వేగం, సులభం, భద్రతకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 8

(Internet Explorer 8.0 for easier, faster and safer ways)

 

నిత్యం వివిధ అవసరాలకోసం బ్రౌజింగ్‌లో నిమగ్నమయ్యే యూజర్లకు వేగంగా, సులభంగా, భద్రతతో కూడిన సమాచార సేకరణలో సహకరించే శక్తిమంతమైన సాధనం Internet Explorer 8.0. ఇందులోని సరికొత్త ఫీజర్లేమిటో తెలుసుకుందామా....

 

Accelerators 

 

రోజువారీ బ్రౌజింగ్‌కు సంబంధించి ఇతర వెబ్‌సైట్లలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా Internet Explorer 8.0లోని ఈ సరికొత్త Accelerators ద్వారా యూజర్లు త్వరితగతిన వారి కార్యకలాపాలను పూర్తిచేసుకోవచ్చు. యూజర్లు వారికి అవసరమైన ఒక వెబ్‌పైజీలోని టెక్ట్స్ హైలైట్ చేసి నీలం రంగులోని Accelerator Iconపైన క్లిక్ చేస్తే చాలు మీ పని పూర్తయినట్లే. ఆ టెక్ట్స్‌కు సంబంధించిన ప్రతిబింబం మీకు సదరు వెబ్‌పేజీలో కనిపిస్తూంటుంది. ఇలా ఎన్నో చేసుకోవచ్చు.


Search


ఇక Search కార్యకలాపాలకోసం సమయాన్ని ఆదా చెయ్యడానికి గాను యూజర్లకు Internet Explorer 8.0లో ఎన్నో సలహాలు, సూచనలు లభిస్తాయి. మొత్తం పదం లేదా పదబంధాన్ని టైప్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. విషయ సేకరణలో Explorer యూజర్లకు మరింత చేయూతనివ్వడం కోసం Bing, Wikipedia, Yahoo!, Amazon వంటి అగ్రశ్రేణి Search Providersతో భాగస్వామ్యం కూడా ఉంది.

 

 

Smart Address Bar

 

Address barలో మీరు కొన్ని అక్షరాలు టైప్ చేస్తే చాలు వాటికి సంబంధించి మీరు అప్పటికే సందర్శించిన వెబ్‌సైట్స్‌ను Internet Explorer 8 ఆటోమేటిక్‌గా కాల్ చేస్తుంది. హిస్టరీ, ఫేవరేట్స్, RSS ఫీడ్స్‌లో అన్వేషణ, వెబ్‌సైట్ చిరునామాలో లేదా URLలోని ఏ భాగంతో అయినా సరిపోలే అంశాలను ప్రదర్శించడం చేస్తుంది. ముఖ్యంగా తప్పులతో ఉన్న URLsను తప్పించుకోవచ్చు.

 

 

Web Slices

 

తరచుగా కొత్త సమాచారాన్ని అందించే సైట్స్‌ను Favorites Bar నుంచే గమనించేందుకు యూజర్లు ఈ Web Slicesను ఉపయోగించుకోవచ్చు. ఏ పేజీలో అయినా Web Slice ఉన్నట్లయితే Command Bar పైన ఆకుపచ్చరంగులో Web Slices Icon కనిపిస్తుంది. కొత్త సమాచారం ఏదైనా ఉన్నప్పుడు ఈ Web Slice హైలైట్ అవుతుంది. Favorites Bar ఈ Web Sliceను యూజర్లు క్లిక్ చెయ్యగానే సంబంధిత సమాచారపు preview చూపిస్తుంది. ఈ previewపై క్లిక్ చేస్తే నేరుగా ఆ సమాచారం వద్దకు వెళ్ళవచ్చు. మరిన్ని Web Slicesల ఏర్పాటు కోసం భాగస్వాములతో కలసి Microsoft పనిచేస్తున్నది.

 

Compatibility View

Internet Explorer 8 అనేది కొత్త ఆవిష్కరణ కావడం చేత కొన్ని వెబ్‌సైట్లు ఈ కొత్త బ్రౌజర్‌కు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వెబ్‌సైట్లను చూడటానికి Compatibility View టూల్‌బార్ బటన్‌పైన క్లిక్ చేస్తే Internet Explorer 7లో అవి ఎలా కనిపిస్తాయో అలా చూడవచ్చు. దీనితో ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. మొత్తం వెబ్‌సైట్లు, ఇంట్రానెట్ సైట్లను చూడటానికి కూడా ఆప్షన్లున్నాయి.

 

 

Tab Groups

 

సమాచార సేకరణలో యూజర్లకు చేయూతనివ్వడానికి Tab Groups సదుపాయాన్ని Internet Explorer 8 కల్పిస్తున్నది. ఒక టాబ్ నుంచి మరొక టాబ్‌ను తెరిచినప్పుడు, అసలు టాబ్ పక్కనే రంగు కలిగిన కొత్త టాబ్ ఉంటుంది. ఇందువల్ల సంబంధిత సమాచారమున్న టాబ్‌లను యూజర్లు తేలిగ్గా గుర్తించగలరు. ఈ Tab Groupsతో మరెన్నో ఉపయోగాలున్నాయి.

 

ఇలాంటి వినూత్న సేవలందించే Internet Explorer 8లోని మరిన్ని సదుపాయాల గురించి మున్ముందు ఇంకా తెలుసుకుందాం.