ఇంటర్నెట్ TV ప్రసారాలు అందించే Windows Media Center
(Watch Internet TV in Windows Media Center)

 

Windows 7 అందించే సరికొత్త ఫీచర్ ఈ ఇంటర్నెట్ TV. ఇందులోని Windows Media Center ద్వారా మీరు నేరుగా ఇంటర్నెట్ నుంచి ఉచిత TV షోలు, చలనచిత్రాల్ని, మరెన్నో కార్యక్రమాల్ని వీక్షించవచ్చు.
a
మీ వద్ద Windows 7 Home Premium, Windows 7 Professional లేదా Windows 7 Ultimateలలో ఏ ఒక్కటి ఉన్నా Media Center మీకు అందుబాటులో ఉన్నట్లే. Media Center నుంచి మీరు ఇంటర్నెట్ TV ప్రసారాల్ని పొందాలంటే మీకు ముందుగా కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తెరగాలి. అదేంటంటే ఈ ఇంటర్నెట్ TV ప్రసారాలు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. Media Centerలో మీకు ఇంటర్నెట్ TV ఆప్షన్ కనిపించడం లేదంటే బహుశా మీ ప్రాంతంలో ఈ ప్రసారాలు అందుబాటులో లేవని అర్థం చేసుకోవాలి. అందువల్లే ఈ ప్రసారాల్ని మీరు పొందలేకపోతున్నారని గుర్తించండి. అవసరమనుకుంటే మీ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించండి.

 

ఇంటర్నెట్ TV ఎలాంటి ప్రసారాలుంటాయి ?..

 

ఒకటని కాదు ! సినిమాలు, TV షోలు మొదలుకొని క్రీడాంశాలు, వెబిసోడ్‌లు ఇంకా ఎంతో వినోదం ఒకే చోట అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్‌లో ఉండే బ్రాడ్ బ్యాండ్ వీడియో సైట్ల నుంచి ఇవన్నీ ప్రసారమవుతుంటాయి. ఇంటర్నెట్ TVలోని చాలావరకూ ప్రసారాలు ఉచితమే గానీ కొన్నిటికి మాత్రం చందా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు Netflix అకౌంట్‌ను కలిగి ఉంటే Netflix Instant Watch queue ద్వారా సినిమాలతో పాటు మరెన్నింటినో నేరుగా ఇంటర్నెట్ TV నుంచే యాక్సెస్ చేసుకోగల్గుతారు.

 

1. ఇంటర్నెట్ TV కోసం వరుసగా Start బటన్ పైన, తర్వాత All Programs పైన, ఆ తర్వాత Windows Media Center పై క్లిక్ చెయ్యండి.

 

2. Windows Media Center స్టార్ట్ స్క్రీన్‌లో TV వద్దకు స్క్రోల్ అయి వరుసగా TV పైన, తర్వాత ఇంటర్నెట్ TV పైన క్లిక్ చెయ్యండి.

 

మీరు ఇంటర్నెట్ TVని తెరవడం ఇదే మొదటిసారి అయితే, దీనిని ఉపయోగించుకోవడానికి ముందుగా సదరు సర్వీస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ముందు చెక్ బాక్స్ పైన, తర్వాత Install పైన క్లిక్ చేయండి.

 

3. తర్వాత కింది వైపు, ఎడమ లేదా కుడివైపునకు స్క్రోల్ చేయడం ద్వారా మీకు నచ్చిన అంశాలు కనిపించే వరకూ TV షోలు, సినిమాలు, ఇతర వీడియోల కోసం బ్రౌజ్ చేయండి. నచ్చినదానిపైన క్లిక్ చెయ్యండి.

 

మీరు ఎంపిక చేసుకునే సర్వీసును బట్టి అదనపు సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు. ముందు చెక్ బాక్స్ పైన, తర్వాత Install పైన క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్‌ను TVకి అనుసంధానం చేసి, రిమోట్ కంట్రోల్‌తో Windows Media Centerను ఉపయోగించుకోవడం ద్వారా ఇంటర్నెట్ TVని మరింతగా ఆస్వాదించవచ్చు.

Read More on...