| బెంగాలి – గంగ హృదయం నుంచి |
| అతి గాఢమైన సాహిత్యానుబంధాలు కలిగిన భారతీయ భాష బెంగాలి (లేదా బంగ్లా) మూలం బహుశః ఎన్నో శతాబ్దాలది. ప్రబలమైన ఈ భాష చేసిన యుగాల పయనాన్ని ఈ వ్యాసం చూస్తూంది. |
| దాదాపు 100 బి.సి. ప్రాంతంలో గ్రీకులు పేరు పెట్టిన గంగారిదై అన్న ప్రదేశంలో బెంగాలి గురించిన మొట్టమొదటి చారిత్రక సూచనలు ఉన్నాయి. ఈ "బెంగాలి" అన్న పేరు "గంగాహృద్" (గంగను తన హృదయం లో పెట్టుకొన్న భూమి) అన్న పదం నుంచి, ఆ ప్రదేశాన్ని, అక్కడ నివసిస్తూన్న ప్రజలనీ గుర్తిస్తూ వచ్చిందని ఊహిస్తున్నారు. |
| ఈనాడు బెంగాల్ ప్రజలు మాట్లాడే బెంగాలి అనే భాష, భారత దేశంలో హింది తర్వాత అతి ఎక్కువగా వాడుకలో ఉండి, 207 మిలియన్ల వక్తలతో ప్రపంచమంతా వ్యాపించిన భాష. శబ్ద వ్యుత్పత్తి శాస్ర్తం ప్రకారం, బెంగాలి , అస్సామీస్, ఒరియా, మైథిలి తోపాటు, ఇండో ఆర్యన్ భాషల సమూహపు పూర్వ మగధ శాఖకు చెందినది. ఈ నాలుగు భాషలు పరస్పరం స్పష్టంగా లేకపోవడం, వీటి ఉమ్మడి మూలం గురించి సూచిస్తూండగా, వీటి నిర్మాణం, క్రమం, శబ్దాలలో చెప్పుకోదగ్గ పోలికలు కనిపిస్తున్నాయి. |
| హింది, సంస్కృతానికి వాడే దేవనాగరి లిపిని పోలిన బ్రాహ్మిని ఉపయోగించి బెంగాలి వర్ణమాల వ్రాయబడింది. 12 అచ్చులు, 52 హల్లులతో వర్ణమాల ఒక అక్షరాల గొలుసు కట్టు. ప్రతి హల్లు, ఒక సహజంగా పొదిగిన అచ్చుశబ్దంతో కూడి ఉంటుంది. వివిధ రకాలైన ఎంపికలతో అచ్చులను పలకవచ్చు. వాటిని విడి అక్షరాలుగా వ్రాయవచ్చు, ఒక హల్లుతో వివిధ రకాలైన బేధాన్ని తెలియచేసే గుర్తులుగా, దాని పైన, క్రింద, ముందు, వెనుక వాడనూ వచ్చు. పొదిగిన అచ్చుశబ్దాన్ని, మార్చడానికి, (లేదా తగ్గించడానికి) బేధాన్ని తెలియచేసే గుర్తులను అదనంగా వాడవచ్చు. కొన్ని సార్లు, రెండు లేదా మూడు సంకేతాలను కూర్చి, సంయుక్త హల్లులను గుర్తింప వచ్చు. అస్సామీస్ వ్రాయడానికి కొద్దిపాటి మార్పులతో, బెంగాలి లిపిని వాడుతారు. |
| అయినా, 18వ శతాబ్దం వరకు, వివిధ రకాలైన వ్యాకరణ సూత్రాలతో, మార్పులు పొందుతున్న మాండలీకాల ఒక సంగ్రహంగా బెంగాలి ఉండి పోయింది. ఈ మాండలీకాలలో ఉమ్మడిగా ఉన్న వ్యాకరణ సూత్రాలపై యూరోపియన్ మరియు, ప్రాంతీయ విద్వాంసులు సడలని కృషి చేసారు. భవల్ లో ప ని చేస్తున్న, మనోఎల్ ద అస్సమ్ప్కామ్ అను పోర్చుగీసు మత ప్రచారకుడు 1734 మరియు 1742 మధ్య మొట్టమొదటి వ్యాకరణ సూత్రాలను వ్రాత పూర్వకంగా "వొకాబులోరియో ఎమ్ ఇడియోమా బెంగెల్లా, ఇ పోర్చగీస్ డివిడిడో ఎమ్ డుఆస్ పార్టీస్"లో నిర్వహించాడు. కానీ, నెథానియల్ బ్రాసీ హాల్హెడ్ అను బ్రిటిష్ వ్యాకరణ శాస్ర్తజ్ఞుడికి, బంగ్లా లిపిని, అక్షరాలను ఉపయోగించి మొట్టమొదటి వ్రాత ప్రతిని 1778 లో "ఎ గ్రామర్ అఫ్ ది బెంగాల్ లాంగ్వేజ్" అన్న శీర్షికతో వ్రాసిన ఘనత దక్కింది. గొప్ప బెంగాలి సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్, "గ్రామర్ అఫ్ ది బెంగాలి లాంగ్వేజ్" అన్న శీర్షికతో పుస్తకాన్ని 1832 లో ప్రచురించాడు. |
