Online ఫోటో ఆల్బం.. Windows Liveతో సిద్ధం..
తరతరాల పాటు మన జ్ఞాపకాల్ని నిలిపి ఉంచడానికి గల ఒక ఉత్తమమార్గం మన ఫోటోల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్ది సరైన చోట పొందుపరచడమే. ఇందుకు సరైన సాధనం WindowsLive Photo Gallery. ఫోటోలకు సంబంధించి ఎడిటింగ్, అప్‌లోడింగ్, స్టోరింగ్, షేరింగ్ లాంటి అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలను సులభతరం చేసే సురక్షిత వ్యవస్థ ఇది. ఇంకా చెప్పాలంటే వీటిని ముద్రించుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ 30 రోజుల గడువులో 500 ఫోటోల వరకూ అప్‌లోడ్ చేసుకోవచ్చు. Windows Live profileకు మీ ఫేవరెట్ ఫోటోల్ని కూడా జోడించుకోవచ్చు. ఇక మీ ప్రత్యేక వేడుకలు, యాత్రలు లేదా అభిరుచులకు సంబంధించిన ఫోటోల్ని online ఫోటో ఆల్బంలుగా మార్చుకోవడానికి కేవలం కొన్ని క్లిక్‌లు చాలు.
Windows Live Photo Gallery online ప్రాథమికాంశాల గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి. దీని సాయంతో మీరు మీ ఫోటోల్ని ఎడిట్ చేసుకుని, మీ ఆత్మీయులతో పంచుకోవడానికి వీలుగా పదిలపరచుకోవచ్చు. Windows Live Essentialsలో భాగంగా ఉన్న Windows Live Photo Galleryని మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని అందులోని తగిన సాధనాల ద్వారా మీ ఫోటోల స్కానింగ్, నిర్వహణ, ముద్రణ కార్యకలాపాల్ని పూర్తి చేసుకోగల్గుతారు.
Windows Live Photo Gallery onlineను ఉపయోగించుకోవాలంటే Windows Live account ద్వారా sign in అవ్వాలి. మీకు ఈ అకౌంట్ లేనట్లయితే http://windowslive.comకు వెళ్ళి అకౌంట్ ఏర్పాటు చేసుకోండి. ఇదంతా ఉచితమే. Windows Liveలో ఫోటోలు మాత్రమేగాక ఫైళ్ళు, డాక్యుమెంట్లను కూడా పొందుపరచుకుని ఇతరులతో పంచుకోవచ్చు. ఇ-మెయిల్ చదవడం, పంపడం, మీ సోషల్ నెట్‌వర్క్‌లోని సరికొత్త విశేషాల్ని గమనించడం... ఇలా ఇంకెన్నో కార్యకలాపాల్ని సాధ్యం చేసుకోగలం.
ఇక మన ఫోటో ఆల్బం పనుల్లోకి వెళ్ళిపోదాం... Windows Live Photo Galleryని మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే, మీ ఫోటోల నిర్వహణ, ఎడిటింగ్ కార్యకలాపాలతో పాటుగా ఎక్కడి నుంచయినా అత్యంత వేగంగా మీ ఫోటోల్ని దిగుమతి చేసుకోగల్గుతారు. మీ ఫోటోలున్న కెమెరా లేదా మరే ఇతర సాధనాన్నయినా కంప్యూటర్‌కు జోడించి, ఫోటో గ్యాలరీలోకి వెళ్లి Import పైన క్లిక్ చేస్తే చాలు. Import photos and video విండోలోకి వెళ్ళి ఏ సాధనం (Memory card, CD, DVD, Mobile Phone) నుంచయితే మీ ఫోటోల్ని అప్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నారో ఎంచుకుని Import పైన క్లిక్ చెయ్యండి.
ఇంకా, కంప్యూటర్ USB పోర్ట్‌కు మీ కెమెరాను అనుసంధానించి ఆన్ చెయ్యండి. Import pictures and videos using Windows (Windows 7) లేదా Import using Windows (Windows Vista) డైలాగ్ బాక్స్‌పై క్లిక్ చెయ్యాలి. తర్వాత ఆ కెమెరాలోని ఫోటోలు My pictures folder లేదా మీరు ఎంచుకున్న ఫోల్డర్‌లోకి కాపీ అవుతాయి. ఈ పని పూర్తయ్యాక ఆ ఫోటోల్ని మీ అవసరం మేరకు ఎడిట్ చేసుకోండి.
తర్వాత Online ఫోటో ఆల్బం ఏర్పాటుకు సిద్ధమవ్వండి. ముందుగా దీనికి ఆ సందర్భానికి తగిన ఒక పేరు పెట్టండి. తర్వాత Windows Live ID ద్వారా Windows Liveలోకి sign in కావాలి. అక్కడ వరుసగా Photos, తర్వాత Create album పైన క్లిక్ చెయ్యండి. Name బాక్స్‌లో ఈ ఆల్బంకు మీరు పెట్టదలచిన పేరు టైప్ చెయ్యాలి. ఆ తర్వాత Share with బాక్స్‌లో మీరు ఈ ఆల్బంను ఎవరెవరు చూడాలనుకుంటున్నారో వారికి మాత్రమే లేదా Everyone ద్వారా మొత్తం అందరికీ permissions ఇవ్వండి. కావాలంటే వీటిని తర్వాత మార్చుకోవచ్చు. ఇదయ్యాక Next పైన క్లిక్ చేసి ఫోటోల్ని జోడించండి. ఫోటోల్ని జోడించడానికి Select Photos from your computer లేదా Drop photos here పైన క్లిక్ చేయండి. తర్వాత మరికొన్ని ఫోటోల్ని డ్రాగ్ చేసుకోవచ్చు. మరిన్ని ఫోటోల్ని జోడించడానికి Select more photos from your computer పైన క్లిక్ చెయ్యండి. ఫోటోల్ని పైన తెలిపినట్లుగా digital camera, memory card, CD, DVD, mobile phone నుంచి Windows Live online ఆల్బంకు జోడించవచ్చు.
పని పూర్తయ్యాక Continue పైన క్లిక్ చేస్తే మీ ఆల్బం షేరింగ్‌కు సిద్ధమవుతుంది. ఆల్బం పేజి పైన కనిపించే Let people know పైన క్లిక్ చేసి ఇ-మెయిల్ చిరునామాలు ఇస్తే వారికి దీని లింక్ పంపవచ్చు. వారు ఈ ఆల్బంలోని ఫోటోల్ని thumbnailsగా లేదా slide show రూపంలో వీక్షిస్తారు. తర్వాత మరెప్పుడైనా మరికొన్ని ఫోటోల్ని ఇదే ఆల్బంకు Add photos ద్వారా జోడించుకోవచ్చు. పలు dramatic photo effectsను చేర్చడం ద్వారా ఈ ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.