కంప్యూటర్‌ను దారిలో పెట్టే Fix it Center Online
మన PCలు, డివైజ్‌లతో తరచూ ఎదురయ్యే సమస్యల్ని కనిపెట్టి, వాటిని సరిచేసి యూజర్లకు మంచి పని వాతావరణాన్ని అందించేందుకుగాను Microsoft సంస్థ అందిస్తున్న సరికొత్త సదుపాయం Fix it Center Online. కొత్త సమస్యలకు గురికాకుండా మీ కంప్యూటర్‌ను ఎల్లప్పుడూ పరిరక్షిస్తుంది, updatesను పొందుపరుస్తుంది. పలు దశల్లో సమస్యలను విశ్లేషించి, వాటిని సరిచేయడం ద్వారా ఇబ్బందిని నివారించే ఒక ఆటోమేటెడ్ టూల్‌ను Fix it Center మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంచి సహకరిస్తుంది. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త సమస్యలను అడ్డుకునే టూల్స్‌తో మీకు మునుపటికంటే సులభంగా మరింత తోడ్పాటు లభించేలా Microsoft Fix it Center చేస్తుంది.
ఇన్‌స్టాల్ చేయడం, ప్రయోగించడం ఎంతో సులభం....
Fix it Center సెటప్ ప్రక్రియలో సులభంగా ఉపయోగించుకోగలిగిన wizards మీకు మార్గదర్శకత్వం వహిస్తూ ఎల్లవేళలా మీకు అవసరమైన సహకారం అందిస్తాయి.
ఆటోమేటెడ్ ట్రబుల్‌షూటర్స్...
మీ PCలో ఉన్న సమస్య ఏమిటన్నది మీకు స్పష్టంగా తెలియనప్పటికీ ఆటోమేటెడ్ ట్రబుల్‌షూటర్స్‌తో Fix it Center దానిలోని ఇబ్బందులను కనిపెట్టి సమస్యను పరిష్కరిస్తుంది. మీ డివైజ్‌ను విశ్లేషించి, సమస్యను సరిదిద్దేందుకుగాను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత "Find and fix" లేదా "Find and report" అనే ఎంపికల్లో ఒకదానిని మీ ముందుంచుతుంది.
ముందు జాగ్రత్త...
మీ PC పై దాడి చేసే అవకాశాలున్న సమస్యల్ని ముందుగానే గ్రహించి, అవి కార్యరూపం దాల్చకుండా ముందు జాగ్రత్తలతో పరిస్థితిని అదుపులో పెట్టుకోవడానికి అవసరమైన తోడ్పాటును Fix it Center ఇస్తుంది. ఇందుకోసం ఆటోమేటిక్‌గా లేటెస్ట్ సొల్యూషన్లను డౌన్‌లోడ్ చేసి మీ కంప్యూటర్ సజావుగా పనిచేసేలా చూస్తుంది.
అవసరమైన సొల్యూషన్లు...
Fix it Center ప్రత్యేకత ఏమిటంటే... మీ కంప్యూటర్‌లోని సమస్యలను పరిష్కరించే క్రమంలో PCలోని హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌ను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా ఉండే సొల్యూషన్లనే సూచిస్తుంది. మీ సిస్టంను స్కాన్ చేసి అందులోని హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీ డివైజ్‌లు, వాటి సెట్టింగ్స్‌ను ఎప్పుడూ గమనిస్తూ మీ అవసరాలకు తగిన సూచనలు చేస్తుంది.
అవసరమైన నియంత్రణలు...
ఆటోమేషన్ స్థాయిని మీరే నిర్ణయించుకునేలా సెట్టింగ్స్‌ను అమర్చుకోవచ్చు. దీనిని బట్టి సిస్టంను మీరు ఎలా నిర్వహించుకోవాలని భావిస్తున్నారో Fix it Center ఒక అంచనా వేస్తుంది. ఎక్కువ డివైజ్‌లను ఒకేసారి పరిశీలించే అవకాశం ఇందులో ఉన్నందున అన్నిటినీ ఏకకాలంలో గమనించవచ్చు. వాటిని రిమోట్‌గా కూడా నిర్వహించవచ్చు.
మీ ప్రతి డివైజ్‌లోనూ చోటు చేసుకున్న Updates మరియు మరమ్మతులకు సంబంధించిన రికార్డ్ కూడా Fix it Centerలో మీకు నిరంతరం అందుబాటులో ఉంటుంది.