| మాండలీకాల వ్యత్యాసంలోని దశలు బెంగాలి లో వివిధ రూపాలలో ఉంటుంది. అలాంటి ఒక వ్యత్యాసం వ్యాకరణ సూత్రాలపై ఆధార పడడం నుంచి, సంస్కృతీకరణ నుంచి ఉత్పన్నమైంది. షాధు భాష (అక్షరాలా "సాధువుల భాష", దీనిని శుద్ధో భాష అని కూడా అంటారు), మరియు, ఛోల్తి భాష (అక్షరాలా "వ్యావహారిక భాష", దీనిని ఛోలితో భాష, ఛోలిత్ భాష అని కూడా వ్యావహారిక భాషలో అంటారు), దీని వల్ల ఏర్పడిన రెండు విభాగాలు. "జన గణ మన" (రబీంద్రనాథ్ ఠగూర్ వ్రాసింది), మరియు " వందే మాతరం" (బంకించంద్ర చటర్జీ వ్రాసింది) నిజానికి , బెంగాలి యొక్క ఎంతో పరి శుద్ధమైన షాధు భాష రూపంలో వ్రాయ బడ్డాయి. కానీ, షాధు భాష, ఎక్కువగా, సాహిత్యానికి , సంప్రదాయక వాడుకలకు పరిమిత మయ్యింది. |
| ఛోల్తి భాష ప్రామాణిక ఉచ్ఛారణతో ఉండటంతో, ఈనాటి పెక్కు బెంగాలి సాహిత్యపు అక్షర లక్షణానికి ఇది ఆధారంగా ఉంటూంది. హుగ్లీ నది క్రింది భాగాన ఉన్న జిల్లాల నుంచి వచ్చిన విద్యావంతులైన కొలకత్తా వాసులు మాట్లాడే మాండలీకం నుంచి అభివృద్ధి చేయబడిన రూపం నుంచి తయారైనదిది. అధికంగా సంస్కృతమే ఆధారంగా ఉన్నా, ఛోల్తి భాష తన పదజాలాన్ని ఆంగ్లం, అరాబిక్ మరియు పర్షియన్ మూలాల నుంచి పొందింది. ఖచ్చితంగా సాహిత్య పరంగా చూస్తే, సాంప్రదాయక మైన షాధు భాష బెంగాలి నుంచి, ఛోల్తి భాష చెప్పుకోదగ్గ మార్పులనెన్నో పొందింది, ప్రముఖంగా, తగ్గించిన క్రియా రూపాలు, హల్లుల సాధారణత్వం మరియు అచ్చుల హెచ్చుదలలో. |
| హుగ్లీ నది ఇరు ఒడ్డులా నివసించే బెంగాలీలు మాట్లాడే భాషలో మరో రకమైన వైవిధ్య రూపం ఉంది. "ది పూర్బో పశ్చిమ్ డివైడ్" గా విస్తృతంగా తెలిసిన ఈ విబేధం ప్రాథమికంగా, పాలటో ఆల్వియోలార్ అఫ్రికేట్ల ఉచ్ఛారణలో ఉంది. బ్రిటిష్ వారి బెంగాల్ పరిపాలనలో చేసిన ప్రామాణికత్వపు ఉద్యమంలో పడమటి ("పొశ్చిమ్") వాక్ రూపాన్ని ప్రామాణికం చేస్తూ, విబేధాన్ని ఇంకా ఎక్కువ చేసారు. అయినా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోనూ, బంగ్లా దేశ్ లోనూ వాడుకలో ఉన్న వాక్ రూపాలలో (పూర్బో మరియు పశ్చిమ్ మాండలీకాలు ప్రముఖంగా వాడుకలో ఉన్న ప్రాంతాలు ) చెప్పుకోదగ్గ వ్యత్యాసం కనుపించదు. |
| బెంగాలి పై ఇతర భాషల ప్రభావం, మూడవ విబేధానికి దారి తీస్తుంది. 12వ శతాబ్దం ఎఢి వరకు బౌద్ధ పాల మరియు మల్ల వంశస్థుల అధికారం, వెనువెంటనే తురుష్కుల మరియు మొగలాయిల దాడి, ఆక్రమణలు బెంగాల్ ప్రజలలో వైవిధ్యమైన సాంప్రదాయక సంస్కృతులను సృష్టించాయి. దీనివల్ల, బెంగాలి ప్రజలలోని ఒక విభాగం, సంస్కృతం నుంచి ఉత్పన్నమైన బెంగాలి రూపాన్ని వాడితే, మరొక విభాగం, పర్సో – అరాబిక్ మూలాల నుంచి ఉత్పన్నమైన నిఘంటువును వాడుతుంది. |
| భారత దేశం లోని ప్రముఖులైన సాహితీవేత్తలు బెంగాల్ ప్రాంతం నికి చెందిన వారే. రబీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నొబెల్ బహుమానం పొందిన "గీతాంజలి", ఇస్లాం యొక్క తీవ్రమైన శౌర్యం కాజి నజ్రుల్, శరత్ చంద్ర ఛటోపాధ్యాయ యొక్క వైవిధ్యపు పొరల సంక్లిష్ట తత్వాన్ని కలిగిన గ్రామీణ జీవన సరళి, మైఖేల్ మధుసూదన్ దత్త యొక్క "మహాభారతం" మీది పద్యాలు, అన్నీ ఈ గంగ భాషలో వ్రాయబడినవే. బెంగాలి ఇప్పటికీ ఈ సాహిత్యపరమైన శౌర్యపు ముద్రను చేపట్టి ఉంది, ఇంకా భారత దేశపు గొప్ప రచయితలను తయారు చేస్తూనే ఉంది. |
| భారత దేశపు చైతన్య స్రవంతిలో బెంగాలి ఎల్లప్పటికీ, వందేమాతరంను, జాతీయ గీతాన్ని, భావ గర్భితంగా, అతి పవిత్రమైన నది హృదయం నుంచి ఉత్పన్నమైన భాషలో మృదువుగా పాడుతూంటుంది. | |
|
|