ఈ-జీగా ఉపకారవేతనాలు... Online తోడ్పాటు..
(AP Government plans to introduce EZ cards for scholarship payment to students through Online system)
రాష్ట్ర విద్యార్థులకు ఉపకారవేతనాల చెల్లింపు ప్రక్రియలో EZ (ఈజీ) కార్డుల్ని ప్రవేశపెట్టి Online ద్వారా ఈ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ముఖ్యంగా ఉపకారవేతనాల్ని పొందేందుకుగాను ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతాల్ని తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులకు EZ కార్డులు మరింత సౌలభ్యంగా ఉంటాయి. విద్యార్థులు ఈ కార్డులతో ఏ ATM కేంద్రం నుంచయినా వారి ఉపకారవేతన మొత్తాన్ని పొందవచ్చు (విత్ డ్రా).
పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల చెల్లింపు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటం కోసం విద్యార్థుల వివరాల నమోదు, ఉపకారవేతన మొత్తాన్ని మంజూరు చెయ్యడంతోపాటు తదుపరి పునరుద్ధరణ క్రమం అంతటినీ ఇంటర్నెట్ ద్వారా కొనసాగించాలన్నది సాంఘిక సంక్షేమ శాఖ ప్రతిపాదన. ఈ ఉపకారవేతనాల ద్వారా సుమారు ఆరు లక్షల మంది ఎస్‌సి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రతి విద్యార్థీ ప్రస్తుత e-Pass వ్యవస్థ ద్వారా Onlineలో నమోదు చేసుకోవాలి. అర్హతగల విద్యార్థులు ఇందులోకి login అయ్యి వారి దరఖాస్తు ప్రస్తుత స్థితిని గురించి తెలుసుకోవచ్చు.
ఇప్పుడున్న విధానాన్ని గమనిస్తే... విద్యార్థులు తమకు మంజూరైన ఉపకారవేతనం కోసం ప్రభుత్వం సూచించిన బ్యాంక్‌లో ఖాతా తెరిచి, అందులో ఆ బ్యాంక్ నిబంధనల మేరకు కనీస నగదు మొత్తాన్ని నిల్వ (minimum balance) ఉంచాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాతాలు తెరవడం, వాటిలో కనీస మొత్తాన్ని నిల్వ ఉంచడంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీంతో విద్యార్థులు ATMల ద్వారా ఉపకారవేతన మొత్తాన్ని తీసుకోవడానికి వీలుగా EZ కార్డుల్ని ప్రవేశపెట్టి Online ద్వారా ఉపకారవేతనాల మంజూరు వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ తెలియజేసింది.
గత విద్యా సంవత్సరంలో సుమారు 24.51 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుత సంవత్సరంలో 15.5 లక్షల దరఖాస్తులు పునరుద్ధరణ కోసం వచ్చాయి.