Microsoft సాఫ్ట్‌వేర్ వితరణ

 

సమాజ సంక్షేమం లక్ష్యంగా పనిచేసే ధార్మిక వర్గాలు, స్థానిక లాభాపేక్షరహిత సంస్థల ఉత్పాదకత మరియు సామర్థ్య పెంపుదలకు తోడ్పడేలా వీటికి సహకారం అందిస్తున్నది Microsoft వారి software donation కార్యక్రమం. తద్వారా ఈ సంస్థలు, వర్గాలు సామాజికంగా చేయూత అవసరమైన నిజమైన లబ్ధిదారులకు మరింతగా సాయం చెయ్యగల్గుతాయి.

 

మార్గదర్శకాలు..

Microsoft నిర్దేశించుకున్న పరిధిలో ఎంపిక చేసిన కార్యక్రమాల మేరకు అర్హత గల లాభాపేక్ష రహిత సంస్థలకు ఈ సంస్థ ద్వారా ధార్మిక సహాయం లభిస్తుంది. అయితే, పరిధిలోలేని ప్రతిపాదనలను కాలానుగుణంగా పరిశీలన చేస్తారు. కాగా, అత్యంత భారీ సంఖ్యలో వచ్చే ప్రతిపాదనలన్నింటినీ ఆమోదించి నిధులందించే అవకాశం లేదు.

అదనపు అర్హతా ప్రమాణాలు..

Microsoft Hong Kong నుంచి సహాయం ఆశిస్తున్న ఆసక్తిగల లాభాపేక్షరహిత సంస్థలు కింద పేర్కొన్న ప్రమాణాల్ని తప్పక కలిగి ఉంటే అవి Microsoft ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత సాధిస్తాయి.

 

Inland Revenue Ordinanceలోని సెక్షన్ 88 నిర్వచించిన కింది ధార్మిక నిర్వచనం ఆధారంగా స్థానిక ధార్మిక సంస్థల అర్హత నిర్ణయించబడుతుంది. 

 

"Charitable Organization" means any entity operated exclusively for charitable, scientific, literary, or educational purposes, no part of the net earnings of which inures to the benefit of any private shareholder or individual, other than:

*  Any entity that receives more than one third of its income from any one person or entity
*  Any entity that is substantially engaged in lobbying, political campaigns or other activities designed to influence legislation
*  Any hospital, health care system or research laboratory
*  Any entity that is eligible to participate in the Microsoft Academic Open License program as an "eligible education customer" as that term is defined in the Microsoft Academic Open License Agreement in effect for your region at the time your order was placed

 

ఈ కింద పేర్కొన్న వర్గాలకు Microsoft Community Affairs నుంచి విరాళం అందుకోవడానికి అర్హత లేదు..
*    వ్యక్తులు
*    ఆసుపత్రులు లేదా మెడికల్ క్లినిక్‌లు
*    రాజకీయ, కార్మిక, మత లేదా సౌహార్ద సంస్థలు
*    విద్యా సంస్థలు (ప్రభుత్వ లేదా ప్రయివేట్) లేక ప్రభుత్వ సంస్థలు
*    అమెచ్యూర్ లేదా ప్రొఫెషనల్ క్రీడా బృందాలు
*    జట్లు లేదా కార్యక్రమాలు
*    సదస్సులు లేదా సమావేశాలు
*    భవన నిర్మాణం కోసం మూలధన ప్రచారం
*    మార్కెటింగ్ కార్యక్రమాలు లేదా సామగ్రి
*    ప్రయివేట్ ఫౌండేషన్లు

ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసే నిమిత్తం తాత్కాలికంగా ఆపి ఉంచారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. మరిన్ని వివరాల కోసం Microsoft Customer Service Hotline 2388-9600ను సంప్రదించాలి.

 

మీది హాంగ్‌కాంగ్ పరిధిలోని లాభాపేక్షరహిత సంస్థ అయి ఉండి, సాఫ్ట్‌వేర్ వితరణ కోసం దరఖాస్తు చేయదలిస్తే కింది వివరాలతో ప్రతిపాదనల్ని పంపాల్సి ఉంటుంది.

1. మీ సంస్థ గురించి, లక్ష్యాలు, సాధించిన ప్రధాన కార్యక్రమాలు, పరిపాలనాంశాలు, మీ సంస్థ సేవలందించిన ప్రాంతం, ప్రజల వివరాలు.
2. మీరు మద్దతు కోరుతున్న ప్రాజెక్ట్ లేదా కార్యక్రమం, కావలసిన సాఫ్ట్‌వేర్ల సంఖ్య తదితరాలు.
3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ సంస్థ ఆపరేటింగ్ బడ్జెట్.
4. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులకు సంబంధించిన వనరుల గుర్తింపు, అందుకున్న మొత్తాలు (ఫౌండేషన్, కార్పోరేట్, వ్యక్తులు మరియు ప్రజల మద్దతుతో కలిపి)
5. ప్రాజెక్ట్ బడ్జెట్ (వర్తించినట్లయితే..)
6. ప్రస్తుత బోర్డు సభ్యులు, ముఖ్య సిబ్బంది వివరాలు
7. సంస్థ ఇటీవలి ఆర్థిక స్థితిగతుల ప్రకటన, ఆడిట్ వివరాలు
8. మీ సంస్థకున్న పను మినహాయింపు లేఖా ప్రతి

 

ప్రతిపాదనలను పంపాల్సిన చిరునామా..
   Microsoft Hong Kong Limited
   13/F, Cyberport 2,
   100 Cyberport Road,
   Hong Kong.
   Attn: Microsoft Hong Kong Donation Program

దరఖాస్తు పరిశీలనలో పరిగణించే అంశాలు..

 

* మీ సంస్థ ధ్యేయం, కార్యక్రమ లక్ష్యాల సాధన క్రమంలో టెక్నాలజీ వినియోగం పట్ల గల చిత్తశుద్ధి
* సహాయానికి దూరంగా ఉన్న వ్యక్తులను IT అభివృద్ధిలో భాగస్వాముల్ని చెయ్యడం, నేర్పడంలో అంకితభావం
* సంస్థ, దాని ధ్యేయం, కార్యక్రమాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ పరిష్కారాల ప్రతిపాదనల ఔచిత్యం
* ప్రతిపాదించిన టెక్నాలజీ అమలు, నిర్వహణ సామర్థ్యం

 

Microsoft Charity Open Licensing Program ప్రస్తుతానికి హాంగ్‌కాంగ్ పరిధిలోని ధార్మిక సంస్థలకు మాత్రమే పరిమితం.

Read More on...