వేగానికి, అపరిమిత శక్తికి ప్రతిబింబం USB 3.0
ప్రస్తుతం వినియోగంలో ఉన్న USB 2.0 కంటే దాదాపు 10 రెట్లు వేగం, అభివృద్ధి చేసిన పవర్ మేనేజిమెంట్‌తో ఇంకా పొడిగించిన బ్యాటరీ జీవితకాలం.. ఫలితం USB 3.0 ఆవిర్భావం. అంతర్జాతీయంగా విస్తృత వాడుకలో ఉన్న ఈనాటి PC ఇంటర్‌ఫేస్‌ను మరింత మెరుగుపరచవలసిన అవసరం కలగడానికి ఇవే బలమైన కారణాలు. 2015 నాటికి ఉత్పత్తి జరిగే కొత్త PCలన్నీ USB 3.0 పోర్ట్‌లతోనే వినియోగదారుల చెంతకు వస్తాయని భావిస్తున్నారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 2 బిలియన్లకు పైగా కొత్త "సూపర్ స్పీడ్" USB పరికరాల విక్రయం జరగడం నిశ్చయమన్న విశ్వాసం నెలకొంది. USB 3.0 కోసం పెట్టుబడులు పెట్టడమన్నది సులభమైన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత USB పర్యావరణవ్యవస్థతో రాజీపడకుండా అధిగమించడమన్నది నిస్సందేహంగా ఒక సవాల్. ఇక మార్పులు చేసిన 3.0 వెర్షన్ ప్రత్యేక లక్షణాల్ని కచ్చితంగా అనుసరించేలా డిజైన్ చేపడితేనే USB 3.0 కోసం రూపొందించే హార్డ్‌వేర్ అన్నది వినియోగానికి అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో బిలియన్ల సంఖ్యలో ఉన్న పాత USB పరికరాలకు సైతం అనుగుణంగా Windows ఉండాలి.
1996లో వెలుగులోకి వచ్చిన మొదటి USB లక్షణాల్ని గమనిస్తే, అవి USB పరికరాలకు సంబంధించి రెండు రకాల వేగాల్ని నిర్వచించాయి. అవేమిటంటే.. 1.5 Mbpsతో తక్కువ వేగం గలవి, 12 Mbpsతో పూర్తి వేగం (full speed) గలవి విడుదలయ్యాయి. 2000 సంవత్సరంలో 480 Mbpsతో హైస్పీడ్ USB 2.0 రంగప్రవేశం చేసింది. హైస్పీడ్ పరికరాలు అన్నిరకాల కంట్రోలర్లతోనూ పనిచేశాయి. అయితే, తక్కువ మరియు పూర్తి వేగం గల పరికరాలు USB 2.0 కంట్రోలర్లతో పని చేయలేకపోయాయి.
2008లో USB స్టాండర్డ్స్ సంస్థ USB 3.0కి సంబంధించి నూతన host controllerతో కూడిన సరికొత్త ప్రమాణాల్ని విడుదల చేస్తూ 5 Gbps సామర్థ్యం గల సూపర్ స్పీడ్ USBకి నిర్వచనమిచ్చింది. మొత్తంగా ఈ controller మరియు పరికరం కలసి ఊహించనలవి కాని రీతిలో USB 2.0 కంటే 10 రెట్లు వేగంతో పనిచేస్తాయి. ఈ సరికొత్త ప్రమాణాలతో మీరు ఒక హై డెఫినిషన్ మూవీని మీ USB స్టోరేజి డ్రైవ్‌లోకి కేవలం 80 సెకెండ్లలో కాపీ చేయగల్గుతారు. USB 2.0లో అయితే ఇందుకు సుమారు 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ నూతన ప్రమాణాలు ప్రవేశపెట్టిన సరికొత్త ట్రాన్స్‌ఫర్ టైప్ / స్ట్రీమ్స్ కారణంగా ఈ స్టోరేజి డ్రైవ్‌లలో చదవడం మరియు రాయడం లాంటి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా జరుగుతాయి.
ఈ సరికొత్త ప్రమాణాలు USB 3.0కి 2.0 కంటే 80% ఎక్కువ శక్తినిచ్చాయి. దీనర్థం వేగం వేగంగా చార్జింగ్ కావడమేగాక, external DVD డ్రైవ్‌లు మరియు ఇతర పరికరాల కోసం ఉపయోగించే "Y" కేబుల్స్ ఇక అవసరం లేదు. పవర్‌కు సంబంధించిన ఛార్జింగ్ విషయంలో మరికొన్ని విశేషాలున్నాయి. మొబైల్ కంప్యూటింగ్ నేపథ్యంలో ప్రజలు నేడు బ్యాటరీ జీవితకాలాన్ని పొదుపు చేసే PCలను కోరుకుంటున్నారు. USB 3.0లోని ఈ అంశాల్ని గమనిస్తే, దీని ముందున్నవాటికంటే ఇది త్వరితగతిన కార్యకలాపాలను పూర్తి చేస్తూ, అవకాశమున్నప్పుడల్లా శక్తిని ఆదా చేస్తూ విద్యుచ్ఛక్తి వినియోగంలో సరికొత్త కనిష్ఠ స్థాయిలను అందుకుంటుంది. ఫలితం, Notebooksకు సుదీర్ఘ బ్యాటరీ జీవితకాలం, Desktopలకు వీలైనంత తక్కువ విద్యుత్ వినియోగం.
అత్యంత ముఖ్యమైన అంశమేమిటంటే పూర్తి, తక్కువ మరియు ఎక్కువ స్థాయి వేగాన్ని ప్రదర్శించే పరికరాలకు అనుగుణంగా కొత్త తరం USB ప్రయోజనాల్ని అందించేలా 3.0 ప్రమాణాలు హామీనిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్లగ్స్ సైతం వెనుకటివాటికి అనుగుణంగా ఉంటాయి.