హానికరమైన సాఫ్ట్‌వేర్ తొలగింపు ఇక సులభం
(Malicious Software Removal Tool)

 

         Windows 7, Windows Vista, Windows XP, Windows 2000 మరియు Windows Server 2003 తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న మీ కంప్యూటర్లలో నిర్దిష్టమైన, తరచుగా చొరబడే Blaster, Sasser మరియు Mydoom లాంటి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను తొలగించడమేగాక మరే ఇతర ఇన్ఫెక్షన్‌నైనా క్లీన్ చెయ్యడంలో Microsoft Windows Malicious Software Removal Tool మీకు ఎంతగానో సహకరిస్తుంది.

 

ఈ Tool మీ కంప్యూటర్‌ను ఆమూలాగ్రం పరిశీలించి, హానికరమైన సాఫ్ట్‌వేర్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించిన తర్వాత మొత్తం ఫలితాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రదర్శిస్తుంది. భద్రతాపరమైన సమస్యల్ని ఎదుర్కొని వాటిని అధిగమించేందుకుగాను ఎప్పటికప్పుడు సన్నద్ధమైయ్యేలా Malicious Software Removal Toolను తీర్చిదిద్ది ప్రతి నెలా రెండవ మంగళవారం దీని updated versionను Microsoft మీకందిస్తుంది. Microsoft Update, Windows Update మరియు Microsoft Download Center ద్వారా ఈ తాజా version అందుబాటులో ఉంటుంది.

 

Microsoft Update మరియు Windows Update ద్వారా విడుదలయ్యే ఈ Tool అంతర్లీనంగా పనిచేస్తుంటుంది. ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గ్రహించగానే మీకు తెలియజేస్తుంది. ప్రతి నెలలోనూ ఒకటి కంటే ఎక్కువమార్లు దీనిని ఉపయోగించుకోవడం కోసం Download Center నుంచి తాజా versionను అందుకోండి.

 

వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన కంప్యూటర్లు మామూలుగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తాయిగానీ లోలోపల ఏదో ఒక రూపంలో నష్టం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ Malicious Software Removal Tool ఎప్పుడూ వినియోగంలో ఉండేలా చూసుకోవాలి. హానికరమైన సాఫ్ట్‌వేర్ దాడులకు గురికాకుండా మీ కంప్యూటర్లను రక్షించుకోవడానికి Microsoft Security Essentials లాంటి use up-to-date antivirusను కూడా ఉపయోగించుకోవాలి.

 

మీ కంప్యూటర్‌కు Microsoft Safety Scanner ద్వారా online scan నిర్వహించండి. మీ కంప్యూటర్‌లో ఉన్న హానికరమైన, అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్లను దీని సాయంతో కనిపెట్టవచ్చు. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోదగిన ఈ toolతో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కానింగ్ చేసుకుని వైరస్‌లు, స్పై వేర్‌లను తొలగించుకోవడానికి సహకరిస్తుంది. ప్రస్తుతం మీరు ఉపయోగించే antivirusతో పాటే ఇదీ పనిచేస్తుంది. అయితే antivirus సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయం కాదు.

Read More on...