ప్రతిభకు పట్టం కట్టే Microsoft IT India (MSIT)

 

 

 

                          కొత్త మార్పులతో వ్యాపారానికి అదనపు విలువను సమకూర్చే IT పరిష్కారాలు మరియు సేవల పంపిణీయే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్న సంస్థ ఈ Microsoft IT India. హైదరాబాద్ నగరంలోని 54 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భాగంగా ఉన్న ఈ అత్యున్నత సంస్థ Microsoft Indiaలోని వైవిధ్యభరిత సాంకేతిక సామర్థ్యం, నైపుణ్యంతో ఉరకలేస్తున్న యువతరానికి వేదికగా రూపు దిద్దుకుంది. వివిధ కళాశాలల నుంచి ఎంపిక చేసిన ప్రతిభావంతులైన ఔత్సాహికులను ఉత్తమ నిపుణులుగా తీర్చిదిద్దుతున్న ఈ Microsoft IT India ఒక డ్రీమ్ వర్క్‌ప్లేస్‌గా ప్రశంసలు అందుకుంటున్నది. Microsoft తాజా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈ క్యాంపస్ ఒక గర్వకారణంగా నిలిచి ఉంది.

 

USAలోని రెడ్‌మాండ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్యకలాపాలు సాగించే Microsoft IT బృందాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా, నాణ్యతలో వాటికి విస్తరణగా MSIT-India ముందుకు సాగుతోంది. ఏడు సంవత్సరాల క్రిందట ప్రారంభమైన ఈ సంస్థలోని ప్రతిభావంతులైన IT నిపుణులు, దీనిని తమ కలల కెరీర్ నిర్మాణానికి, తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకునేందుకు తగిన గొప్ప వేదికగా భావిస్తుంటారు. అక్టోబర్ 2002లో ఏర్పాటయినప్పటి నుంచీ దాదాపు 50% Microsoft అంతర్గత IT అప్లికేషన్ అవసరాల్ని తీర్చే స్థాయికి MSIT-India  ఎదిగింది. అంతేగాక, హైదరాబాద్ నుంచే Microsoft  గ్లోబల్ డేటా కేంద్రాల్ని, కార్పోరేట్ నెట్‌వర్క్‌ను, 8000కు పైగా ఉన్న సర్వర్లు ఇంకా పలు ఇతర మౌలికవసతుల నిర్వహణ కార్యకలాపాలను విజయవంతంగా చేపడుతున్నది.

 

హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్న నెట్‌వర్క్ ఆపరేషన్స్ కేంద్రం ఎన్నో కీలకమైన బాధ్యతల్ని నిర్వహిస్తూ Microsoft Corporationకు వెన్నెముకగా నిలిచింది. దాదాపు 83కు పైబడిన దేశాలలో 3,00,000 PCలు, 2000 అప్లికేషన్లు, 89,000 మంది ఎండ్ యూజర్ల కార్యకలాపాల్ని నిశితంగా పర్యవేక్షిస్తూ అంతర్జాతీయంగా IT కార్యకలాపాలకు ఇక్కడి IT బృందం మద్దతునిస్తున్నది. ప్రతి రోజూ 1,04,000కు పైగా ఇ-మెయిల్ సర్వర్ అకౌంట్లను, 3 మిలియన్లకు పైగా ఇ-మెయిల్స్ ట్రాఫిక్‌ను 99.99% అందుబాటుతో పర్యవేక్షిస్తూ Microsoft యొక్క IT వ్యవస్థ తోడ్పాటునిస్తోంది. Microsoft ప్రధానకార్యాలయం తర్వాత, బిజినెస్ IT బృందాలన్నీ ఒకే గొడుగు కింద కార్యకలాపాలు కొనసాగిస్తున్నది ఇక్కడే కావడం విశేషం.

 

LEAP !

కీలకమైన మద్దతు అవసరమైనప్పుడు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో బాధ్యతల్ని నిర్వహించేలా కొత్తవారిని తీర్చిదిద్దడం అవసరమని గుర్తించిన MSIT, అందుకోసం LEAP Engineer Acceleration Programను సిద్ధం చేసింది. కొన్ని వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ టూల్స్, టెక్నిక్స్ తెలియజేస్తారు. లెక్చర్లు, ప్రాయోగిక అంశాలతో కొత్తవారిని నిపుణులుగా మలుస్తారు.

 

APEX (Accelerated Professional Experience)

Microsoft ITలోని వివిధ అంశాల్లో సామర్థ్యం పెంపుదల ద్వారా కెరీర్‌ను విస్తృతంగా పటిష్ఠపరచడం Microsoft IT APEX program యొక్క ప్రత్యేకత. రెండేళ్ళపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త గ్రాడ్యుయేట్లు 6 నెలలకు ఒకటి చొప్పున 4 Cross functional assignments చేపట్టే వినూత్న అవకాశాన్ని దక్కించుకుంటారు. APEX ఇంజనీర్లు IT బిజినెస్ దృక్కోణాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రంగంలో వారి అవకాశాల్ని మరింత మెరుగుపరుచుకోగలుగుతారు.

 

మహిళా శక్తికి ప్రోత్సాహం...

 

ఇక ITలో మహిళా సాధికారతకు చేయూతనిచ్చే దిశగా WIT (Women in IT) ద్వారా మహిళా నిపుణులను ప్రోత్సహించే వేదికగా కూడా Microsoft నిలిచింది. అవకాశాలను అందుకోవడంలోను, పురోభివృద్ధి సాధించడంలోను మహిళలకు ఎదురయ్యే అవరోధాల్ని తొలగిస్తూ వారికి అనుకూలమైన పని వాతావరణాన్ని సృష్టిస్తున్నది. వ్యక్తిగత -  వృత్తి జీవితాల్లో సమన్వయం వారు సాధించేలా MSIT సహకారం అందిస్తున్నది.

నిర్వహణ సామర్థ్యం కోసం MEC..

 

ఒక సంస్థ నిర్వహణ క్రమంలో ఉత్తమ విధానాలను చేపట్టి విజేతగా ఆవిర్భవించేందుకు తోడ్పడేలా Management Excellence Community (MEC) కార్యక్రమాన్ని MSIT కొనసాగిస్తున్నది. పలువురు మేనేజర్ల కమ్యూనిటీగా ఒకరి నుంచి మరొకరు మంచి పద్ధతుల గురించి తెలుసుకుని ఆచరణలో పెట్టి తమ అనుభవాల్ని పంచుకునే విశిష్ఠమైన కార్యక్రమం ఇది. మొత్తంగా చూస్తే మంచి లీడర్లను సంస్థకు అందించే గొప్ప ప్రయత్నమిది.

Read More on...