వేగం, భద్రత, కచ్చితత్వం: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9
(IE9: an immersive and more beautiful Web experience)
నెటిజన్లను ఊరిస్తూ వచ్చిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 (IE9) ఇప్పుడు 39 భాషల్లో వారికి అందుబాటులోకి వచ్చేసింది. మార్చి 2011 నాటికే సుమారు 40 మిలియన్లకు పైగా బీటా డౌన్‌లోడ్‌లతో తన సత్తా చాటుకుంది. Windows 7లో 2 శాతం ఎక్కువ వినియోగాన్ని సైతం సాధించి అంతర్జాలంలో ఎప్పటిలాగే దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా అగ్రశ్రేణి వెబ్‌సైట్లు తన ఖాతాదార్లకు విభిన్న అనుభవాన్ని అందించేందుకుగాను IE9 సామర్థ్యాల్ని అందిపుచ్చుకుంటున్నాయి. మొత్తంగా ఈ భాగస్వాములంతా కలసి ఇంటర్నెట్‌లో ఒక బిలియన్‌కు పైగా క్రియాశీల వినియోగదార్లను చేరుకున్నాయి.
Windows 7 మరియు IE9 సమ్మేళనపు ప్రయోజనాలను అందుకునే క్రమంలో పైన పేర్కొన్న 250 అగ్రశ్రేణి వెబ్‌సైట్లు మాత్రమేగాక మరో 1000కి పైగా సైట్లు, డిజైనర్లు ముందడుగు వేయగా ఇందులో Facebook మరియు Amazon వంటి ప్రముఖ సైట్లు కూడా ఉండటం గమనార్హం.
* Social and information networking రంగంలో గమనిస్తే Facebook, Twitter మరియు WordPress లాంటి అగ్రశ్రేణి బ్లాగింగ్ ప్లాట్‌ఫాం IE9తో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంకా అమెరికా, ఐరోపా, రష్యా, కొరియా, లాటిన్ అమెరికా ప్రాంతాల పరిధిలోని ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లు భాగస్వాములై ఉన్నాయి.
* e-commerce విభాగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి షాపింగ్ సైట్ అయిన Amazon, అగ్రశ్రేణి వేలంపాట సైట్ eBay వంటివి మాత్రమేగాక “daily deals” space, Groupon కూడా భాగస్వామిగా ఉంది.
* వీడియో మరియు స్ట్రీమింగ్ భాగస్వాముల విషయానికి వస్తే అమెరికాలోని ఐదు అగ్రశ్రేణి video-on-demand సైట్లకుగాను Hulu, Break.com మరియు Dailymotion సైట్లు, Slacker, Pandora internet radio మరియు Jango వంటి అగ్రశ్రేణి రేడియో సైట్లు, కెనడాలోని CBC మరియు CTV, ఫ్రాన్స్‌కు చెందిన Wat.tv, అమెరికాలోని CNN వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టర్లు.. ఇలా ఈ జాబితా నడుస్తూనే ఉంటుంది.
* అమెరికాకే చెందిన Wall Street Journal, USA Today మరియు The Huffington Post వంటి వార్తల వెబ్‌సైట్ సంస్థలు, వివిధ దేశాలకు చెందిన డజన్ల కొద్దీ అగ్రశ్రేణి వార్తల సైట్లు IE9 న్యూస్ వెబ్‌సైట్ భాగస్వాములుగా ఉన్నవి.
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఒక ఉత్పత్తి మనుగడలో భద్రాతాంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. తమ బ్రౌజర్‌ను ఉపయోగించే ఖాతాదారుల కంప్యూటర్లు, డేటాకు రక్షణ కల్పించే విషయంలో Microsoft ఎక్కడా రాజీ పడలేదు. IE9లో ఇదే ప్రధానాంశం కాగా, NSS Labs అనే స్వతంత్ర సెక్యూరిటీ రిసెర్చ్ మరియు టెస్టింగ్ సంస్థ పరిశోధనలో ఇది స్పష్టమైంది. యూజర్లను Malware దాడుల నుంచి గరిష్ఠ రక్షణను ఇచ్చేలా IE9లోని SmartScreen నిలకడగా, చురుకుగా వ్యవహరిస్తున్నదని ఈ సంస్థ నివేదిక వెల్లడించింది. NSS Labs పరిశోధన ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితంగాక ఆసియా పసిఫిక్, ఐరోపాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
వేగం, భద్రత, కచ్చితత్వం ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా పలు విశిష్టతలు, ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకున్న IE9 వినియోగదారులకు గరిష్ఠ స్థాయి సంతృప్తిని అందించేలా Microsoft సంస్థ దీనిని తీర్చిదిద్దిందనడం నిర్వివాదాంశం.