| తమిళ్ - యుగాల నుంచి చేస్తున్న పయనం |
| దక్షిణాదిలోని ప్రసిద్ధి చెందిన రచనలకు, అత్యుత్తమ రచయితలకు తమిళనాడు పుట్టినిల్లుగా నిర్ణయించ బడినది. బహుశః హింది సినిమా కేంద్రం బాలీవుడ్ తర్వాత అతి పెద్దదైన సినిమా పరిశ్రమ కూడా. దక్షిణాది భాషలలో పురాతనమై, అతి జనారంజకమైన భాషలలో ఒకటైన తమిళ్ కు కూడా పుట్టినిల్లు. ఈ వ్యాసం, తమిళ్ పరిణామపు మరియు చరిత్రయొక్క జాడచూస్తూంది. |
| 74 మిలియన్ల కంటె ఎక్కువ జనాభా ప్రపంచమంతటా మాట్లాడుతున్నది, బాగా స్థిర పడినట్టిది, రెండువేల సంవత్సరాల కంటె అధికంగా విస్తరించిన నిరంతర చరిత్ర కలిగినది, దక్షిణాది భాషలలో బహుశః అత్యంత శక్తివంతమైనది – తమిళం. సహస్రాబ్దులకు విస్తరించిన గొప్పసాహిత్య చరిత్ర ఆధారంగా, ఇటీవలి కాలంలో, తమిళ్ ను అధికారికంగా, ఒక ఉదాత్తమైన భాషగా గుర్తించారు. లాటిన్, గ్రీక్ (హెల్లెనిస్టిక్), మరియు సంస్కృతం వంటి ఇతర భాషలతో స్థానాన్ని పంచుకొంటూ, ఈ గౌరవాన్ని పొందుతున్నవాటిలో, తమిళం మొట్టమొదటి సజీవమైన భాష (తన మూల రూపంలో నిరంతరంగా ఉపయోగింపబడుతున్నది). |
| తమిళం యొక్క పరిణామపు నిర్దిష్టమైన కాలక్రమానుసరణం గురించి ఎన్నో దశాబ్దాల నుంచి పరిశోధిస్తూనే ఉన్నారు. 300. బి.సి. కంటె ముందే బ్రాహ్మి లిపి నుంచి తమిళ్ వ్రాతలు ఉత్పన్నమవడం , ఈ ప్రతిబంధకానికైన కారణాలలో ఒకటి. ఏమైనా, ఈ రాతప్రతులు తాళపత్రాల మీద ఉండడం వల్ల, ఇవి మరీమరీ వ్రాసినట్టు తెలుస్తూండడంతో, రాతప్రతుల మీద ఈ తేదీలను సూచిస్తున్న కాలానుసరణ దీనిని గురించి ఒక నిర్ధారణ నివ్వలేక పోతున్నాయి. అన్నిటికంటే ముందు కనుగొన్న ప్రతి ,3వ మరియు 2వ బి.సి. శతాబ్దాల మధ్య ఉత్పాదమైన – తోల్కప్పివమ్, తమిళ కావ్య రచనకు, వ్యాకరణానికి ఒక నిర్వచనం. ఈ భాష 1000 బి.సి. నుంచి ఉంటున్నట్టుగా, ఇటీవలి 2005 తవ్వకాలు నిరూపిస్తున్నాయి. తమిళ సాహిత్య చరిత్ర లో, మరొక గొప్ప కావ్యం, తోల్కప్పివమ్ కాలం లోనే వ్రాయబడిన సిలప్పాదికారం (ది ఆంక్లెట్ – అందె). మనిమేగలై, సీవగ సింధామణి, వలయాపాతి, కుండలకేసి తోపాటు, సిలప్పాదికారం కూడా, తమిళ సాహిత్యంలోని పంచ మహా కావ్యాలలో ఒకటి. సంగం, కుమారిక్కందం, తిరుక్కురల్, ఆతిచూడి, ముతోల్లాయిరం, పెరియ పురాణం, దివ్య ప్రబంధనం, తిరుప్పావై, తిరువెంపావై మరియు ధేవారం వంటి ఇతర గొప్ప రచనలు తమిళ సాహిత్యపు గొప్పదనాన్ని నిర్ధరించడానికి చక్కటి ఉదాహరణలు. |
తమిళ పరిణామాన్ని ఒక సాంస్కృతిక మాధ్యమంగా, ఆధునిక భాషా విజ్ఞానులు, మూడు కాలాలుగా విభజించారు:
- పురాతన (200 బి.సి. నుంచి 700 ఎ.డి. వరకు అభివృద్ధిని పరిగణిస్తూ)
