IE9 Release Candidateలో వెబ్ సొగసులు
ఇంటర్నెట్‌లో అసంఖ్యాకంగా ఉన్న దృశ్య శ్రవణ సమాచారాన్ని క్షణాల్లో మన ముందుంచే Internet Explorerకు మరిన్ని వన్నెలద్ది మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది Microsoft సంస్థ. అదే సరికొత్త Internet Explorer 9. "బ్యూటీ ఆఫ్ ది వెబ్" పేరిట శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Windows Internet Explorer 9 బీటా వెర్షన్ రంగప్రవేశం చేసింది. ఈ సరికొత్త బ్రౌజర్ మీ PC హార్డ్‌వేర్ మరియు Windows 7 పూర్తి ప్రయోజనాలను అందిపుచ్చుకుని మరింత వేగం, విశ్వసనీయతతో పలువిధాల స్వచ్ఛమైన online అనుభూతిని అందిస్తుంది. మీ వెబ్‌సైట్లు, అప్లికేషన్ల పట్ల జాగ్రత్త వహించడమేగాక శక్తిమంతమైన వెబ్‌సైట్ల రూపకల్పనకుగాను HTML5 లాంటి ఆధునిక ప్రమాణాలకు Internet Explorer 9 మద్దతునిస్తుంది. ఫిబ్రవరి 10, 2010న ఇది public release candidate versionగా అందుబాటులోకి వచ్చింది.
Internet Explorer 9తో HTML5కు జీవం పోసిన భాగస్వామ్య సంస్థలు...
Windows 7 పూర్తి సామర్థ్యంతో వెబ్‌సైట్లకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత లభించేలా పునర్నిర్మితమైన ఏకైక వెబ్ బ్రౌజర్ Internet Explorer 9. ముఖ్యంగా Facebook, Red Bull GmbH, Quiksilver Inc., Rough Guides Ltd., eHow Inc., LiveStrong, Twitter, Dailymotion, Wall Street Journal, CNN, Orbitz LLC ఇంకా సుప్రసిద్ధ డిజైన్ స్టూడియోలైన Metia, Soleil Noir S.A.S., Joshua Davis Studios వంటి సంస్థల భాగస్వామ్యంతో వెబ్‌లో సరికొత్త అనుభూతులను Internet Explorer 9 పంచుతున్నది.
Internet Explorer 9లోని కొన్ని ప్రత్యేకతలు...
• Pinned Sites: మీకు ఇష్టమైన వెబ్‌సైట్లను నేరుగా Windows Taskbar నుంచే చేరుకోవచ్చు. ముందుగా బ్రౌజర్‌ను తెరవాల్సిన అవసరం లేదు. తద్వారా మీకు అత్యంత అవసరమైన సమాచారాన్ని వేగంగా పొందకోవచ్చు.
• JumpLists: బ్రౌజర్‌ను తెరిచి ఉంచాల్సిన అవసరం లేకుండానే వెబ్‌సైట్లకు సంబంధించిన సాధారణ కార్యకలాపాల్ని పూర్తి చేసుకోవడానికి అవసరమైన సత్వర సహాయన్ని JumpLists అందిస్తాయి. డెవలపర్లు Pinned Sitesకు JumpList సామర్థ్యాన్ని జోడించినందువల్ల, యూజర్లు వేగంగా కొత్త ఇ-మెయిల్ సందేశం ఇవ్వగలరు, వారి ఇన్‌బాక్స్‌ను వీక్షించవచ్చు, మ్యూజిక్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. మిత్రుల నుంచి ఆహ్వానం అందుకోవచ్చు లేదా సంచలన వార్తలపై దృష్టి సారించవచ్చు. ఇంకా మరెన్నో ఇక్కడ సాధ్యమవుతాయి.
• Tear-off tabs మరియు Windows Aero Snap tabs: యూజర్లు ఏదైనా ఒక పని పూర్తిచేసుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ వెబ్ సైట్లు లేదా వెబ్ పేజీలను తరచుగా ఉపయోగించాల్సి రావచ్చు. యూజర్లు బ్రౌజర్ నుంచి ఒక tabను లాగడం (Tear-off) మరియు Windows Aero Snap ఉపయోగించి రెండు వెబ్‌సైట్లు లేదా పేజీలను పక్కపక్కనే చూడవచ్చు. పలు వెబ్‌సైట్లలోని ఉత్పత్తులను పోల్చడానికి, ఇ-మెయిల్ చదువుతూనే వీడియోను చూడటానికి, ఒక ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికను చదువుకుంటూ మ్యాప్‌పై కూడా దృష్టి సారించడం వీటి ద్వారా సాధ్యపడుతుంది. ఒక Tabను Tear-off చేసి Snap చేయడానికిగాను యూజర్లు ఆ Tabపైన క్లిక్ చేసి తెర చివరికి లాగివేయాలి. Windowను snap చేయగానే దానిలో సమాచార ప్రసారం, వీడియోలు కొనసాగుతుంటాయి.
• SmartScreen Filterతో కూడిన Download Manager: అప్లికేషన్లు, సమాచారాన్ని download చేసుకునే క్రమంలో Malware నుంచి రక్షణ కల్పిస్తూ అత్యంత ముఖ్యమైన భద్రతా సందేశాల్ని ప్రదర్శిస్తూ సరైన నిర్ణయాలు తీసుకునేలా యూజర్లను అప్రమత్తం చేస్తుంది.
IE9 మీకు 32 బిట్ మరియు 64 బిట్ బిల్డ్స్‌లో లభిస్తున్నది. ఇది Windows 7, Windows Vista లేదా Windows Server 2008 (Platform Update మరియు IE8తో) పనిచేస్తుంది. Windows XPకి దీని మద్దతు లేదు.
వెబ్‌సైట్‌లో యూజర్ల కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా Tab isolation, Automatic crash recovery, hang recovery వంటి పలు ఫీచర్లు తోడ్పాటునిస్తాయి. ఇక ఏమాత్రం జాప్యం చెయ్యకుండా Internet Explorer 9 డౌన్‌లోడ్ చేసుకోండి. మరిన్నో ప్రయోజనాల్ని అందుకోండి.