స్పర్శానుభూతికి ప్రతిబింబం Microsoft Touch Mouse
Windows 7 యూజర్ల కోసం Microsoft సంస్థ స్పర్శ ఆధారంగా పనిచేసే వినూత్న Touch Mouseను ఆవిష్కరించింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ Touch Mouse ద్వారా Windows 7 యూజర్లు సరికొత్త రీతులలో తమ PC వ్యవహారాల్ని నిర్వహించుకోవచ్చు. 1960ల నుంచీ నిరంతరాయంగా ఉత్తమ సేవలందిస్తూ అందరికీ అలవాటై ఉన్న Mouse లక్షణాలను పుణికిపుచ్చుకుంటూనే చేతివేళ్ళ స్పర్శ ఆధారంగా మరెన్నో విశిష్టతలను కలిగి ఉండేలా Microsoft Touch Mouseను రూపొందించారు. Windows 7 యూజర్లు వారి ఆపరేటింగ్ సిస్టంలో సహజమైన విహారానికి ఉపయుక్తంగా ఉండేలా కోట్లాది మందికి ఈ సరికొత్త Mouse తోడ్పాటునిస్తుంది.
Mouse పై కేవల స్పర్శ ద్వారా నియంత్రణ మరియు కచ్చితత్వాల కలయికతో మీ PCని నడిపించేలా ఒక పరికరాన్ని తొలిసారిగా Microsoft మీ ముందుంచింది. అంటే, PC నియంత్రణను చేతి వేలి కొసలోనే యూజర్లు ఆనుభూతి చెందవచ్చన్నమాట.
యూజర్లు ఒక Mouseతో చేయగల అన్ని కార్యకలాపాలనూ ఈ Touch Mouseతో చేసుకోవచ్చు. అంటే, కావలసిన అంశంపై Point చేసి క్లిక్ చేయడం లాంటి మామూలు పనులన్నిటినీ సాధ్యం చేయడంతోపాటు Touch Mouse పై గల చేతి వేళ్ళ కదలికలతోనే Windows 7లో మరింత సులభంగా, వేగంగా దూసుకెళ్ళేలా దీనిలోని multi-touch వ్యవస్థ చేయూతనిస్తుంది.
యూజర్ల కార్యకలాపాల్లో భాగంగా ఎప్పుడూ చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. అవేమిటంటే, Windowను min
imize మరియు maximize చేయడం, వెబ్ పేజీల గుండా scroll చేయడం వంటివి. ఇలాంటివి ఈ Mouseపై వేలి స్పర్శతో పూర్తవుతాయి.
యాజర్లు Touch Mouse ద్వారా వినూత్నమైన రీతుల్లో navigate చేయవచ్చు:
ఒకే వేలు ఉపయోగించి ఒక డాక్యుమెంట్‌లో 360 డిగ్రీల కోణంలో scroll చేయగలరు.
రెండు వేళ్ళు ఉపయోగించి ప్రస్తుత windowsను minimize మరియు maximize చేసుకోవచ్చు లేదా వాటిని కుడి లేదా ఎడమవైపునకు మార్చుకోవచ్చు.
మూడు వేళ్ళు ఉపయోగించి మొత్తం desktopలోని పనులు పూర్తి చేసుకోవచ్చు. అంటే, పలు taskల మధ్య మారడం లేదా తెరిచి ఉన్న windows అన్నిటినీ క్లియర్ చేయడం లాంటివి.
యుజర్లు బొటనవేలు ఉపయోగించి Internet Explorer, PowerPoint మరియు Windows Photo Viewer లాంటి ప్రోగ్రాంల వెంబడి ముందుకు, వెనక్కి ఇలా ఎందులోకైనా ప్రవేశించవచ్చు.
