Go Search

MAC కోసం Microsoft Outlook Express సిద్ధం..

 

              ఇప్పుడు సరికొత్త, వేగవంతమైన, మరింత మెరుగుపరిచిన Microsoft Office మీ ముందుకు రానుంది. అయితే ఇది Macintosh కంప్యూటర్ల  కోసం కావడమే విశేషం. జనాదరణ పొందిన ఇ-మెయిల్, క్యాలెండర్, కాంటాక్ట్స్ ప్రోగ్రాం ఎట్టకేలకు Mac వాడుకదార్ల కోసం కూడా వచ్చేస్తోంది. వినియోగంలో ఇది Windows వెర్షన్‌ను తలపిస్తుంది. Mac 2011 కోసం రూపొందించిన Officeలో పూర్తి సదుపాయాలతో కూడిన పటిష్ఠమైన Outlook ఒక్కటి మాత్రమే కొత్తదిగా భావించవద్దు. Mac యూజర్లు లేదా Outlook వినియోగాన్ని ప్రామాణికం చేసుకున్న కంపెనీల్లో పనిచేస్తూ.. భవిష్యత్తులో Macకి మారదలచినవారికి ఇది ఒక ప్రత్యేక విశేషంగా పేర్కొనవచ్చు.

 

Windows వెర్షన్‌లోని ఫైల్ ఫార్మాట్‌లనే సరికొత్త Office 2011 కూడా ఉపయోగిస్తుంది. ఏ విధమైన కన్వర్షన్ లేదా ట్రాన్స్‌లేషన్ అవసరమూ లేకుండానే ఇది Office ఫైల్స్‌ను చదువుతుంది, రాస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. Macలోని Wordలో రూపొందించిన ఒక డాక్యమెంట్‌ను Windowsలోని Word యూజర్ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చదవగలుగుతారు. ఈ డాక్యుమెంట్‌ని Macలోని Wordలో తయారు చేసినట్లు కూడా వీరు గ్రహించలేరు. ఆలాగే ఇటు నుంచి అటు చేసిచూసినా అంతే!..

 

Mac Office యూజర్లు ముందుగా గమనించే విషయం 2011 వెర్షన్ యొక్క వేగం. 2008 వెర్షన్ మునుపటి వాటికంటే వేగంగా పనిచేసేది కాగా, ఈ తాజా వెర్షన్ మరింత చురుకైంది. ఇక Windows డాక్యుమెంట్లతో అనుగుణ్యత కలిగి ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పాలి. Windows మరియు Mac ఆపరేటింగ్ వ్యవస్థలు ఒకదానికొకటి విభిన్నమైనవి అయినందువల్ల ఈ అనుగుణ్యత అంత కచ్చితంగా ఉండదు గానీ, కొత్త వెర్షన్‌లో ఇది చాలా మెరుగుపడింది. మీరు Excelలో పరిశీలిస్తే సంక్లిష్టమైన స్ప్రెడ్ షీట్లలోని పటాలు, లేఅవుట్లు కొన్నిసార్లు ఉన్నవి ఉన్నట్లుగా బదిలీ కాకపోవడాన్ని గమనించి ఉంటారు.

 

Windows వెర్షన్ ఉపయోగించే మేక్రో వ్యవస్థనే కొత్త Mac వెర్షన్‌లోనూ పునరుద్ధరించడం జరిగింది. దీంతో Windows డాక్యుమెంట్లను ఉపయోగించి వివిధ కంపెనీలు, పవర్ యూజర్లు సృష్టించే ఆటోమేటెడ్ యాక్షన్లను Mac వెర్షన్‌లోనూ ఉపయోగించవచ్చు.

 

Mac Officeలో Entourageగా పిలిచే Microsoft (MSFT) ఇ-మెయిల్, కాంటాక్ట్స్, క్యాలెండర్ ప్రోగ్రామ్‌ను కొత్తదానితో Outlook భర్తీ చేసింది. Mac కోసం అంతకు కొన్నేళ్ళ కిందట సిద్ధం చేసిన Outlook పరిమిత వెర్షన్ స్థానంలో Entourage వచ్చింది. వినియోగంలో ఇది కూడా క్లిష్టమైనదని, క్రియాశీలత లేనిదిగాను చాలామంది యూజర్లు భావించేవారు. దీనికి తోడు Windowsలోని Outlook నుంచి నేరుగా డేటాను దిగుమతి చేసుకోవడం సాధ్యపడేది కాదు. ఇప్పుడు ఈ సమస్యల్ని గణనీయంగా తగ్గిస్తూ Microsoft తీవ్రంగా శ్రమించింది. ఇప్పుడు కొత్త Mac Outlookలో పనిచేయడం Windows Outlookలో పనిచేసినట్లుగానే ఉంటుంది.

 

కాగా, Apple యొక్క iCal క్యాలెండర్ ప్రోగ్రాంతో సింక్రనైజ్ చేయడం కోసం Microsoft ప్రస్తుతం కృషి చేస్తుండగా, Google క్యాలెండర్‌తో Outlook క్యాలెండర్‌ను సింక్రనైజ్ చేసే పని మిగిలి ఉంది. ఇక Windows Outlook డేటాను సరికొత్త Mac Outlookలోకి దిగుమతి చేయడం సాధ్యమవుతుండగా, దీని నుంచి Windowsలోకి డేటాను ఎగుమతి చేసే ప్రక్రియ సాధ్యం కావలసి ఉంది. ఈ విషయమై దృష్టి సారించినట్లు Microsoft తెలిపింది. మొత్తంగా చూస్తే Macలో Outlook వేగంగాను, సమర్థవంతంగానూ నడుస్తోంది. పనితీరులో ఇది Windowsలోని Outlookతో సంపూర్ణంగా సరిపోలనప్పటికీ, Windows యూజర్లు మాత్రం రెంటినీ ఒకేలా భావించే అవకాశముంది. ఇంకా, Mac కోసం ప్రత్యేకించిన ఫీచర్లు కూడా అందులో ఉన్నాయి.

Read More on...

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.