పాఠశాలలకు చేయూతనిచ్చే Microsoft IT Academy

 

ఇప్పుడు మనమున్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యుగం. భవిష్యత్తు అంతా ఐటీదేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో నేటి తరం బాలల భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే వారికి ఐటీ నైపుణ్యం తప్పనిసరి అనేది నిర్వివాదాంశం. అందుకే ఆవిర్భవించింది Microsoft IT Academy.

 

రేపటి పౌరుల జీవితానికి పునాదులు వేసేది పాఠశాలలే. అందుకే ఈ దశలోనే విద్యార్థుల్లో ఐటీ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన చేయూతనివ్వాలన్నది ఈ Microsoft IT Academy లక్ష్యం. ఈ క్రమంలో పాఠశాలలకోసం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సభ్యత్వ కార్యక్రమానికి  Microsoft సంస్థ రూపకల్పన చేసింది.

 

విద్యార్థులను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దే పరిణామక్రమంలో వారి ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు తమ ఐటీ పరిజ్ఞానానికి పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికేషన్లకోసం శిక్షణ పొందాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో వినియోగంలో ఉన్న Microsoft తాజా టెక్నాలజీలపై పట్టు కలిగి ఉండటం మరింత ముఖ్యం. వీటన్నిటితో పాటు విద్యార్థుల పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా తాజా పరిణామాలతో కూడిన ఐటీ పాఠ్యాంశాల్ని అందులో చేర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి వయసు, సామర్థ్యాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. Microsoft IT Academy సభ్యత్వంతో ఈ ప్రక్రియలన్నిటినీ సులభతరం చేసుకోవచ్చు.

 

పాఠశాలల్లో ఐటీ విద్యనందించే ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ప్రాథమికాంశాలతోపాటు హైలెవెల్ ప్రోగ్రామింగ్ వరకూ e-learning, Microsoft కోర్స్ మెటీరియల్, సర్టిఫికేషన్లు Microsoft IT Academy ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ICT) కూడా ఇందులో భాగమే. సర్టిఫికేషన్ల విషయానికి వస్తే ప్రపంచ ఐటీ పరిశ్రమ తాజా పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిపుణులు ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతుంటారు.

 

Microsoft IT Academy ప్రోగ్రాం ప్రత్యేకతల్ని పరిశీలిస్తే...
• Labs, తరగతులు, విద్యార్థుల PCల కోసం Microsoft తాజా సాఫ్ట్‌వేర్ల అందుబాటు.
• విద్యార్థుల కోసం Microsoft E-Learning కోర్సుల అందుబాటు, వారి పురోగతిని పర్యవేక్షించేందుకు Instructor Learning Management System (LMS) ఏర్పాటు.
• విద్యా సంస్థలకు Microsoft అధికారిక కోర్స్ మెటీరియల్‌పై డిస్కౌంట్లు.
• ఆన్‌లైన్‌లో 500కు పైగా Microsoft ప్రెస్ పుస్తకాల్ని యాక్సెస్ చెయ్యడానికి ఇ-రిఫరెన్స్ లైబ్రరీల అందుబాటు.
• టీచర్ల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, విద్యార్థులు ఐటీ భావనలు, అంశాలపై పట్టు సాధించేందుకు TechNet వనరుల అందుబాటు.
• Microsoft బ్రాండ్, అధికారిక సర్టిఫికేషన్ల ప్రమోషన్ కోసం మార్కెటింగ్ సదుపాయాల కల్పన మొదలైనవి.


నేటి జాబ్ మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా Microsoft సర్టిఫికేషన్లకు ఉన్న గుర్తింపు నేపథ్యంలో Microsoft IT Academy ప్రోగ్రాం ద్వారా సదరు పాఠశాలల విద్యార్థులకు మెరుగైన అవకాశాలు చేరువలో ఉంటాయనేది ఇందులోని ముఖ్యాంశం.