భవిష్య సమాచార యుగానికి తీసుకెళ్ళే ఇంటలిజెంట్ సిస్టమ్స్

 

(Intelligent Systems and the Next Information Age)

 

 

     ఒక అతిచిన్న, శక్తిమంతమైన మైక్రోప్రాసెసర్‌ని Cloudకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడం, భారీ సామర్థ్యం గల ఒక స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌ని పొందుపరచడం... ప్రాథమిక స్థాయిలో చూస్తే ఇది చిన్న సూత్రంలాగా కనిపిస్తుంది.

 

     పలువురు నిపుణులు పేర్కొంటున్న ప్రకారం ఒక intelligent systemలో ఇవన్నీ ప్రాథమిక అంశాలు. ప్రతి దినం objects ద్వారా కేంద్రీకృత కంప్యూటింగ్ మౌలిక వ్యవస్థకు సమాచారం అందజేత, తర్వాత ఇది కేంద్రంగా ఆ డేటా సమీకరణ, విభజన, విశ్లేషణ తదితర కార్యకలాపాలు చోటుచేసుకుంటాయి.

 

     ఇప్పుడు ఈ సూత్రాన్ని ఒక 50 బిలియన్ రెట్లు విస్తరింపజేసి cloud సర్వీసులందించే భారీ స్టోరేజి సామర్థ్యాన్ని, విశ్లేషణాత్మక కార్యనిర్వహణశైలిని జత చేర్చినప్పుడు, ఒక అతిపెద్ద సాంకేతిక మరియు సామాజిక సమ్మేళనం ఆవిర్భావానికి బిజం పడుతుంది. Smart Devices నిస్తంత్రీ (wireless) విధానంలో భారీ డేటా వేర్‌హౌస్‌లతోను, సాఫ్ట్‌వేర్‌తోను జతచేరి ఆయా సంస్థల వ్యాపార నైపుణ్యాన్ని గతంలో ఎన్నడూ లేని రీతిలో వేగవంతంగా పురోగమింపజేసేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం పైన పేర్కొన్న డేటాను తార్కికంగా విశ్లేషించి వ్యక్తుల కొనుగోలు అభిరుచులు, ఆయా ప్రాంతాల్లో చమురు వినియోగం, ఖండాంతరాల్లో అంటువ్యాధుల తీరుతెన్నులు లాంటి నిగూఢంగా ఉన్న ధోరణులను మనముందు ఉంచుతాయి.

 

     శక్తిమంతమైన మైక్రోప్రాసెసర్‌ల ఖర్చు నానాటికీ తగ్గుతూ వస్తుండటంతో వీటిని మనం రోజువారీగా ఉపయోగించే పరికరాల్లో పొందుపరచడం ఆర్థికంగా కూడా మరింత ఆచరణయోగ్యంగా ఉంటూ వస్తున్నది. అమెరికాలో ఒక సోడా క్యాన్‌ను ఎక్కడ కొన్నారు? ఎక్కడ వినియోగించారు? లాంటి సమాచారాన్ని ఒక శీతలపానీయాల సంస్థ సేకరించగల్గితే ఎంత సులభంగా, చాకచక్యంగా ఆ కంపెనీ పనిచేయగలదనేది ఊహించండి...

 

     ఇదేమీ సుదూర స్వప్నం కాదు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం మన అందుబాటులోకి వచ్చేసింది. అధునాతన సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించగలిగి, నిస్తంత్రీ విధానంలో అనుసంధానమయ్యేలా మైక్రోప్రాసెసర్ గల పరికరాలు ఇప్పటికే మొబైల్ ఫోన్లు మరియు PCల ఎగుమతుల్ని అధిగమించాయి. 2015 నాటికి ఫోన్లు, PCలు సర్వర్ల మొత్తం ఎగుమతుల్ని embedded devices ఎగుమతులు దాటిపోగలవు. ఉత్పత్తిదారులు, చిల్లర వర్తకులు, ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేవారు, ఇంకా ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనేక అవసరాల కోసం నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు intelligent systems రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.

Read More on...