నిర్వహణలో సౌలభ్యతకు ఆఫీస్ ప్రాజెక్ట్ 2007
వాడుకలో అనుకూలత, సామర్థ్యం, సౌలభ్యతలను సమానస్థాయిలో అందించే ప్రాజెక్ట్ మేనేజిమెంట్ సాధనాలను సమకూర్చుతుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రాజెక్ట్ 2007. దీనితో మీ ప్రాజెక్ట్‌లను మరింత సమర్థవంతంగాను, ప్రభావవంతంగాను నిర్వహించుకోవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రాజెక్ట్ కార్యకలాపాలు, ప్రణాళికలు, ఫైనాన్స్ వ్యవహారాలను నియంత్రిస్తూ, ప్రాజెక్ట్ టీమ్స్‌ను సమన్వయపరుచుకుంటూ మీరు మరింత ఉత్పాదకతను సాధించవచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని పరిశీలిద్దాం...
ట్రేస్
టాస్క్ డేట్లను ప్రభావితం చేసే అంశాలను ఇందులో త్వరితగతిన నిర్ణయించవచ్చు. జవాబుదారీతనాన్ని మరింతగా పెంచే అంశాల మూలాలను సులభంగా గుర్తించవచ్చు. ఒక టాస్క్‌కు సంబంధించిన ప్రారంభతేదీ కారణాంశాన్ని (టాస్క్ డిపెండెన్సీ, క్యాలెండర్ కన్‌స్ట్రెయింట్స్, షెడ్యూల్డ్ డేట్, వెకేషన్ టైమ్ వంటివి) నిర్ణయించడంలో టాస్క్ డ్రైవర్లు మీకు సహకరిస్తాయి. ఎక్కడైనా జాప్యం సంభవించినప్పుడు దాని మూలకారణ పూర్వాపరాలను గుర్తించేందుకు వెనక్కివెళ్లి కారణాంశాల శ్రేణిని పరిశీలించవచ్చు.
ఫైనాన్స్ కంట్రోల్స్
ఇక్కడి బడ్జెట్ ఫీల్డ్‌తో మీరు ప్రాజెక్ట్‌లు, ప్రోగ్రామ్‌లకు బడ్జెట్ కేటాయింపులు చెయ్యవచ్చు. 'కాస్ట్' అనే కొత్త రిసోర్స్ టైప్ వ్యయం అంచనాను మెరుగుపరుస్తుంది, ట్రాకింగ్ చేస్తుంది. ఇతర కాస్ట్ ఎన్‌హేన్స్‌మెంట్స్ విషయానికి వస్తే... ప్రాజెక్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్‌లో ట్రాక్ చేయబడి ఫైనాన్షియల్ ఫీల్డ్స్‌కు మ్యాప్ చేసే కాస్ట్ కోడ్ లాంటి మరిన్ని ప్రీడిఫైన్డ్ ఫీల్డ్స్ ఉంటాయి.
చార్టింగ్
ప్రాజెక్ట్ డేటా ఆధారంగా PivotTable views, చార్ట్‌లు, గ్రాఫ్‌లు, డయాగ్రంలను రూపొందించేందుకు గాను ఇందులోని విజువల్ రిపోర్ట్స్ ఫీచర్ Microsoft Office Excel, Microsoft Office Visio Professionalను ఉపయోగించుకుంటుంది. యూజర్లు ఎంతో సులభంగా కస్టమ్ రిపోర్ట్ టెంప్లేట్లను నిర్వచించి వాటిని ఇతర ప్రాజెక్ట్ యూజర్లతో పంచుకోవచ్చు.
టెంప్లేట్లు
సమయాన్ని ఆదా చేసుకోవడానికిగాను ఒక టెంప్లేట్‌తో ప్రీపాపులేట్ చేసుకొని మీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించండి. మీకు కావలసినట్లుగా ఒక కస్టమ్ టెంప్లేట్ సిద్ధం చేసుకోండి లేదా ఆఫీస్ ప్రాజెక్ట్ స్టాండర్డ్ 2007లో పలు కొత్త టెంప్లేట్లలో ఒక దానిని ఉపయోగించుకోండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆన్‌లైన్ ద్వారా వెబ్ నుంచి టెంప్లేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ గైడ్ సాయంతో దశలవారీగా ఇంటరాక్టివ్ వ్యవస్థ సహాయంతో ప్రాజెక్ట్ మేనేజిమెంట్ ప్రక్రియపై పట్టు సాధించండి. ఫలితంగా మీ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు, టాస్క్‌ల నిర్వహణ, వనరులు, తాజా పరిస్థితి పరిశీలన, ప్రాజెక్ట్ సమాచార నివేదికల్లో తోడ్పాటు లభిస్తుంది.