భాషా ఇండియాకు మంథన్ పురస్కారం...
మన భారతదేశంలో ఉత్తమ e-Content మరియు సృజనాత్మక విధానాల్ని గుర్తించి గౌరవిస్తున్న మొదటి పురస్కారం మంథన్. World Summit అవార్డ్, భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, దక్షిణాసియా దేశాల్లో డిజిటల్ విషయాల రూపకల్పన కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తున్న సామాజిక సభ్యులు, మీడియా, ఇదే రంగంలోని పలు సంస్థల భాగస్వామ్యంతో మంథన్ పురస్కారాన్ని Digital Empowerment Foundation ఏర్పాటు చేసింది.
భారత్‌లోని అభివృద్ధి రంగాల్లో ఉత్తమ e-Content ప్రమాణాల్ని మంథన్ పురస్కారం నిర్వచిస్తూ వస్తున్న నేపథ్యంలో మరోపక్క Information Communication Technology (ICT) యొక్క ఫలవంతమైన వినియోగాన్ని ప్రపంచమంతా గుర్తించింది. అభివృద్ధి మరియు సాధికారతకు ICT ఒక గొప్ప సాధనమనే విషయాన్ని సంబంధిత వ్యక్తులు, సంస్థలు గ్రహించడం జరిగింది. నేడు అత్యధిక దేశాలలోని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి, అక్కడివారు మరింత మెరుగైన దీర్ఘకాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రమాణాల సాధనే లక్ష్యంగా తమకు అనుగుణంగా ICTని వినియోగించుకుంటున్నారు.
ప్రస్తుతం అభివృద్ధి చెందిన, చెందుతూ ఉన్న పలు దేశాల్లో, ఆయా రంగాల కార్యకలాపాల్లో ICT ప్రమేయం పెరుగుతుండటం అనుభవంలోకి వచ్చింది. కంప్యూటర్, ఇంటర్నెట్, కమ్యూనిటీ రేడియో, ఆడియో - వీడియో మరియు తాజా ఉపకరణాల అభివృద్ధి, సాధికారత సాధనలో ICT అంశాల వాడకం బాగా పెరిగింది. ICT పరిధిలోకి వచ్చిన కొత్త విభాగం Blogging.
విద్య, వైద్యం, జీవనోపాధి, వ్యాపార వాణిజ్యాలు, పరిపాలన... ఇలా ఏది తీసుకున్నప్పటికీ అన్నింటా ICT విస్తరించింది. ప్రభుత్వాలు, CSOలు, కార్పోరేట్ సంస్థలు, వ్యక్తులు ప్రారంభించిన పబ్లిక్ మరియు ప్రయివేట్ ప్రాజెక్ట్‌లు, ప్రోగ్రామ్‌లలో ICT వినియోగాన్ని గమనించవచ్చు.
కేరళ, తమిళనాడు, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలు, దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉపయోగిత మరియు నాణ్యతా దృష్టి కోణంతో ICTని వినియోగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇక ఇంటర్నెట్, PC, CR, ఇతర మాధ్యమాల వంటి ICT సాధనాల్ని ఉపయోగించుకుని వ్యక్తులు, స్థానిక సామాజిక సంస్థలు అందిపుచ్చుకున్న సాధికారత, నిలదొక్కుకున్న వైనం గురించి కూడా సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో "భాషా ఇండియా"కు “e-Localization”లో ప్రథమ స్థానం లభించగా శ్రీలంక దేశానికి చెందిన సంస్థలకు రెండవ, మూడవ స్థానాలు దక్కాయి.
భాషాభిమానులకు online content కు మించి మరెన్నో అందిస్తున్న సామాజిక వెబ్ సైట్ "భాషా ఇండియా". ఇక్కడి మా నిపుణుల బృందం వర్క్ షాప్‌లు, క్విజ్ పోటీలు, విద్యార్థి ప్రయోజనకర కార్యక్రమాల్ని రూపొందిస్తూ క్రియాశీలంగా ముందుకు సాగుతున్నది. భాషాపరమైన వివిధ అంశాలపై తలెత్తే పలు సందేహాలపై పోస్టుల సమర్పణ, వాటిపై చర్చలు ఉంటాయి. భారతీయ భాషల కంప్యూటింగ్‌కు సంబంధించిన యూజర్ల పోస్టుల రూపంలో వచ్చే ప్రశ్నలకు "భాషా ఇండియా" నిపుణులు సమాధానాలిస్తారు. భారతీయ భాషల కంప్యూటింగ్ మరియు ఈ రంగంలో సాధించిన పురోగతికి మరింత చేయూతనివ్వడమన్నది "భాషా ఇండియా" లక్ష్యాల్లో ఒకటి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులు తమ భారతీయ భాషల అప్లికేషన్లు, ఫాంట్స్‌ను ఉద్దేశించిన వారికి చేరేలా "భాషా ఇండియా"లోని Solutions Directoryని ఉపయోగించుకోవచ్చు.
ప్రధాన భారతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, తమిళం వంటి భాషల్లో సాగించిన కంప్యూటింగ్ కార్యకలాపాలకు గాను "భాషా ఇండియా" ఈ పురస్కారాన్ని అందుకుంది.
ఇంగ్లీష్‌లోని QWERTY కీబోర్డ్ ఆధారంగా భారతీయ భాషల్లో పాఠాన్ని పొందడానికి వీలుగా యూజర్ల కోసం రూపొందించిన IME అనే ప్రోగ్రాం లాంగ్వేజి కంప్యూటింగ్ కార్యక్రమంలో ఒక ముఖ్యాంశం. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో దీనిని ఉపయోగించి Office Applications, WordPad మరియు Notepadలలో భారతీయ భాషల్లోనే పాఠాన్ని పొందుపరచవచ్చు. తక్షణ సహాయం, ఒకటి కంటే ఎక్కువ కీబోర్డ్ లేఅవుట్లు, భాషల మధ్య మారడం లాంటి పలు సదుపాయాలు ఇందులో ఉన్నాయి.