| ఇన్ స్క్రిప్ట్ కీ బోర్డ్ తో తెలుగు టైప్ చేయడం. |
| వసంత మూర్తి |
| ఇన్ స్క్రిప్ట్ కీ బోర్డ్ ఉపయోగించి, తెలుగు భాష టైప్ చెయ్యడానికి కొన్ని మెలకువలు క్రింద ఇవ్వడమైనది. మొదటి సారి కాస్తంత కొత్తగా అనిపించినా, టైప్ చేయడానికి ఇది అత్యంత సులభమైనదని మీకే తెలుస్తుంది. |
| ఒక సారి అచ్చులను వరుసగా టైప్ చేసి చూడండి. ప్రతి అచ్చుకూ మీరు తప్పనిసరిగా, షిఫ్ట్ ఒత్తి పట్టుకొనే చెయ్యాలి. |
| హల్లులకు అలా కాదు. క,గ,చ,జ,ట,డ,,త,ద,న,య,ర,ల,వ,స,హ వంటి సరళమైన హల్లులను నేరుగా చేయవచ్చు. చేసి చూడండి. |
| కానీ, ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,ణ,శ,ష,ళ, వంటి పరుషాక్షరాలకు , షిఫ్ట్ ఒత్తి పట్టుకొనే చెయ్యాలి. ఆ తర్వాత క – గుణింతాలు చేయవచ్చు. గుణింతాలకు హల్లు తర్వాత ఏ అచ్చును టైప్ చేస్తే అదే గుణింతం వస్తుంది. షిఫ్ట్ తో అవసరం లేదు. |
| ఆ తర్వాత, సంయుక్తాక్షరాలు టైప్ చేసుకోవచ్చు. సంయుక్తాక్షరం కావాలంటే, ముందు ప్రధాన హల్లును టైప్ చేసి, ‘అ’ ను షిఫ్ట్ లేకుండా ఒత్తి, తర్వాత రెండవ హల్లును టైప్ చెయ్యాలి. ఈ ‘అ’ లింక్ అక్షరంగా పని చేస్తుంది. |
| క్ష,త్ర,జ్ఞ,శ్ర వంటి సంయుక్తాక్షరాలు నేరుగా షిఫ్ట్ ఒత్తి పట్టుకొని టైప్ చేసుకో వచ్చు. అరసున్న, విసర్గ లు కూడా ఎలా టైప్ చేసుకో వచ్చో క్రింద ఇవ్వబడింది. ఇక ఆలస్యం ఎందుకు ? తెలుగులో టైప్ చేసేయండి. |
| shift d |
అ |
|
| shift e |
ఆ |
తెలుగు అక్షరాలు, ‘కా’గుణింతాలు, కొన్ని పదాలు |
| shift f |
ఇ |
ఇన్ స్క్రిప్ట్ లౌఔట్ లో టైప్ చేసే విధానాన్ని క్రింద చూడవచ్చు. |
| shift r |
ఈ |
ఇది కొత్తగా తెలుగు టైప్ చేసే వారికి సహాయం చేయగలదు. |
| shift g |
ఉ |
|
| shift t |
ఊ |
|
| shift = |
ఋ |
|
| shift z |
ఎ |
|
| shift s |
ఏ |
|
| shift w |
ఐ |
|
| shift ~ |
ఒ |
|
| shift a |
ఓ |
|
| shift q |
ఔ |
|
| shift dx |
అం |
|
| shift d shift - |
అః |
|
| k |
క |
|
| shift k |
ఖ |
|
| i |
గ |
|
| shift i |
ఘ |
|
| shift u |
ఙ |
|
| ; |
చ |
|
| shift ; |
ఛ |
|
| p |
జ |
|
| shift p |
ఝ |
|
| shift ] |
ఞ |
|
| ' |
ట |
|
| shift ' |
ఠ |
|
| [ |
డ |
|
| shift [ |
ఢ |
|
| shift c |
ణ |
|
| h |
ప |
|
| shift h |
ఫ |
|
| y |
బ |
|
| shift y |
భ |
|
| c |
మ |
|
| / |
య |
|
| j |
ర |
|
| n |
ల |
|
| b |
వ |
|
| shift m |
శ |
|
| shift , |
ష |
|
| m |
స |
|
| u |
హ |
|
| shift n |
ళ |
|
| shift 7 |
క్ష |
|
| shift 6 |
త్ర |
|
| shift 5 |
జ్ఞ |
|
| k |
క |
|
| ke |
కా |
|
| kf |
కి |
|
| kr |
కీ |
|
| kg |
కు |
|
| kt |
కూ |
|
| k= |
కృ |
|
| kz |
కె |
|
| ks |
కే |
|
| kw |
కై |
|
| k ` |
కొ |
|
| ka |
కో |
|
| kq |
కౌ |
|
| kx |
కం |
|
| k shift - |
కః |
|
| bf shift5e v cg |
విజ్ఞానము |
| shift8r k= shift,dshiftcg [g |
శ్రీకృష్ణుడు |
| kdjq x ; h shift7f |
క్రౌంచపక్షి |
| shift7s shift6 cg |
క్షేత్రము |
| mdbe lx ldjd/a ldm b cg |
స్వాతంత్ర్యోత్సవము | |
|
|