మెసేజింగ్ సేవలలో మేటి Microsoft Exchange Online
Microsoft Exchange Server ఆధారంగా పనిచేసే Microsoft Exchange Online అనేది పలు సదుపాయాలతో కూడిన ఒక enterprise messaging solution. ఇది అందించే పలు సేవలలో..
* మరింత భద్రతతో కూడిన ఇ-మెయిల్ వ్యవస్థ
* మీ ఉద్యోగులకు "From virtually-anywhere" access to e-mail సేవలు
* మీ IT సిబ్బందికి మరింత పదునైన కార్యనిర్వహణ సామర్థ్యం
* ఒకొక్క స్టాండర్డ్ లైసెన్స్‌కూ 25 గిగాబైట్ల (GB) నిల్వ సామర్థ్యం కల్గిన మెయిల్ బాక్స్ వంటివి ఉన్నాయి.
Built-in functionalityతో కూడిన Exchange ఇ-మెయిల్, క్యాలెండర్, కాంటాక్ట్స్‌కు ఎలాంటి అదనపు ఖర్చూ లేకుండానే వైరస్‌లు, స్పామ్‌ల నుంచి రక్షణ ఉంటుంది. మీరెక్కడున్నా PCలు, వెబ్ మరియు మొబైల్ పరికరాల నుంచి మెయిల్ బాక్స్ డేటాను పొందగల్గుతారు. ప్రత్యేకించి రెండు ముఖ్యమైన అంశాలేమిటంటే..
* విశ్వసనీయత మధ్య యూజర్లకు వారమంతా 24 గంటలపాటు ఫోన్ ద్వారా IT లెవెల్ సహకారం లభించడమేగాక సర్వీస్ లెవెల్ ఎగ్రిమెంట్ (SLA)తో కూడిన పనితీరు.
* యూజర్లకు అలవాటున్న Microsoft Outlook, Office ప్రోగ్రామ్స్‌తో సమ్మిళితమై సులభంగా పనిచేసుకునే వాతావరణం.
యూజర్లకు బిజినెస్ క్లాస్ మెసేజింగ్ సామర్థ్యాన్ని అందించి మరింత ఉత్పాదకతను సాధించేందుకు గాను Exchange Onlineలో ఉన్న కొన్ని సదుపాయాలు చూద్దాం..
భారీ నిల్వ సామర్థ్యం ఉన్న మెయిల్ బాక్స్:
ప్రతి యూజర్‌కూ 25 GB నిల్వ సామర్థ్యం కలిగిన మెయిల్ బాక్స్ లభించడమేగాక మెయిల్స్‌కు 30 మెగాబైట్ల (MB) బరువైన అటాచ్‌మెంట్లను జోడించి పంపవచ్చు.
యాంటీ వైరస్ / యాంటీ-స్పామ్:
Exchangeకి ఉన్న Microsoft Forefront Online Protection ద్వారా ఎన్నెన్నో ఫిల్టర్లు, వైరస్ స్కానింగ్ ఇంజన్లు రంగప్రవేశం చేసి స్పామ్‌లు, వైరస్‌లు, ఫిషింగ్ స్కామ్‌ల నుంచి మీ సంస్థకు రక్షణ కల్పిస్తాయి.
Web ఆధారిత యాక్సెస్:
Web క్లయింట్ యాక్సెస్ కోసం Outlook క్లయింట్ యొక్క పూర్తి అనుభూతిని అందిస్తూ Outlook వెబ్ అప్లికేషన్ మీకు ప్రీమియం బ్రౌజర్ ఆధారిత అనుభవాన్ని మీ స్వంతం చేస్తుంది.
మొబిలిటీ:
ఇ-మెయిల్ అందుకునే సామర్థ్యం ఉన్న Windows Phone, iPhone, Android, Palm, Nokia మరియు Blackberry వంటి మొబైల్ పరికరాల నుంచి దీనికి మొబైల్ యాక్సెస్ ఉంది.
Share క్యాలెండర్ మరియు కాంటాక్ట్స్: Exchange Online ద్వారా మీటింగ్స్‌కు అనుగుణంగా క్యాలెండర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా groups, global address list, external contacts, tasks, conference rooms మరియు delegation లాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి.
వ్యాపార వర్గం కోసం వారి డేటా నిరంతరం వివిధ భౌగోళిక స్థానాల్లో అత్యంత భద్రత, విశ్వసనీయత గల డేటా సెంటర్లలో నకలు చేయబడుతూ ఉంటుంది. Microsoft డేటా సెంటర్లకు ISO 27001 లాంటి పరిశ్రమ ప్రమాణాలు, సర్టిఫికేషన్లు ఉన్నాయి.
మీ Exchange Onlineను configure చేయడానికి, subscriptions నిర్వహణ, passwords రీసెట్ చెయ్యడానికి, ప్రొవిజన్ యూజర్స్ కోసం, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఎక్కడి నుంచయినా సర్వీస్‌ను configure చేయడానికి కేంద్రీకృత Web ఆధారిత administration console సిద్ధంగా ఉంటుంది.
Exchange వాతావరణానికి చెందని మెయిల్ బాక్స్ డేటాను IMAP టూల్స్ ద్వారా Exchangeకు అనుగుణంగా మార్చవచ్చు. మెయిల్ బాక్స్‌కు సంబంధించి ఇ-మెయిల్, క్యాలెండర్ అంశాలు, కాంటాక్ట్‌లు, టాస్క్‌ల వంటివాటిని Exchange 2000, Exchange 2003 మరియు Exchange 2007లకు తగిన విధంగా మార్చడం కోసం మైగ్రేషన్ టూల్స్ సిద్ధంగా ఉన్నాయి.
వివిధ కంపెనీల IT అవసరాలకు అనుగుణంగా Exchange Onlineను ఉపయోగించుకునేలా దీనిని తీర్చిదిద్దారు. ఆ ప్రత్యేకతలు ఏమిటంటే..
* మెసేజింగ్ ఫీచర్స్‌లో కొన్నిటిని మాత్రమే పరిమితంగా ఉపయోగించే ఉద్యోగుల కోసం కూడా Exchange Online వెర్షన్ ఉంది. వీరికి ఇ-మెయిల్ యాక్సెస్‌తో కూడిన 500 MB మెయిల్ బాక్స్, క్యాలెండర్, కాంటాక్ట్స్ మరియు Outlook Web అప్లికేషన్ పరిమిత వెర్షన్ ద్వారా కంపెనీ డైరక్టరీ తదితరాలు అందుబాటులో ఉంటాయి.
* సమగ్ర ఇ-మెయిల్ వ్యవస్థలో on-premises Exchange Server మెయిల్ బాక్స్‌లు మరియు Exchange Online మెయిల్ బాక్స్‌లను నిర్వహించుకోవచ్చు. యూజర్ల మెసేజింగ్ అవసరాలకు అనుగుణంగా వారిని వర్గీకరించడానికి, అవసరమైనప్పుడు సరైన సమయంలో cloud వ్యవస్థకు మారడానికి ఇది వీలు కల్పిస్తుంది.
* యూజర్లు వర్చువల్ ప్రయివేట్ నెట్‌వర్క్ (VPN) అవసరం లేకుండానే వారి Microsoft Outlook 2003 లేదా తర్వాత Exchange Online కాపీలకు కనెక్ట్ కావచ్చు. తద్వారా యుజర్లు ప్రతి రోజు ఈ అధునాతన క్లయింట్ అప్లికేషన్‌ను సులభంగా ఉపయోగించుకోగల్గుతారు.