Visual Studio 2010కి సంబంధించి Windows Azure టూల్స్

 

 

     Visual Studio 2010తో ఎక్కువగా కార్యకలాపాలను నిర్వహించే వారికి Windows Azure అందచేస్తున్న కొన్ని టూల్స్, వాటి ప్రత్యేకతల్ని గురించి తెలుసుకుందాం..

 

 

Streamlined publishing::

 

     మీ అకౌంట్‌కి ఒక publish settings ఫైల్‌ను సమకూర్చడం ద్వారా మీరున్న పని వాతావరణాన్ని Windows Azureతో అనుసంధానించే ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుంది. Visual Studioను విడిచిపెట్టకుండానే Remote Desktop (RDP)ను నెలకొల్పుకోవడం లాంటి వివిధ రకాల deployments యొక్క వివిధ అంశాల్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. మీరు చేయాల్సిందల్లా.. Visual Studio publishing wizardను ఉపయోగించి publish settingsని డౌన్‌లోడ్ చేసుకుని వాటిని Visual Studioలోకి దిగుమతి చేసుకోండి. అప్లికేషన్లకు సంబంధించిన అప్‌డేట్ల వ్యవహారాలు త్వరితగతిన కొనసాగేలా in-place deployment upgradesని ప్రాథమికంగా publish ఉపయోగించుకుంటుంది.

 

 

Multiple profiles:

 

     మీ publish settings, build config, మరియు cloud config తదితర ఎంపికలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ publish profile MSBuild ఫైళ్ళలో పొందుపరచబడి ఉంటాయి. ఇందువల్ల మీరు గాని, మీ బృందంలోనివారుగానీ మీ పని వాతావరణానికి సంబంధించిన సెట్టింగ్స్‌ని త్వరితగతిన మార్చగలరు.

 

 

Team Build:

 

      Visual Studio 2010కి సంబంధించిన Windows Azure సాధనాలు ఇప్పుడు మీ అప్లికేషన్ మరియు pass in properties ప్యాకేజీ కోసం MSBuild కమాండ్-లైన్ తోడ్పాటును అందజేస్తాయి. అదనంగా, Visual Studioని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే lighter-weight build మెషీన్‌లో కూడా వీటిని పొందుపరుచుకోవచ్చు.

 

 

In-Place Updates:

 

     Windows Azureలో నెలకొల్పిన సర్వీసులకు గాను మరింత మెరుగైన in-place updatesను రూపొందించుకునేందుకు Visual Studio ఇప్పుడు మీకు వీలుకల్పిస్తున్నది. మరిన్ని వివరాల కోసం మీరు సందర్శించవలసిన లింకు..

 

 http://blogs.msdn.com/b/windowsazure/archive/2011/10/19/announcing-improved-in-place-updates.aspx

 

 

Enhanced Publishing Wizard:

 

      Sign-in తదుపరి వైవిధ్య భరితమైన publishing అనుభవం, వ్యవస్థాపిత (deployment) సమయంలో కాన్పిగర్ చేసుకోవడం, జరిగిన మార్పుల సారాంశం మరియు సమీక్ష వంటి మరెన్నో సదుపాయాలను ఇది అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

 

Automatic Credential Management కాన్ఫిగరేషన్: ఇక మానవశ్రమ లేకుండా స్వయంచాలకంగా cert ఏర్పాటు మరియు నిర్వహణకు అవకాశం.

 

 

Multiple Subscription Deployment Management:

 

      Visual Studioలో publishing సందర్భంలో మీరు ఉపయోగించదలచిన subscriptionను ఎంచుకోవడం ద్వారా ఒకటికంటే ఎక్కువ Windows Azure subscriptionsని ఉపయోగించుకోవడం ఇప్పుడు ఎంతో సులభం.

 

 

Hosted Service Creation:

 

     Windows Azure పోర్టల్‌కు వెళ్ళవలసిన అవసరం లేకుండానే Visual Studioలో సరికొత్త hosted servicesని ఏర్పాటు చేసుకోవచ్చు.

 

 

Storage Accounts:

 

     Visual Studioలో సరైన Storage Accounts ఏర్పాటు, కన్ఫిగరేషన్‌కు అవకాశం (ఇకపై ఈ కార్యకలాపాలకు మానవశ్రమ అవసరం లేదు).

 

 

Remote Desktop Workflow:

 

     చెక్ బాక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా దీనిని క్రియాశీలం చేయవచ్చు. యూజర్ పేరు / పాస్ వర్డ్ కూడా సదుపాయం కూడా ఉంది. cert ఏర్పాటు లేదా అప్‌లోడింగ్ చేయాల్సిన పనిలేదు.

 

 

Deployment కాన్ఫిగరేషన్‌లు:

 

     ఒకటికంటే ఎక్కువ Deployment కార్యకలాపాల కాన్ఫిగరేషన్ ప్రక్రియలను నిర్వహించుకోవచ్చు.

 

 

Azure Activity లాగ్:

 

     Publish మరియు virtual machine initialization స్థితిపై మరింత సమాచారం.

Read More on...