Microsoft పరిశోధన విభాగం
Microsoft Research (MSR) అనేది 1991లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ. కంప్యూటింగ్ వ్యవహారాలకు సంబంధించిన సాధారణ మరియు వాస్తవిక ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎనిమిది శాఖలు, 800 మందికి పైగా పరిశోధకులతో కంప్యూటర్ విజ్ఞానశాస్త్ర రంగంలో సేవలందిస్తున్న ఏకైక అతి పెద్ద సంస్థ ఇదే.
MSR ద్వారా కంప్యూటింగ్‌లోని 55 వేర్వేరు విభాగాల్లో పరిశోధనా కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతుంటాయి. కంప్యూటింగ్ రంగంలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు MSRలో ఉద్యోగులుగా ఉన్నారు. వీరిలో ప్రతిష్ఠాత్మక Turing Award గ్రహీతలు కూడా ఉండటం గమనార్హం.
MSR వెబ్‌సైట్‌లోని పబ్లికేషన్స్ విభాగంలో కంప్యూటింగ్ రంగానికి చెందిన కొత్తవారు మరియు ఇందులో ఇప్పటికే ముందడుగు వేసిన పరిశోధకుల కోసం పలు రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. సమాచారాన్ని సులభంగా పొందేందుకుగాను Title (శీర్షిక), Author (రచయిత) మరియు Abstract (సారాంశం)లలో ఏదో ఒకటి లేదా వీటి సమ్మేళనాల ప్రాతిపదికన అన్వేషణ చేసుకోవచ్చు. ప్రచురితమై ఉన్న పాఠాన్ని మరింతగా వడపోసే సదుపాయం కూడా ఉంది.
కంప్యూటింగ్ పరిశోధన రంగంలోని అత్యాధునిక టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాల్లో నేరుగా పాల్గొనదలచిన వారు ఇందులోని ప్రాజెక్ట్స్ విభాగాన్ని పరిశీలించాలి. తాజా పరిశోధనలకు సంబంధించి, తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే విషయంలో సమాచారం, మార్గదర్శకత్వం పొందవచ్చు. వడపోత ద్వారా పరిశోధన పరిధి, ప్రాంతాన్ని నిర్దేశించుకోవచ్చు. సరైన సమాచారాన్ని గుర్తించేందుకు పరిశోధన పరిధి చాలా ఉపయోగపడుతుంది.
మీరు మామూలుగా సమాచారం సేకరించే వ్యక్తి కావచ్చు లేదా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నవారయినా అయి ఉండవచ్చు. అందరికీ ఉపయోగపడేలా తాజా updatesకు సంబంధించిన వీడియోలు మీకు ఇక్కడ లభిస్తాయి. మరింత సమాచారం కోసం http://research.microsoft.com/ వీక్షించండి.