- మధ్యకాలీన (700 ఎ.డి. నుంచి 1500 ఎడి వరకు ఆధారాలను చూపుతూ)
- ఆధునిక (1500 ఎ.ఢి. నుంచి నేటి వరకు తమిళ్ యొక్క గొప్పదనాన్ని చూపుతూ)
|
| దీని పరిణామంమీద సంస్కృతపు ప్రభావం మధ్య కాలంలో అత్యంత పరిణితిలో ఉందన్నది తమిళ నిఘంటువు లో సంస్కృత మూలమున్న పదాలు అనేకంగా ఉండటం నిరూపిస్తుంది. |
| సమాజం లోని ప్రతి విభాగానికీ అనకూలించే విధంగా ఈ భాష నిర్మాణం, ఉపయోగ విధానాలూ ఉండడం, బహుశః దీని నిరంతర సంపన్నతకు కారణంకావచ్చు. భాషా శాస్త్రంలో డైగ్లాసియా గా పిలువబడే ఈ పరిస్థితి, తమిళ భాష నిరంతర జనాదరణకు ప్రముఖ కారణంకాగా, దీనికి విరుద్ధంగా, పూర్వీకుల అధికారిక , వైవిధ్య మైన భాష కొద్దిగా దిగజారడానికి కూడా ఇదే కారణం. |
| "చెంతమిళ్" అన్న ఉదాత్తమైన తమిళ రూపం , ప్రస్తుతం, సమాజంలో అధిక జనాభాచే వాడబడుతున్న వ్యావహారిక రూపమైన "కొండున్ తమిళ్" నుంచి బాగా విబేధించి ఉంది. కానీ, కళలు, దేవాలయ శాసనాలు, కవిత్వం, సాహిత్య, న్యాయాలయ పత్రాలు, మొదలైనవాటిలో చెంతమిళ్ విస్తృతంగా వాడబడడం వలన, చారిత్రక సాక్ష్యాధారాలు ఉన్నప్పటినుంచి ఈ డైగ్లాసియా ఉన్నట్టు నిరూపణ అయ్యింది. అయినా, వివిధ ప్రాంతాల మధ్య, సామాజిక తరగతుల మధ్య సామాన్యంగా భావ ప్రకటనకు, సంప్రదాయకంగా అనేక విధాలుగా మాట్లాడే తమిళ్ , కొండున్ తమిళ్, చక్కగా అమిరింది. |
| అశోక చక్రవర్తి కాలం లోని బ్రాహ్మి లిపి నుంచి ఉద్భవించినదని నమ్మినట్టి , నేటి రూపానికి పరిణితి చెందిన తమిళ్ వ్రాత ఉచ్ఛారణ పద్ధతి ననుసరించినది. పిమ్మట, బ్రాహ్మి యొక్క ఒక వైవిధ్య రూపం సంస్కృతం, తమిళ్ రెండూ వ్రాయ గలిగిన గ్రంథా లిపి పరిణామం చెందింది. 6వ మరియు 10వ శతాబ్దాల ఎ.డి. మధ్యకాలంలో, "వెట్టెన్ ఝుతు" (కత్తిరింప బడిన అక్షరాలు అని అర్థం) అన్న ఒక కొత్త లిపి శిలా శాసనాలు వ్రాయడానికి ఉద్భవించింది. అందులో వాడి మొనలను వంపులుగా మార్చి ఉండటంతో కొంతమంది దీనిని "వట్టెన్ ఝుతు" (అంటే వంపులతో ఉన్న అక్షరాలు) అని ఔత్సాహికంగా అన్నారు. హల్లులకు అక్షర ప్రాముఖ్యతను గుర్తించే ఓవర్ డాట్ డయాక్రిటిక్ , కొన్ని సంయుక్త అచ్చులకు బంధాలు, తర్వాతి శతాబ్దాలలో భాషా శాస్రంలోని మార్పులుగా ప్రవేశ పెట్టబడినాయి. |