వివిధ ప్రత్యేకతలతో అలరారే Touch Mouse సరళమైన డిజన్ వెనుక Microsoftలోని వివిధ విభాగాలు రెండేళ్ళకు పైగా చేసిన పరిశోధన ఇమిడి ఉంది. Redmond మరియు Cambridgeలో ఉన్న Microsoft పరిశోధన బృందాలు, Microsoft Hardware నుంచి Applied Sciences Group 2008లో సంయుక్తంగా చేపట్టిన Mouse 2.0 ప్రాజెక్ట్ నుంచి Touch Mouse వెలుగులోకి వచ్చింది. ఒక Mouse ఉండే సాధారణ సామర్థ్యాలకు బహు స్పర్శా గ్రాహ్యతను జోడించి దానిని మరింత శక్తిమంతం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ఈ Microsoft బృందం ప్రధానంగా యూజర్ల ప్రతిస్పందనపై ఆధారపడి విస్తృత సాంకేతిక పరిజ్ఞానాన్ని, interaction modelsతో ముందుకొచ్చింది. చివరికి ఎంతో పరిశోధించి వివిధ రకాల multi-touch sensorsను ప్రతిబింబించే ఐదు రకాల మూలరూపాలు సిద్ధమయ్యాయి. వాటిలో camera-based; articulated, అంటే.. మూడు Mouse sensorsలను ఏకం చేయడం; capacitive, వంటివి ఉండగా, వీటి పనితీరు laptop యొక్క track padతో సరిపోలేలా ఉంటుంది. సునిశితమైన విశ్లేషణ అనంతరం ఈ బృందం capacitive-sensing రకం వైపు మొగ్గు చూపింది. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన మామూలు mouse లక్షణాలను, పనితీరును కొనసాగిస్తూనే multi-touch కార్యకలాపాలను అమలు చేస్తుంది. దీనిని ఉపయోగించేటప్పుడు చేతికున్న ఐదువేళ్ళకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉపరితలంపై సహజంగా ఒదిగిపోతూ చేతికి సుఖంగా ఉండేలా పలు ఆకృతులను తయారు చేయడం జరిగింది. చివరికి యూజర్ల కార్యకలాపాలకు అనుగుణమైన రూపం, సమతలం ఉండేలా 23 డిగ్రీల వాలు కలిగిన mouse ఆకృతిని ఖారారు చేశారు. ఇందుకోసం యూజర్లతో విస్తృతమైన పరిశోధనలు, వందలాది రూపాలు, నమూనాలతో పరీక్షలు జరిగాయి.
ఆ తర్వాత కొన్ని నెలల పాటు sensor డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచి ఎన్ని విధాలుగా ఉపయోగించినా పనితీరు ప్రభావవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. ఫలితంగా Windows 7లో యూజర్లు అత్యధికంగా ఉపయోగించుకునే కార్యకలాపాలను సహజమైన రీతిలోనే అందుకోగలిగేలా PC వాడుకదార్లకు సౌలభ్యం కల్గించే Touch Mouse సిద్ధమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి సంబంధించి Touch ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది. డైరక్ట్ టచ్ టెక్నాలజీ అనేది కొన్నిటికి చాలా బాగుంటుంది. రెప్పపాటు వేగంతో డిజిటల్ చిత్రాల వెంబడి scrolling మరియు flickingకి Touch కావలసిందే. అంతేగాని, Excelలోని ఒక చిన్న గడిలో క్లిక్ చేయడానికి మాత్రం పరిమితం కారాదు.
Windows 7 యూజర్లలో చాలా తక్కువ మంది మాత్రమే hardwareలో touch అనుకూలతను కలిగి ఉన్నారు. స్పర్శానుభూతిలోని రసాస్వాదనను కోట్లాదిమంది Windows 7 యూజర్ల చెంతకు చేర్చడానికి Microsoft Hardware చేసిన ప్రయత్నాల్లో భాగమే ఈ Touch Mouse. ఇంకా Explorer Touch Mouse, Arc Touch Mouse లాంటి మరెన్నో సాధనాలు మీ ముందుకు రాబోతున్నాయి. వీటితోబాటే Touch Mouse Artist Edition కూడాను.
Multi-touch PC input devices శ్రేణిలోని ఈ Touch Mouse అనేది.. మున్ముందు రాబోయే మరెన్నిటికో నాంది పలుకుతున్నది.