Microsoft సర్ఫేస్ అండ్ రొబోటిక్స్ డెవలపర్ స్టూడియో
మూస తరహా కార్యకలాపాల్లో రోబోల వినియోగం గురించే ఇన్నాళ్ళూ మనం భావిస్తూ వచ్చాం. అయితే, గత 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో ఈ రోబోల కార్యనిర్వహణ శైలి మారింది. మన సంభాషణల్లో వీటి గురించిన ప్రస్తావన ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది Roomba లేదా బాంబు నిర్వీర్య వాహనం. అయితే, కాలక్రమంలో రోబోల ఉపయోగం పలుమార్లు ఋజువైంది. ప్రత్యేకించి చెప్పాలంటే జనం అడుగుపెట్టడానికి సాహసించలేని పరిస్థితుల్లో వీటి పాత్ర కీలకం.
ఇప్పుడు రోబోల పాత్రను మరింత మెరుగుపరిచేలా University of Massachusettsలోని రోబోటిక్స్ ప్రయోగశాలలో నిజంగా అత్యంత ఆసక్తిగొలిపే కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి ప్రొఫెసర్లు Holly Yanco మరియు Mark Micireలు Microsoft Research విభాగంతో కలసి గేమ్ కంట్రోలర్ లాగా పని చేసే ఒక హ్యూమన్-రోబో ఇంటరాక్షన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు.
DREAM అని పిలిచే ఈ కంట్రోలర్‌కు ఎడమ వైపు ఉండే జాయ్ స్టిక్ ద్వారా రోబో దృష్టిని, కుడి వైపు ఉండే జాయ్ స్టిక్ ద్వారా స్టీరింగ్‌ను నియంత్రించవచ్చు. ఈ జాయ్ స్టిక్‌కు సంబంధించిన ఒక సరైన ప్రణాళిక దిసగా ప్రొఫెసర్లు Holly మరియు Mark ఎంతో అభినందనీయమైన కృషి చేశారు. అనంతరం నికార్సయిన మరియు సౌకర్యవంతమైన నియంత్రణ అనుభవాన్ని సాధించేందుకుగాను వీరు Microsoft Robotics Developers Studio (RDS) మరియు ఉపరితల సామర్థ్యాన్ని వినియోగించారు. ఈ జాయ్ స్టిక్‌ను ఎలా ఉపయోగించాలనేది కేవలం ఒక్క రోజులో నేర్చుకోవచ్చు. Xbox లేదా వీడియో గేమ్స్‌ను అంతగా ఉపయోగించన ఒక 60 ఏళ్ళ వ్యక్తి కూడా రోబోను దీని ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏమిటంటే.. ఒక తిరుగులేని NUI అప్లికేషన్‌ని సృష్టించేందుకు గాను ఇది RDS మరియు ఉపరితల వ్యవస్థల సమ్మేళనాన్ని వినియోగించింది. మైదానంలోని పరిస్థితులు సురక్షితంగా లేని సమయాల్లో మరింత నైపుణ్యంతో పనిచేసేలా శోధన మరియు రక్షణ వ్యూహకర్తలకు అర్థవంతమైన సహకారాన్ని అందించడంలో ఇదెంతగానో ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలో ప్రొఫెసర్లు Holly మరియు Mark మరో విజయాన్ని కూడా సాధించారు. అదేమిటంటే, Tablet పరికరాలతోనూ పనిచేసేలా ఈ సొల్యూషన్‌ను రూపొందించారు. ఎలాగంటే.. వర్కర్లు సదరు కార్యక్షేత్రానికి సమీపాన ఉండి Tablet ద్వారా రోబోలను నియంత్రిస్తుండగా ప్రధాన కార్యాలయంలోని శోధన మరియు రక్షణ వ్యూహకర్తలు డేటా సెట్స్ (భవన ప్రణాళిక లేదా భౌగోళిక సమాచారం) పరిశీలన చేస్తూ, ప్రతి రోబో నుంచీ వీడియో అందుకుంటూ వాటి కమాండ్ కంట్రోల్ కార్యకలాపాల్ని అర్థవంతంగా సమన్వయంతో పర్యవేక్షించడం వంటిదని చెప్పుకోవాలి.
ప్రొఫెసర్లు Holly మరియు Markల కార్యకలాపాల్లో MSRను ప్రతిబింబింపజేయడం ఇది రెండవసారి. గత ఏడాది గమనిస్తే, ఒక వ్యక్తి పలు రోబోలను నిర్వహించేలా ఉపరితలంపై వారు సృష్టించిన సిమ్యులేషన్‌కు సంబంధించిన ఒక షార్ట్ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. నాటి నుంచీ పలు సాధారణమైన శోధన మరియు సహాయ కార్యకలాపాల లక్ష్యాలను నెరవేర్చేందుకు గాను నిర్దిష్ట multi-touch gestures పై వీరు పనిచేస్తున్నారు.