మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోం అండ్ స్టూడెంట్ 2010


Microsoft Office Home and Student 2010 ఉపయోగించుకుని  పాఠశాల స్థాయి మరియు గృహ సంబంధ ప్రాజెక్ట్‌లను సమర్థవంతంగా పూర్తి చేసుకోవచ్చు . ముఖ్యంగా విద్యార్థులలోని సృజనాత్మక ఆలోచనలకు వాస్తవరూపాన్నిచ్చేందుకు గాను Word మరియు PowerPoint 2010లో ఉన్న Ready-to-use టెంప్లేట్లు ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ టెంప్లేట్లలోని ప్రభావశీల దృశ్యాలు, మీడియా ఎడిటింగ్ ఫీచర్లు వారి భావాలను ప్రతిబింబించేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా Excel 2010 విషయానికే వస్తే మీ ఇంటి ఖర్చుల బడ్జెట్ తయారీకి గాను ఆదాయ వ్యయ సంబంధ డేటాతో వివిధ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవసరమైన సాధనాలు ఇందులోని spreadsheetలో సిద్ధంగా ఉన్నాయి. మీగృహ సంబంధ సమాచారం, ఫైల్స్, ఇతర వనరులను ఒకేచోట పొందేందుకు OneNote 2010 ఉండనే ఉంది.


ముఖ్యాంశాలు...

మీ డాక్యుమెంట్లను కేవలం కొన్ని క్లిక్‌లతో save, share, print మరియు publish చేసుకోవడం ద్వారా యుజర్‌గా మరింత మెరుగైన అనుభవాన్ని ఆస్వాదించండి.


మీ టెక్ట్స్‌కు shadow, bevel, glow మరియు reflection లాంటి విజువల్ ఎఫెక్ట్‌లను జోడించవచ్చు లేదా టెక్ట్స్‌ను పటాలుగాను మార్చుకోవచ్చు.


మీ బడ్జెట్ మరియు ఆదాయవ్యయాల పరిశీలనకోసం easy-to-use గ్రాఫ్‌లను రూపొందించుకోవచ్చు. మీ ఆర్థిక వ్యవహారాలపై సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి గాను అనాలసిస్ టూల్స్ ఉపయోగపడతాయి.


మీ డేటాను వివిధ పద్ధతుల్లో అమర్చుకోవడానికి, విశ్లేషించడానికి, ఆదాయ వ్యయాల తీరును సులభంగా గమనించేందుకు ఇందులో అభివృద్ధిపరచిన spread sheetటూల్స్ సహకరిస్తాయి.


విడియో మరియు ఫోటో ఎడిటింగ్, సరికొత్త ఆకర్షణీయమైన ట్రాన్సిషన్స్, వాస్తవికతను సంతరించుకున్న యానిమేషన్‌తో చక్కనైన ప్రజెంటేషన్లను రూపొందించితక్కువ సమయంలో మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా ఎంతటివారినైనా ప్రభావితుల్ని చేయవచ్చు.


డాక్యుమెంట్లను సులభంగా Onlineలో పోస్ట్ చేసుకుని ఆ తర్వాత ఎక్కడి నుంచైనా వాటిని వర్చువల్‌గా వీక్షించవచ్చు, వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఇవి శాశ్వతంగా మీతో ఉన్నట్లే అనుకోండి.


మూడు Home PCలలో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లైసెన్స్ అనుమతిస్తుంది.


కనీస సాంకేతిక అవసరాలు...

500 MHz లేదా ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రాసెసర్.
256 MB RAM. గ్రాఫిక్స్ ఫీచర్స్, Outlook Instant Search,కొన్ని అధునాతన కార్యకలాపాలకయితే 512 MB RAMకావాలి.
డిస్క్‌లో 3.0 GB స్పేస్ ఉండాలి.
1024 x 576 లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న మానిటర్.
ఇంటర్నెట్ కార్యకలాపాలకు ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
Microsoft Internet Explorer 6 లేదాతదుపరి వెర్షన్, 32-bit బ్రౌజర్ మాత్రమే ఉండాలి.