Microsoft Lync ఉంటే ప్రత్యక్షంగా ఉన్నట్లే...
యూజర్ల మధ్య జరిగే సమాచార సంప్రదింపులు ఎక్కడి నుంచయినా సాధ్యపడేలా, తోడ్పాటును అందించేలా, ఆకట్టుకునేలా చేయూతనిచ్చి సరికొత్త అనుభూతితో కూడిన అనుసంధానం గావించే పటిష్ఠమైన సాధనం Microsoft Lync. ఇవే ప్రయోజనాలు అంతే శక్తిమంతంగా IT రంగానికీ అందుబాటులో ఉన్నాయి. అత్యంత భద్రత, విశ్వసనీయతతో తక్కువ ఖర్చులోనే దీనిని సులభంగా వ్యవస్థాపించుకోవచ్చు. మైగ్రేషన్‌కు, తగిన విధంగా ఎంపికలు చేసుకోవడానికి, సౌలభ్యానికి ఇది మారుపేరుగా ఉంది.
సింగిల్ ఇంటర్‌ఫేస్.. బోలెడు అప్లికేషన్లు..
యూజర్ల అభిమతం ఎలా ఉంటుందంటే.. వారు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఇతర అప్లికేషన్లతో కలుపుకుని వారి పని సులభంగా పూర్తి చేసుకోవడానికి ఉపకరించే సాధనాలు అందుబాటులో ఉండాలని ఆశిస్తారు. Microsoft Lync 2010 విషయానికే వస్తే వాయిస్ కమ్యూనికేషన్లు, IM, ఆడియో, వీడియో, వెబ్ కాన్ఫరెన్సింగ్ వంటి పలు అప్లికేషన్లను ఒకే ఇంటర్‌పేస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
సరైన వారితో కమ్యూనికేషన్..
ఇందులోని rich presence సదుపాయం పలు చిత్రాలు, స్కిల్ సెర్చ్, స్థల సమాచారం తదితరాల్ని యూజర్లకు అందుబాటులో ఉంచుతుంది. తద్వారా వారు అవసరాన్ని బట్టి బిల్ట్-ఇన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సామర్థ్యంతో పాటు సందర్భోచిత సంప్రదింపులు జరిపే అవకాశాల్ని కలుగజేస్తుంది. ఇంకా.. MSN/Windows Live, AOL మరియు Yahoo! లాంటి పబ్లిక్ IM సర్వీసులకు చెందిన యూజర్లనూ చేర్చుకుని సింగిల్ వర్క్ ఐడెంటిటీని ఉపయోగించి వారితో సంప్రదింపులు చేయవచ్చు. ముఖ్యంగా ఫోన్ నంబర్లు, సంస్థాగత నిర్మాణక్రమం, కార్యాలయ సమాచారంతో కూడిన కాంటాక్ట్ కార్డ్‌లు ఈ సంప్రదింపులకు ఎంతగానో ఉపకరిస్తాయి.
ప్రత్యక్షంగా ఉన్నట్లే...
యూజర్లు జరిపే ప్రతి సంభాషణ, సంప్రదింపులలో హై రిజల్యూషన్ వీడియో, అప్లికేషన్, డెస్‌్మటాప్ షేరింగ్ ఉండేలా తీర్చిదిద్దుకోవచ్చు. సదరు ప్రాంతానికి నేరుగా వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేనంతగా పూర్తి స్థాయి ఆన్‌లైన్ సమావేశాల్ని నిర్వహించుకోవచ్చు. రంగుల వ్యత్యాసంతో కూడిన presence ఐకాన్‌లు, చిత్రాలు, హై రిజల్యూషన్ వీడియో, డెస్క్‌టాప్ షేరింగ్ తదితరాలతో Microsoft Office మరియు ఇతర బిజినెస్ అప్లికేషన్లతో నిలకడ గల పనితీరును Microsoft Lync కనబరుస్తుంది.
సంప్రదాయ IP PBX వ్యవస్థలను సైతం తోసిరాజనేలా విస్తృతస్థాయిలో తీర్చిదిద్దబడిన సింగిల్ ప్లాట్‌ఫాం Microsoft Lync Server 2010. కాలింగ్ ఫీచర్స్ అయిన అన్సర్, ఫార్వర్డ్, ట్రాన్స్‌ఫర్, హోల్డ్, డైవర్ట్, రిలీజ్, పార్క్ వంటి వాటితోపాటుగా కార్యాలయం వెలుపల సైతం VPN కనెక్షన్ అవసరం లేకుండానే ఇంటర్నెట్ ద్వారా భద్రంగా వీటిని విస్తరించుకోవచ్చు. Active Directory, Microsoft Exchange Server మరియు Microsoft SharePoint టెక్నాలజీల మధ్య అత్యంత భద్రత, విశ్వసనీయతతో పనిచేసే వ్యవస్థను Microsoft Lync Server 2010 అందజేస్తున్నది. సమర్థవంతంగా, తక్కువ వ్యయంతో నిర్వహణ జరిగేలా Microsoft మేనేజిమెంట్ టూల్స్‌ను ఉపయోగిస్తుంది.
బిజినెస్ అప్లికేషన్లు, వివిధ ప్రక్రియల్లో కమ్యూనికేషన్లను సులభంగా ఎంబెడ్ చేయడానికి అనుగుణంగా అందరికీ అవగాహన ఉన్న టెక్నాలజీని ఉపయోగించిన డాక్యుమెంటెడ్ APIలు అందుబాటులో ఉంటాయి.