇతరుల జోక్యానికి అవకాశం లేకుండా మీరు డిజిటల్ సిగ్నేచర్‌ను చేర్చవచ్చు. మరెవరూ మార్పులు చెయ్యకూడని ప్రజెంటేషన్లలోని సమాచార పరిరక్షణ కోసం, సరైన సమాచారాన్నే పొందుపరిచేలా యూజర్లకు చేయూతనిచ్చే క్రమంలో కంటెంట్ కంట్రోల్స్‌ను ఉపయోగించుకుని స్టక్చర్డ్ పవర్‌పాయింట్ టెంప్లేట్లను మీరు తయారుచెయ్యవచ్చు.