Twitterలో Microsoft Office
Microsoft Office మన ముందుకు వచ్చి కేవలం 22 సంవత్సరాలే అయినప్పటికీ, యూజర్లతో పెనవేసుకున్న గాఢమైన బంధం వల్ల ఇదొక శాశ్వత అనుబంధంగా అనిపిస్తుంటుంది. అయితే, Microsoft Office ఎన్నో మార్గాల ద్వారా యూజర్లకు చేరువైంది. అలాంటి మార్గాల్లో ఒకటి Microsoft Office twitter. ఈ పేజిలోకి sign up చేస్తే చాలు సమయానుసారంగా Microsoft Office నుంచి సందేశాల్ని అందుకోవచ్చు. Microsoft Office ఉత్పత్తులను వినియోగించుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాల్ని అందించడమే Office twitter పేజి ప్రధాన ఉద్దేశ్యం. సమీప కాలంలో Microsoft అనుసరిస్తున్న కొత్త వ్యూహాల గురించి ఇందులో కథనాలున్నాయి.
http://blogs.office.com/
ఇక మరో ఫీచర్ విషయానికి వస్తే... Microsoft తాజా ఉత్పత్తుల జాబితా ప్రదర్శన. Twitterలోని కొన్ని వ్యాసాల పరంపరను గమనిద్దాం...
Office365కు సంబంధించిన Showcase link list పైన క్లిక్ చేస్తే Office365 అధికారిక పేజీకి వెళుతుంది. Office365 ఆవశ్యకత, ఉపయోగించుకునే విధానం, అందుబాటులో ఉన్న వెర్షన్, ఆఫర్లు, దీనిని కంప్యూటర్లో వ్యవస్థాపించుకోవడానికి ఉండాల్సిన కనీస సాంకేతిక సదుపాయాలు, బీటా వెర్షన్ తదితర వివరాలు ఇందులో ఉంటాయి.
Office Twitterలో PowerPoint tips and tricks కూడా అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీంగా కళాత్మకమైన ప్రజంటేషన్లను చిరకాల జ్ఞాపకంగా తీర్చిదిద్దుకోవడంలోను, డైనమిక్ ప్రజంటేషన్ల రూపకల్పనలోను మీకు సహకరించడమే ఇక్కడి ప్రధానమైన ఉద్దేశ్యం. అంతేగాక, ఇతరులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఆసక్తికరమైన అంశాలను ఏ విధంగా మలుస్తున్నారో కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.
ఇక ఇందులో అందరికోసం ఉంచిన Excel shortcut keys అనే వ్యాసం Microsoft Excel యూజర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. MS-Excelకు add-inగా ఉన్న Power pivot గురించి కూడా ఇందులో వ్యాసాలున్నాయి. ఈ ఫీచర్ గురించి పూర్తిగా వివరించబడి ఉంది.
ఇంకా ఇందులో Microsoft outlookకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలంటే... Outlook Express నుంచి పంపబడిన ఒక సందేశాన్ని తిరిగి వెనక్కి మరల్చడం, automatic mail respondకు సంబంధించిన సందేహాల నివృత్తి... వంటివి. ఆయా పరిష్కారాలు అక్కడే అందుబాటులోనే ఉన్నాయి.
ఈ పేజీలో ఉన్న Twitter linkలలో ఎక్కువ భాగం Microsoft అధికారిక వెబ్‌సైట్‌కు వెళతాయి. మరో విధంగా చెప్పాలంటే Microsoft అధికారిక వెబ్‌సైట్ నుంచి మీకు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని అందుకోవడానికి ఇది దగ్గరి మార్గమని పేర్కొనవచ్చు.