Microsoft బ్లూటూత్ మొబైల్ కీబోర్డ్ 5000

 

              టాబ్లెట్ కంప్యూటర్ల కొనుగోళ్ళు 2015 కల్లా 81 శాతం మేర పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టాబ్లెట్‌లు, లాప్‌టాప్ కంప్యూటర్లే నిత్యావసర సాంకేతిక సాధనాలుగా మారిపోయాయి. మరోపక్క ఆన్-స్క్రీన్ కీబోర్డ్ తరచూ ఉపయోగించేవారికైతే చేతివేళ్ళు, మణికట్టు దగ్గర ఏదో రకమైన బాధ కలగడం ఇంకో పార్శ్వం.

 


 నేడు Microsoft Hardware నుంచి మరింత సౌకర్యవంతమైన అనుభవాన్నిచ్చే Bluetooth Mobile Keyboard 5000 మనముందుకు వచ్చింది. అటు టాబ్లెట్ కంప్యూటర్, ఇటు లాప్‌టాప్ కంప్యూటర్లను ఉపయోగించేవారందరి కోసం ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళే సౌకర్యాన్ని, వాడకంలో సౌలభ్యాన్ని మేళవించారు. స్వల్పంగా వంపుతో కూడిన ఈ కీబోర్డ్ ఆకృతికి వివిధ పనివాతావరణాల్లో ఆయా వ్యక్తుల కార్య సామర్థ్యాన్ని అధ్యయనం చేసే నిపుణుల ఆమోదముద్ర కూడా లభించింది. ఈ కీబోర్డ్ సౌలభ్యం అనేది ఒక్క పోర్టబిలిటీతో రాజీపడలేదు, దీని స్లిమ్ డిజైన్ కారణంగా ఇది తేలికగా ఉంటుంది. ఎక్కడికైనా  సులభంగా తీసుకెళ్ళగలుగుతారు. ఇలా బ్యాగ్‌లో పెట్టండి అలా ముందడుగు వేయండి...!

 

ఇక కార్డ్స్, డాక్స్, USB నానో ట్రాన్సీవర్స్ వంటి వాటికి స్వస్తి పలికి బ్లూటూత్ ద్వారా Windows ఆధారిత టాబ్లెట్లు, iPads మరియు ఆండ్రాయిడ్ సాధనాలతో కనెక్ట్ అవ్వండి. లేటెస్ట్ మ్యూజిక్ కోసం చేసే శోధనలో గాని, ఒక సమావేశంలో నోట్స్ తీసుకోవడంలోగాని, ఇ-మెయిల్ వినియోగంలోగాని మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఈ బ్లూటూత్ మొబైల్ కీబోర్డ్ 5000 ప్రస్తుతం అమెరికాలో 49.95 డాలర్ల ధరతో అందుబాటులో ఉంది..

 

More Details: http://www.microsoft.com/hardware/en-us/p/bluetooth-mobile-keyboard-6000

 


 

Read More on...