ప్రపంచాన్ని ముంగిట నిలిపే Microsoft MapPoint

 

వ్యాపార గణాంకాల్ని విశ్లేషించేందుకు, తక్షణ ప్రభావాన్ని చూపేలా సంప్రదింపు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు Microsoft MapPoint 2010 మీకు ఎనలేని చేయూతనిస్తుంది. Microsoft Office ద్వారా మీరు చేసుకునే కార్యకలాపాల్లో మ్యాప్‌లను పొందుపరుచుకుని సమాచారాన్ని సమన్వయపరచుకోవచ్చు. వివరాల ప్రదర్శన, expanded pushpins ఎంపికతో కూడిన మ్యాప్ సెట్టింగులు, మీ GPS పరికరానికి మార్గాల్ని పంపించడం లాంటి కొత్త అంశాల్ని కూడా MapPoint 2010 కలిగి ఉన్నది.

 

మీ tabular dataకు ఒక స్పష్టతను తీసుకురావడం ద్వారా సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి MapPoint సహకరిస్తుంది. వ్యాపారం నిమిత్తం మీరు వేసుకునే ప్రయాణ ప్రణాళికలు మరింత ఉపయుక్తంగా ఉండేలా చూసుకోవడానికి అవసరమైన తోడ్పాటు ఇందులో లభిస్తుంది.

 

GPS Locatorతో కూడిన Microsoft MapPoint 2010

 

Microsoft MapPoint 2010 ప్రయోజనాలన్నిటీనీ మీరు అందుకోవడంతోపాటు వాస్తవ పరిస్థితుల్లో మీ ప్రాంతపు జాడను కనుగొనడానికి ఉపకరించేలా నేరుగా మీ laptopలో ఒదిగిపోయే ఒక GPS Locator మీకు అందుబాటులో ఉంటుంది. సవివరమైన డ్రైవింగ్ మార్గదర్శకాలను మీముందు ఉంచడమేగాక మలుపు తిరగవలసిన చోట మర్చిపోయి మీరు ముందుకెళ్ళినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించి సరైన సమయంలో గమ్యం చేరుకునేలా మీకు సహకరిస్తుంది.

Microsoft MapPoint Europe

 

మీ అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తుల్ని రూపొందించడం ద్వారా మీ లాభదాయకతను పెంచి, అనవసర వ్యయాన్ని నివారించడం లక్ష్యంగా Microsoft ఉత్పత్తి రూపకల్పన ప్రణాళికలుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఐరోపా దేశాలతో నిరంతర వాణిజ్య సంబంధాలున్నవారు, తరచూ ఆ దేశాల్ని సందర్శించేవారు Microsoft MapPoint Europe ద్వారా పలు ప్రయోజనాల్ని అందుకోవచ్చు. ఇందులో ఉన్న పశ్చిమ ఐరోపా దేశాల మ్యాప్‌లు వీధుల స్థాయి వివరాల్ని సైతం అందజేస్తుంది. మీరు బయటకు వెళ్ళడానికి ముందు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో సూచించండి... ఇక మలుపుల వారీగా అత్యంత సమర్థవంతమైన డ్రైవింగ్ మార్గదర్శకాలు అందించేలా MapPoint వ్యూహరచన చేస్తుంది. ఇటువంటిదే Microsoft MapPoint North America 2010. ఉత్తర అమెరికా దేశాలతో సంబంధాలున్నవారికి ఇది ఉపయోగపడుతుంది.

 

ఇంకా... వాహనాల శ్రేణికి సైతం మార్గనిర్దేశం చెయ్యడానికి MapPoint Fleet 2010కు Microsoft సంస్థ రూపకల్పన చేసింది. ఇందులో ప్రతి వాహనానికి కాకుండా చోదకులందరికీ లైసెన్స్ అవసరం ఉంటుంది.

 

Microsoft Officeతో కలిపి ఉపయోగించుకోవడానికి వీలుగా MapPoint రూపకల్పన జరిగింది. Office Excel, Office Access, Office Outlook, Microsoft SQL Server లేదా ఇతర డేటాబేస్‌లలోని డేటా నుంచి మీరు సులభంగా మ్యాప్‌లను తయారు చేసుకోవచ్చు. సరికొత్త వ్యాపార అవకాశాలకు సంబంధించి క్రయవిక్రయాల తీరు, కస్టమర్ల ప్రాంతాల ఆధారంగా చిత్రాల్ని సిద్ధం చేసుకోవచ్చు.

 

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా తదితర దేశాల్లో వేలాది మైళ్ళ విస్తీర్ణంలో ప్రస్తుతమున్న వీధులు, జాతీయ రహదార్ల వివరాల్ని కచ్చితంగా పొందడం ద్వారా మీ పర్యటనలు, రవాణా కార్యకలాపాల్ని మరింత ప్రణాళికాబద్ధం, సులభతరం చేసుకోవచ్చు. తద్వారా వ్యయ నియంత్రణ జరగడమేగాక మీ విలువైన సమయం ఆదా అవుతుంది.

 

ప్రయాణంలో ఇక ఒత్తిడి ఉండదు...

 

వాణిజ్యపరంగా మీరు తరచూ జరిపే పర్యటనల్ని MapPoint ఎంతో సులభం చేస్తుంది. మీ కంప్యూటర్ ద్వారా ప్రయాణాన్ని నిర్ణయించుకుని ఆ మార్గాన్ని GPS పరికరానికి పంపండి. మీరు ఏయే మార్గాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యతనిస్తారు... ఏ మార్గాల్ని ఇష్టపడరు, ఎంత వేగంతో ప్రయాణించాలనుకుంటున్నారు వంటి అంశాల్ని కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇవేగాక మీరు వెళ్ళదలచిన మార్గాల్లో ఉన్న గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, హొటళ్ళు, ఎటిఎంలు, పోస్ట్ ఆఫీసులు, ఫార్మసీలు, బ్యాంకులు, ఆసుపత్రులు లాంటి పలు వివరాలు MapPoint 2010లో పొందుపరిచారు. అంతేకాదు, మీ గమ్యానికి సంబంధించిన సమాచారాన్ని మొబైల్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇక మీ ప్రయాణం నల్లేరు మీద నడకేనని చెప్పాల్సిన పనిలేదు.