CRM మార్కెట్‌లో సరికొత్త సంచలనం On-Premises CRM

 

వ్యాపార నిర్వహణ అనేది కీలకమైన దశలు, సంక్లిష్టమైన నిర్ణయాలతో ముడిపడిన వ్యవస్థ. వ్యాపార సంస్థ ఎంత చిన్నదయినా, ఎంత పెద్దదయినా గానీ నిలకడగా క్రయవిక్రయాల్ని సాగించాలంటే కాలానుగుణంగా మారే పరిణామాలు, ఖాతాదార్లు, వినియోగదార్ల కొనుగోలు అభిరుచులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో భారీ, చిన్న, మధ్య (SME) తరహా సంస్థలు వారి ఖాతాదారుల కొనుగోలు తీరు తెన్నులను పరిశీలించేందుకు, భవిష్యత్తుపై అంచనాలు వేసుకోవడానికి తోడ్పడేలా ఉపయోగపడే మరొక సాఫ్ట్‌వేర్ CRM Online. CRM మార్కెట్‌లో Salesforce.com మరియు Oracle వంటి సంస్థలదే పైచేయి. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన Dynamic CRM వినియోగపరంగా మిగిలిన మార్కెట్ కంటే భిన్నంగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంది. సుప్రసిద్ధ ఇ-మెయిల్ వ్యవస్థ అయిన Microsoft’s Office Outlookలో అంతర్గతంగా Dynamic CRM పొందుపరచబడి ఉంది. ఇప్పటికే Outlookను ఉపయోగిస్తున్న కస్టమర్లు అక్కడి నుంచే వారి క్లయింట్లు, విశ్వసనీయ వ్యాపార ప్రతిపాదనలు, అవకాశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఈ క్రమంలో మనకు అలవాటుగా ఉన్న ఇంటర్‌ఫేస్‌ను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. Outlook నుంచే ఇందుకు సంబంధించిన కార్యకలాపాల్ని నిర్వహించుకోవచ్చు. అసలు ఇతరులకంటే మిమ్మల్ని విభిన్నంగా ఉంచడానికి ప్రాధాన్యతనిచ్చేది మరియు చాలా ముఖ్యమైనది ఇదే.

 

Microsoft వారి CRM Solutionతో భారతీయ మార్కెట్‌లో ఈ సంస్థకున్న స్థానం మరింత మెరుగవుతుందన్నది మార్కెట్ విశ్లేషకుల ఉవాచ. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో Sales force అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో Oracle వారి Siebel CRM On Demand నిలిచింది. ఇప్పుడు Microsoft Dynamics CRM Online రాకతో ఆ సంస్థలు రెంటికీ గట్టి సవాల్ ఎదురైందని నొక్కి చెబుతున్నారు. భారత్‌లో On-demand CRM చోటు సంపాదిస్తున్నప్పటికీ వినియోగానికి సంబంధించిన ప్రాథమిక దశల్లో ఉన్నందువల్ల on-premise CRM solutionsను అందించే వెండార్లు సత్వర వ్యాపార ప్రయోజనాలకు చేరువవుతారన్నది ఒక సర్వే చేసిన అధ్యయనం వెల్లడించింది.

 

http://twitter.com/#!/MicrosoftIndia

 

CRMను అమలు చేసే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున CRM solutions అత్యంత వేగంగా  వేళ్ళూనుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతదేశంలో enterprise applications వృద్ధిరేటు CRM రంగంలోనే కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించి భారీ వ్యాపార సంస్థలు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి.

 

Microsoft వారి వార్షిక టెక్నాలజీ ప్రదర్శన అయిన Tech.Ed 2011 మార్చి 25, 2011న ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఈ సందర్భంగా స్పందిస్తూ నిలకడగా నిరంతర వృద్ధిని సాధిస్తున్న Microsoft నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపజేస్తూ Microsoft అందిస్తున్న సేవల్ని కొనియాడారు.

Read More on...