విండోస్ 7... ఒక నూతన ప్రపంచం
మీరు కోరుకుంటున్న విధంగా మీ పీసీ పనిచేసేలా మరింత వేగం, విశ్వసనీయమైన పనితీరును అందించడానికి తగినట్లుగా మీ ముందుకు వచ్చింది Windows 7. మరింతగా కేంద్రీకృత కార్యకలాపాలు, అప్లికేషన్లు, హార్డ్‌వేర్‌తో పూర్తిగా అనుగుణ్యతను ఏర్పరిచే లక్ష్యంతో విండోస్ పరంపరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ జరిగేలా Windows 7ను తీర్చిదిద్దారు. భాషా ఇండియా ఐఎంఇల ద్వారా భారతీయ యూజర్లు భారతీయ భాషల తోడ్పాటుతో Windows 7ను ఉపయోగించుకోవచ్చు.
కొత్త ఫీచర్లు ఎన్నెన్నో...
మీరు మెచ్చిన చిత్రాలు, పాటలు, వెబ్‌సైట్లు, డాక్యమెంట్లను వేగంగా పొందేందుకుగాను Jump Lists అనే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మెరుగైన థంబ్‌నెయిల్ ప్రీవ్యూలకు, ఈజీ-టూ-సీ ఐకాన్స్, మరింతగా కస్టమైజేషన్‌కు విండోస్ టాస్క్‌బార్ చేయూతనిస్తుంది. Sleep, పునఃప్రారంభ కార్యకలాపాలు త్వరితగతిన జరిగేలా మెరుగైన పనితీరును గమనించవచ్చు. మెమరీని తక్కువగా వినియోగించుకోవడం, USB సాధనాలను వేగంగా గుర్తించడం ఇందులోని ప్రత్యేకతలు.
HomeGroup...
WindowsConnect Now అనే మరో ఫీచర్‌తో మీ వైర్‌లెస్ హోం నెట్‌వర్క్‌ను కేవలం ఒక బటన్ పుష్‌తో ఏర్పాటు చేసుకోవచ్చు. "Compatible with Windows 7" అనే స్టిక్కర్ ఉన్న Wi-Fi router కొనండి చాలు. నెట్‌వర్క్ సెటప్ పూర్తయిన తర్వాత View Available Networks అనే కొత్త మెనూ ద్వారా సులభంగా కనెక్ట్ కావచ్చు. టాస్క్‌బార్‌లో Wi-Fi, మొబైల్ బ్రాడ్‌బ్రాండ్, డయల్-అప్, లేదా కార్పోరేట్ VPN వంటి మీ ఆప్షన్లన్నిటినీ చూడవచ్చు. మరికొన్ని క్లిక్‌లతో మీ పని పూర్తవుతుంది.
Laptop బ్యాటరీలకు మరింత జీవితకాలం...
మీ Laptop బ్యాటరీల జీవితకాలాన్ని మరింత పెంచేందుకు తగినట్లుగా Windows 7 రూపకల్పన జరిగింది. ఉదాహరణకు, మీరు Laptop ఉపయోగించని సమయాల్లో Ethernet jackకు విద్యుత్‌ను నిలిపివేస్తుంది. మరింత ఎక్కువ సమయంపాటు కంప్యూటర్‌ను వాడకుంటే... అత్యధికంగా విద్యుత్‌ను ఉపయోగించే మీ LCD స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా డిమ్ చేస్తుంది.
లైబ్రరీలు...
Windows 7లోని మరో సరికొత్త ఫీచర్ లైబ్రరీ. దీని ద్వారా మీ ఫైళ్లను గుంపులుగా చేసుకోవచ్చు. ఆ ఫైళ్లు ఏ స్థానాల్లో ఉన్నప్పటికీ, ఏ పేర్లతో పిలవబడుతున్నప్పటికీ ఇది సాధ్యమే. లైబ్రరీలో 50 లొకేషన్లవరకూ చేర్చవచ్చు. మీరు కూడా కొత్త లైబ్రరీలను ఏర్పాటు చేసుకుని ఏ పేర్లతో అయిన పిలువవచ్చు. ఉదాహరణకు ఒక ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్లూ ప్లింట్లు, కాంట్రాక్ట్‌లు, ఫొటోలను ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసుకోవచ్చు.
Windows Touch
టచ్ స్క్రీన్ పీసీకి Windows 7ను జత చెయ్యడం ద్వారా దీనిని పూర్తిగా వేలి స్పర్శతో నియంత్రించవచ్చు. మల్టీ టచ్ టెక్నాలజీకి మద్దతునిస్తూ ఎన్నిటినో సాధ్యం చేసే కొత్త ప్రపంచానికి Windows 7 తలుపులు తెరుస్తుంది. Internet Explorer 8లో మీ చేతివేలును తెరపైన పైకి కిందికి జరపడం ద్వారా వెబ్ పేజీలను స్క్రోల్ చేసుకోవచ్చు. Photo Viewerలో మీ చేతి వేళ్ల కదలికతోనే ఫోటోలను zoom in చేసుకోవచ్చు లేదా ఏ కోణంలోకైనా తిప్పుకోవచ్చు.
Windows 7 కోసం వెలువడిన Microsoft Touch Pack ఎన్నో విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తుంది. కొన్ని టచ్ స్క్రీన్ పీసీలతో వచ్చే ఈ కొత్త ప్యాక్‌లోని 3-డి వర్చువల్ ఎర్త్‌తో మీరు అరచేతిలోనే ప్రపంచాన్ని చూడవచ్చు