ఆకాశమే హద్దుగా Microsoft Office 365


నానాటికీ విస్తరిస్తూ.... విస్తృతమవుతున్న అంతర్జాల కార్యకలాపాల నేపథ్యంలో Office 365 గురించి Microsoft సంస్థ ప్రకటన చేసింది. తర్వాతి తరంకోసం ఎప్పటికప్పుడు update చేస్తూ Microsoft Office, SharePoint Online, Exchange Online మరియు Lync Onlineను దీని ద్వారా ఒకేచోటకు ఈ సంస్థ తీసుకువచ్చింది. అవార్డ్ సాధించిన Microsoft బిజినెస్ ప్రొడక్టివిటీ సొల్యూషన్లను ఇంటర్నెట్ మూలంగా Office 365 ద్వారా లక్షలాది సంస్థలు సులభంగా పొందవచ్చు, ఉపయోగించుకోవచ్చు. వ్యక్తులు, వివిధ సంస్థలు సరళ పద్ధతుల్లో మరింత భద్రతతో ఇంటా బయటా ఎందరితోనైనా ఎక్కడి నుంచైనా తమ కార్యకలాపాల్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం 13 దేశాలు, ప్రాంతాల్లో Office 365 పరిమిత బీటా ప్రోగ్రాంను కూడా Microsoft ప్రారంభించనుంది.


తొలి బ్రౌజర్ ఆధారిత ఇ-మెయిల్ నుంచి Microsoft Office Live Small Business అండ్ Live@edu లాంటి ఈనాటి Business Productivity Online Suite వరకూ  వాణిజ్యపరమైన ఇంటర్నెట్ ఆధారిత సేవల పరిశ్రమలో ఏళ్ళతరబడి గడించిన అనుభవంతో Office 365 రూపకల్పన జరిగింది. ఎవరైనాసరే Office 365 ద్వారా ఆన్‌లైన్ ప్రపంచంలోకి తరలివెళ్ళడమంటే... వారి పనితీరు మారాల్సిన అవసరంలేదు. ఎందుకంటే నేడు ఎక్కువ మంది ఉపయోగించే పలు ప్రముఖ బ్రౌజర్లు, స్మార్ట్ ఫోన్లు, డెస్క్‌టాప్ అప్లికేషన్లలో Office 365 పనిచేస్తుంది.


ఉత్పాదనకు సంబంధించి ఏక అంతర్జాల సేవగా Office 365 అత్యుత్తమమైనదని Microsoftలో Office డివిజన్ ప్రెసిడెంట్‌గా ఉన్న Kurt DelBene అన్నారు. Office 365ను ఉపయోగించుకోవడం ద్వారా మొదటిసారిగా స్థానికంగానే ఎంటర్‌ప్రైజ్ స్థాయి సత్తా కలిగిన సాఫ్ట్‌వేర్ మరియు సేవల్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఏదైనా ఒక బహుళజాతి ఫార్మాసూటికల్ కంపెనీ విషయమే తీసుకుంటే ఖర్చుల్ని మరింత తగ్గించుకుని, తాజా ఆవిష్కరణలతో ఎప్పటిలా ముందంజ వేయవచ్చన్నారు. మేము, మా భాగస్వాముల బృందం టెక్నాలజీపరంగా బాధ్యత తీసుకుంటాం కనుక ప్రజలు వారి కార్యకలాపాలపై దృష్టిసారించవచ్చని స్పష్టం చేశారాయన.


Microsoft సంస్థ తన ప్రస్తుత కస్టమర్ల తోడ్పాటుతో Office 365 అభివృద్ధి చేసింది. ఫలితంగా కస్టమర్ల వివిధ రకాల అవసరాల మేరకు అంతర్జాల కార్యకలాపాలకు అనుగుణంగా ఇది రూపుదిద్దుకుంది.


సుమారు 25 మందికంటే తక్కువగా ఉద్యోగులున్న చిన్న వ్యాపార సంస్థలు, నిపుణులు, చిన్న కంపెనీలు నెలకు ఒక యూజర్‌కు 6 డాలర్లు లేదా 5.25 యూరోల ఖర్చుతో కేవలం 15 నిమిషాల్లో Office Web Apps, Exchange Online, SharePoint Online, Lync Online మరియు ఒక external websiteతో Office 365 ద్వారా కార్యకలాపాల్ని నిర్వహించుకోవచ్చు.


ఎంటర్‌ప్రైజెస్‌కు Office 365 విషయానికే వస్తే... బేసిక్ ఇ-మెయిల్‌కు నెలకు ఒక యూజర్‌కు 2 డాలర్లు లేదా 1.75 యూరోల తక్కువ వ్యయం నుంచీ మధ్యస్థాయి, భారీ స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలకోసం పలు రకాల సేవల్ని ఎంపిక చేసుకునే అవకాశముంది. ఇందులోనే తొలిసారిగా pay-as-you-go పద్ధతిలో Microsoft Office Professional Plus డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌ను పొందే అవకాశం కూడా ఉన్నది. నెలకు ఒక యూజర్‌కు 24 డాలర్లు లేదా 22.75 యూరోల వ్యయంతో Office Professional Plusతో పాటుగా ఇ-మెయిల్, వాయిస్ మెయిల్, ఎంటర్‌ప్రైజ్ సోషల్ నెట్‌వర్కింగ్, తక్షణ సందేశ సేవ, వెబ్ పోర్టల్స్, extranets, వాయిస్ కాన్ఫరెన్సింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, వెబ్ కాన్ఫరెన్సింగ్, 24x7 ఫోన్ సపోర్ట్, on-premises licenses వంటి మరెన్నిటినో పొందవచ్చు. వచ్చే ఏడాదికల్లా Office 365 ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి 13 దేశాలు, ప్రాంతాల్లోని కొన్ని వేల సంస్థలతో Office 365 టెస్టింగ్‌ను Microsoft చేపడుతుంది. ఈ క్రమంలో బీటా పరిధిని మరిన్ని సంస్థలకు విస్తరిస్తారు. వచ్చే ఏటికల్లా 40 దేశాలు, ప్రాంతాల్లో Office 365 అందుబాటులోకి రావచ్చు.


రానున్న ఏడాది చివరికల్లా అన్ని రకాల సంస్థలకూ పూర్తిస్థాయిలో Microsoft బిజినెస్ ప్రొడక్టివిటీని అనుభవంలోకి తీసుకువచ్చేందుకుగాను Microsoft Dynamics CRM Onlineను చేర్చుతూ Office 365ను విస్తరిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు, అధ్యాపకులు, పాఠశాలల ఉద్యోగుల అవసరాల మేరకు విద్యారంగం కోసం Office 365 సిద్దంగా రంగప్రవేశం చేస్తుంది.


Office365 బీటా కోసం Microsoft కస్టమర్లు, భాగస్వామ్య సంస్థలు www.Office365.comను వీక్షించవచ్చు లేదా Twitter (@Office365), Facebook (Office 365) ద్వారా Office365 గురించి తెలుసుకోవచ్చు లేదా తాజా సమాచారం కోసం http://community.office365.comకు వెళ్ళవచ్చు.