సోషల్ నెట్‌వర్కింగ్: Twitter
Micro-bloggingలో అగ్రస్థానాన్ని అందుకున్న ఒక ప్రత్యేకమైన సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ Twitter. సందేశాల్ని పంపేందుకు, అందుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. వీటినే Tweets అంటారు. ఒక్కో సందేశం గరిష్ఠంగా 140 అక్షరాలు మాత్రమే ఉండేలా చూస్తూ క్లుప్తతకు ప్రాధాన్యతనివ్వడమే Twitter ప్రత్యేకత.
వ్యక్తులుగాని, సంస్థలుగాని Twitter అకౌంట్ ఏర్పాటు చేసుకుని Tweets పంపవచ్చు, అందుకోవచ్చు. ఏ యూజర్ అయినా మరో యూజర్‌ను అనుసరించేందుకు.. గమనించేందుకు వీలు కల్పించే ఓపెన్ ప్లాట్‌ఫాం ఇది. అయితే, యూజర్ల Tweetsకు యొక్క గోప్యతను పరిరక్షించుకోవడానికి కూడా Twitter అవకాశమిస్తుంది. ఇందుకుగాను, ఆయా Twitter అకౌంట్ యజమానులు తమను అనుసరించదలచిన ప్రతి యూజర్‌ను స్వయంగా ఆమోదించడం లేదా తిరస్కరించడం చెయ్యాల్సి ఉంటుంది. తమ Tweetsను చూడకుండా ఎవరినైనా నిరోధించవచ్చు కూడా.
కాలానుగుణంగా యూజర్లతో పాటు Twitter కూడా విస్తృతంగా ఎదుగుతూ వచ్చింది. మరొక యూజర్ పంపిన Tweetలోని సందేశాన్ని మనం ఇతరులెవరికైనా పంపాలనుకుంటే దానిని re-tweet చెయ్యవచ్చు. మొదట్లో ఇలాంటి సందేశాలు తమ స్వంతం కాదని, అవి మరొకరు పంపినవని తెలిసేలా వాటి ముందు “RT” అని ఉంచేవారు. ఇప్పుడు re-tweetకు ప్రత్యేకంగా ఒక బటన్ ఉంది.
మొదట్లో Twitter సరైన బిజినెస్ మాడల్ కాదంటూ విమర్శలు ఎదురైనప్పటికీ... సెర్చింగ్‌లో అగ్రగణ్య సంస్థలైన Bing మరియు Googleతో ఒప్పందం కుదిరాక Twitterకు ఇది ఆదాయ వనరుగా మారింది. ఇటీవల మరిన్ని సేవలతో సరికొత్త రూపంలో Twitter సిద్ధమైంది.
మరిన్ని వివరాలకోసం www.twitter.com వీక్షించండి.