Microsoft పరీక్షార్థులకు శిక్షణా సౌకర్యాలు


     సాఫ్ట్‌వేర్ రంగంలో మీ పునాదుల్ని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడానికి, మీ ప్రతిభా పాటవాల్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి గాను మీలో చాలామంది Microsoft పరీక్షలకు సిద్ధమవుతుంటారు కదూ. ఆయా పరీక్షల్లో మీరు మంచి స్కోరింగ్ చెయ్యాలంటే మీ సబ్జెక్ట్‌లలో మీకు మంచి పట్టు ఉండాలి. మంచి పట్టు రావాలంటే తగినంత శిక్షణ పొంది ఉండాలి. ఈ క్రమంలో మిమ్మల్ని తీర్చిదిద్దేందుకు Microsoft Learning ఎంతగానో తోడ్పాటునిస్తోంది. ఇందుకు సంబంధించి classroom training, online training వంటివాటితో పాటు మీ స్వతంత్ర అధ్యయనం కోసం పుస్తకాల సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

 

Classroom training...


ప్రాయోగిక, ప్రశ్నోత్తరాలతో కూడిన వ్యవస్థీకృత వాతావరణంలో శిక్షకుల సహాయంతో ఇక్కడ వీలైనంత ఎక్కువ పరిజ్ఞానం పొందవచ్చు. కొత్తగా IT కెరీర్‌లోకి అడుగుపెట్టినవారికి, అడ్వాన్డ్స్ సర్టిఫికేషన్స్ ఉన్న IT నిపుణులు Classroom training నుంచి సమానంగా ప్రయోజనాలు పొందవచ్చు. Microsoft Certified Trainers అయిన బోధకులు, తోటి విద్యార్థులతో సంప్రదింపులు నెరపుతూ, వారి సలహా సహకారాలతో శిక్షణ తీసుకోదలచినవారికి Classroom training బాగుంటుంది. ఇక్కడి virtual labs ద్వారా ప్రాయోగిక అనుభవం పొందవచ్చు.

 

E-Reference Libraries...


పరీక్షార్థులు Online ద్వారా E-Reference Librariesలోకి ప్రవేశించవచ్చు. Microsoft technologiesలో మీరు నిపుణులయ్యేందుకు ఇందులోని చందా ఆధారిత సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు 100కు పైగా Microsoft Press పుస్తకాలు, శిక్షణ సామగ్రి, troubleshooting tips అందుబాటులో ఉంటాయి. మీరు Offlineలో అధ్యయనాన్ని కొనసాగించడానికిగాను అవసరమైన వాటిని ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది మొత్తం పుస్తకం లేదా అందులోని కొంత భాగం లేదా ఉపయుక్తమైన కోడ్ భాగం... ఇలా ఏదైనా కావచ్చు. విస్తారంగా శోధించి కావలసినంత పరిజ్ఞానాన్ని, వివిధ సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని పొందవచ్చు.

 

Microsoft Press books...


పరీక్షార్థుల, శిక్షణార్థుల పరిజ్ఞానాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళేందుకు అవసరమైన తాజా పాఠ్యాంశాల్ని, IT రంగ పుస్తకాల్ని ఇక్కడ పొందవచ్చు. Microsoft సాఫ్ట్‌వేర్‌పై మార్కెట్‌లో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, Microsoft ఆమోదం ఉన్న IT పరిశ్రమ, Microsoft నిపుణుల రచనలైన ఈ Microsoft Press books నాణ్యతకు, విషయ పరిజ్ఞానానికి మారుపేరు అన్నది నిర్వివాదాంశం. O’Reilly Media ద్వారా ఈ పుస్తకాల్ని పంపిణీ చేస్తుంటారు.

 

Silverlight Learning Snacks


ప్రాచుర్యంలో ఉన్న టెక్నాలజీకి సంబందించి ఈ Silverlight Learning Snacks ద్వారా ఉచితంగా, సంక్షిప్తంగా interactive సమాచారం పొందవచ్చు. Microsoft Learning experts రూపొందించిన ఈ Learning Snacksను Microsoft Silverlight technology ద్వారా స్వీకరించవచ్చు. ఇవి యానిమేషన్, రికార్డ్ చేసిన డెమోలు, ఇంకా అనేక రూపాల్లో ఉంటాయి.

Read More on...