MSDNపై ఒక విలక్షణమైన బ్లాగ్
వివిధ పరిష్కారాలను అందించే కథనాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన Microsoft కార్యక్రమాల సమాచారాన్ని మీకందిస్తూ విలక్షణతను సంతరించుకుంది Miscrosoft MSDN బ్లాగ్. ఈ బ్లాగ్ యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడిది ఐరోపా భాషల్లోనూ అందుబాటులో ఉంది.
ఈ బ్లాగ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని కథనాల వివరాలు మీ కోసం...
http://blogs.msdn.com/
Microsoft desktop virtualization టెక్నాలజీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు Server App-Vకి కూడా వర్తిస్తాయి. ఇదెలా పనిచేస్తుందనే విషయమై ఇతరులు ఏమంటున్నారో మీరు వినాలనుకుంటున్నా... చూడాలనుకుంటున్నా ఇక మీ ఇష్టం. App-Vకి సంబంధించి cloud విభాగం పట్ల చాలామందికి ఆసక్తిగల ఉండి ఉండవచ్చు. ఇదే అంశంపై ఏప్రిల్ 12, 2011న Automisation and the Public Cloud పేరిట ఒక కార్యక్రమం జరిగింది. Automated management అనేది ఒక డైనమిక్ డేటా సెంటర్‌కు కీ గాను, ఒక private cloud పరిణామ క్రమంగాను ఉన్నది. Operations Managerలో ఇది Opalis ద్వారా సాధ్యపడుతున్నది.
TechDays Belgium 2011
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 26 మరియు 27 తేదీల్లో అగ్రశ్రేణి అంతర్జాతీయ, స్థానిక వక్తల నుంచి నేర్చుకునేందుకు గాను రానున్న సుమారు 1400 మంది ఇతర డెవలపర్లు మరియు ఐటీ నిపుణులతో మీరూ చేరవచ్చు. దాదాపు 60కి పైగా జరిగే సెషన్ల నుంచి ఆరు డెవలపర్ మరియు IT-Pro ట్రాక్స్ ద్వారా ప్రస్తుత టెక్నాలజీకి సంబంధించిన సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, లోతైన విషయాలను ఇక్కడ తెలియజేస్తారు.
PowerShell కమాండ్-లైన్ నుంచి మీ hosted servicesను మేనేజ్ చెయ్యడానికి Windows Azure Management Cmdlets ఎంతగానో ఉపకరిస్తాయి. SDK 1.3 కోసం వీటిని ఇటీవలే upgrade చేశారు. Windows Azure Service Management CmdLets అందజేసే cmdlets సెట్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. అవి Windows Azure Management మరియు Diagnostics APIలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి. యూజర్లు తమ Windows Azure operationsను configure చేసుకోవడానికి మరియు తదనుగుణంగా నిర్వరించుకోవడానికి వీలు కల్పిస్తాయి. అమలుకు, నవీకరణకు వీలుగా సులభతరమైన స్క్రిప్ట్‌తో మీ Windows Azure అప్లికేషన్లు అభివృద్ధి చేసుకుని, మంచి పనితీరుతో పరీక్షకు నిలబడేలా రూపొందించేందుకు ఈ cmdlets సహకరిస్తాయి. ఇంకా చెప్పాలంటే మీ diagnostic configuration అమరికలకు, నిర్వహణకు మీరు ఈ Cmdletsను ఉపయోగించుకోవచ్చు.
MSDN బ్లాగ్‌లో చర్చకు వచ్చిన ఆసక్తికరమైన వ్యాసాల్లో ఇవి కొన్ని కాగా, మీ అందరికీ ఉపయుక్తమైన మరెన్నో అంశాలకోసం తక్షణం MSDN బ్లాగ్‌లోకి అడుగుపెట్టండి.