ఆటల ప్రియుల కోసం Microsoft గేమ్ హబ్
ఆటల్ని ఆస్వాదించే వారి కోసం వినూత్న రీతిలో సిద్ధమైన సరికొత్త ఫీచర్ Microsoft గేమ్ హబ్. MSN Games, Bing Games మరియు Windows Live Messenger నుంచి కూడా పొందడానికి వీలు కల్పించడమేగాక, ఆ సైట్లలో ఉన్నవారు ఇవే ఆటల్ని ఆడేందుకు అవకాశమిస్తూ, తమ స్నేహితుల స్టేటస్ అప్‌డేట్లను గమనించేందుకు, పరస్పరం గేమ్ సవాళ్ళను పంపుకోవడానికి అనుమతిస్తుంది. ఈ వినూత్న గేమింగ్ హబ్ మూడు ప్రధాన గేమింగ్ పోర్టల్స్‌తో అనుసంధానమై క్యాజువల్ మరియు సోషల్ గేమ్ ప్లే మధ్య గల అంతరాన్ని చెరిపివేస్తుందని Xbox ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మైకేల్ ఉల్ఫ్ పేర్కొన్నారు.
Link: http://zone.msn.com/en-us/home
"మీరు మెచ్చే ఆటల్ని కనిపెట్టి తనివితీరా అడుకోవడానికి, వాటిని మీకిష్టమైనవారితో కలిసి ఆనందించేందుకు మార్గం సుగమమైంది. ఈ అనుభూతిని వివిధ ప్లాట్‌ఫాం వెంబడి లక్షలాదిమంది ప్లేయర్లకు పంచుతున్నాం. తద్వారా వారు తన అనుభవాల్ని తమ సామాజిక వర్గాలతో పంచుకుంటారు" అని ఉల్ఫ్ నొక్కి చెప్పారు.
Microsoft గేమ్ హబ్ తోడ్పాటు ద్వారా Msn గేమ్స్ సైట్ పూర్తి సరికొత్త సొబగులతో పునర్నిర్మాణం, Windows Live Messengerలో మరింత వినూత్నమైన గేమ్స్ అనుభవం, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్‌డం మరియు న్యూజిలాండ్ తదితర దేశాలు సహా అంతర్జాతీయంగా ఆంగ్లం మాట్లాడే మార్కెట్ల దిశగా Bing గేమ్స్ విస్తరణ వంటి కార్యకలాపాల్ని ఈ కంపెనీ ప్రకటించింది.
ఈ మూడు క్యాజువల్ గేమింగ్ సైట్లను ఈ సరికొత్త హబ్‌లో చేర్చడం ద్వారా non-hardcore గేమ్స్‌ని ఆయా సామాజిక వర్గాలకు మరింత చేరువ చేయాలన్నది Microsoft లక్ష్యం అని ఉల్ఫ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నూతన హబ్ నుంచి యూజర్లు Facebook లేదా Windows Live accounts లేదా రెండింటిలోకీ sign అయి వారి స్నేహితుల స్టేటస్ అప్‌డేట్లను వీక్షించవచ్చు, క్యాజువల్ గేమ్ ఛాలెంజ్ రిక్వస్ట్‌లు పంపవచ్చు, గేమ్ లీడర్ బోర్డ్‌లను చూడవచ్చు, ఏ గేమ్‌నైనా ఫేవరెట్‌గా ఉంచుకుని కావలసినప్పుడల్లా అత్యంత సులభంగా దానిని పొందవచ్చు. మీరు ఏ ప్లాట్‌ఫాంలో ఉన్నప్పటికీ ఇష్టపడే గేమ్స్, గేమ్ హిస్టరీ, స్కోర్లపై దృష్టి సారించవచ్చు.
"మీరు మెసెంజర్, Bing, మొబైల్ లేదా PCలలో ఎక్కడైనా అడుతుండవచ్చు గాక, ప్లాట్‌ఫాంతో నిమిత్తం లేకుండా కనెక్టివిటీ మరియు కాంపిటీషన్ మీతో పెనవేసుకుని ఉంటాయి. ఇది గతంలో ఎవరూ చేయనిది" అని ఉల్ఫ్ స్పష్టం చేశారు.
క్యాజువల్ గేమ్స్ సంఘం తెలిపినదాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మందికి పైగా ఉన్న క్యాజువల్ గేమర్లను ఈ గేమ్ హబ్ విశేషంగా ఆకట్టుకోగలదని Microsoft ఆశాభావంతో ఉంది. క్యాజువల్ గేమ్స్‌ని ఆడేందుకు కొత్త చోట్ల ఎంత విస్తృతంగా గేమర్లు ఆసక్తిని కనబరుస్తున్నారనేది ఈ కంపెనీ ఇప్పటికే గ్రహించింది. గత ఏడాది జూన్ నెలలో Bing గేమ్స్ ప్రారంభమైన నాటి నుంచీ 6 నెలల కాలంలో 55 మిలియన్ల మంది తమ బ్రౌజర్ ద్వారా దీనికి ఆకర్షితులు కావడమే దీనికి తార్కాణం.
మామూలుగా చెప్పాలంటే, సాధారణ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన వీడియో గేమ్స్‌ని సులభంగా నేర్చుకుని ఆడవచ్చని ఉల్ఫ్ అన్నారు. యువత.. ప్రత్యేకించి కుర్రాళ్ళు ఎక్కువగా hardcord గేమ్స్ వైపు మొగ్గు చూపితే, కాస్త పెద్దవారు, మహిళలకోసం క్యాజువల్ గేమ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. వీరు Microsoft సైట్స్ నుంచి తమకు నచ్చిన గేమ్స్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు.
Console, handheld, mobile మరియు online ప్లాట్‌ఫాంలలో ఎప్పటికప్పుడు ప్రవేశించే సరికొత్త గేమ్స్‌లో ప్రముఖమైన, అత్యంత జనాదరణ పొందిన గేమ్స్ ఈ మూడు పోర్టళ్ళలోనూ అందుబాటులో ఉంటాయి. Cubis 2, Super Stacker మరియు Plants vs. Zombies లాంటి హిట్స్‌తో సహా 35కు పైగా టైటిల్స్‌తో ఇది ప్రారంభంకాగా, MSN గేమ్స్, Windows Live Messenger మరియు Bingతో అనుసంధానమై మనసు తృప్తితీరా అడుకోవచ్చు.