| తమిళ అక్షరమాలలో 12 అచ్చులు, 18 హల్లులు , వాటి చేరిక వల్ల 216 సంయుక్తాక్షరాలు ఉన్నాయి. అంతేకాక, పూర్తిగా, వ్యాకరణ పరంగా, స్వతంత్ర అచ్చుగా (లేదా సాధారణ హల్లుకు డాట్ డయాక్రిటిక్) ఉపయోగింపబడే ఒక ప్రత్యేకమైన అక్షరం "ఆయ్ త ఎజుత్తు" ఉంది, దీనితో, 247 అక్షరాలు మాలలో రాగలవు. అచ్చులను ఉవిర్ ఎజుత్తు (అంటే జీవాక్షరాలు) అంటారు, ఇందులో ఐదు హ్రస్వాలు, ఐదు దీర్ఘాలు, రెండు సంయుక్తాలు... హల్లులు మూడు విభాలు, ఒక్కొక్క విభాగంలో ఆరు హల్లులుంటాయి. - వల్లినం (పరుషం), మెల్లినం (సరళం), ఇదయినం (మధ్యస్థం). కొద్ది సంఖ్యలో ఉన్న హల్లుల సమూహాలతో, ఒత్తక్షరాలు, కంఠధ్వని నిలుపుదలలు లేకుండా, కంఠధ్వనితోనూ, అది లేకుండానూ చేసే శబ్దాలతో (రెండూ మాట్లాడే భాషలో ఉన్నాయి.) తమిళ్ మిగతా భాషలకంటే, ఎంతో విభిన్నమైనది. |
| ఆధునిక పదజాలంలో కూడా ప్రామాణిక తమిళ పదాలను నిలిపి ఉంచడం తమిళ భాష నిత్యత్వానికి మరో ఉదాహరణ . దీనితో పాటు, తిరుక్కురల్ వంటి ప్రామాణిక రచనలకు సంస్థల అంగీకారం ప్రామాణిక తమిళ్ ను, ప్రాంతీయ తమిళ భాష మాట్లాడేవారికి వివిధ అంతస్తులలో నేటివరకు కూడా గ్రహించడానికి వీలయ్యింది. ఆధ్యాత్మిక పదజాలం, భావార్థక శబ్దాలలో సంస్కృత పదాలు విరివిగా వాడబడినాయి. కొన్ని పర్షియన్ మరియు అరాబిక్ పదాలు కూడా ఉండడం చేర, చోళ మరియు పాండవుల కాలంలో క్రియాశీలక వ్యాపార సంబంధాలను సూచిస్తూంది. ఇటీవలి కాలంలో ఆంగ్ల పదాలు వ్యవహారిక భాషలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా, ఆధునిక సాంకేతిక పదజాలంలో. |
| ఆంగ్ల నిఘంటువుకు తమిళ్ ఎన్నో పదాలను చేర్చింది. క్యాష్ , చెరూట్, మాంగో, కాటమెరాన్, మల్లిగటానీ ఇవన్నీ, తమిళ్ నుంచి ఇతర భాషలకు వలస పోయిన పదాల కొన్ని ఉదాహరణలు. ది సమ్మర్ ఇన్స్ట్టిట్యూట్ అఫ్ లింగ్విస్టిక్స్ తమిళ భాష కు, ఆది ద్రావిడ, అయ్యర్, అయ్యంగార్, అరయ, బుర్గంది, కసువ, కొంగర్, కొరవ, కొర్చి, మద్రాసి, పెరికల, పట్టపు భాష, శ్రీలంక తమిళ్, మలయ తమిళ్, బర్మా తమిళ్, సౌత్ ఆఫ్రికా తమిళ్, తిగలు, హరిజన్, సంకేతి, హెబ్బార్, తిరునల్వేలి, మదరై, కొంగు, మరియు కుమారి తో పాటు, ఇరవై రెండు మాండలీకాలున్నాయి . అంతేకాక, ఇరుల, కైకడి, బెట్టకురుంబ, షోలగ, మరియు ఎరుకల భాషలు కూడా తమిళ్ కు చేరినవే. కేరళ ప్రజలు మాట్లాడే మళయాలం పదజాలంలోనూ, వాక్యలక్షణంలోనూ, వ్రాసే పద్ధతిలోనూ, తమిళ భాషను బాగా పోలి ఉంది. |
| తన 2,500 సంవత్సరాల చరిత్రలో తమిళ్ మరియు, అది నిర్వహిస్తున్న సంస్కృతిని, వర్తమానంలో లేకుండానో, లేదా గుర్తింపు లేకుండానో చేయగలిగిన మార్పులు , సవాళ్ళూ నిరంతరం ఎదుర్కొంటూనే ఉంది. కానీ, తమిళ భాష లో చేరిన మృదుత్వం, దేశభక్తుల లాఘవం, సరిహద్దులు దాటి, సముద్రాలలో ఎదురీది ఆధునిక ప్రపంచంలో మూలమూలలా వ్యాపింపచేసి దాని స్థానాన్ని చరిత్రలోనూ, ప్రజల హృదయాలలోనూ పదిలంగా ఉంచి, చరిత్రలో దానికి తగిన స్థానాన్ని, వైభవాన్ని సంపాదించి పెట్టాయి. | |
|
|