Twitterలో Visual Studio
Visual Studioపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పూర్తిగా అందుకోవాలంటే Twitterలోని ఆ పుటను వీక్షించాల్సిందే. పలు అంశాలపై విభిన్నమైన వివరాలకోసం సులభంగా ఆధారపడదగిన వేదిక ఇది. సమస్యల్ని ఎదుర్కొనేందుకు, సరైన పరిష్కారాల్ని కనుగొనేందుకుగాను Visual Studio వినియోగదార్లకు ఎంతగానో తోడ్పాటు లభించే చోటు ఇది. సాంకేతిక దృక్కోణంలోని పలు వ్యాసాలు, ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాపుల జాబితా ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి. Visual Studio మరియు safe 2010కి సంబంధించిన పలు వీడియో సెషన్లకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఇందులోని పలు అంశాలు వీడియో రూపంలోనే ఉంటూ వివిధ భాషలకు చెందినవారికైనా అర్థమయ్యే రీతిలో పొందుపరిచారు. Visual Studio మరియు Visual Studio 2010 టెస్టింగ్‌కి సంబంధించిన Windows Azure టూల్స్ పై కూడా ఇందులో వీడియో ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
http://twitter.com/#!/VisualStudio
Visual Studio కోసం ఉన్న Windows Azure టూల్స్ మీ Visual Studio అనుభవాన్ని మరింత సమగ్రంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా Cloud ప్రాజెక్ట్ టూల్స్ ఎంత సౌలభ్యంగా ఉన్నాయంటే రోల్స్‌ను చేర్చడం, ప్రస్తుత ప్రాజెక్ట్‌లను Cloud ప్రాజెక్ట్‌లుగా మార్చడం తదితరాలతో పాటు మరెన్నో కార్యకలాపాల్ని మీరు ఎంతో సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
ఇవన్నీ ఇలా ఉంటే, MIX 2011 అనే ఈవెంట్ వివరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌లో లాభదాయకమైన కన్స్యూమర్ సైట్లను సృజనాత్మకంగా తీర్చిదిద్దే డెవలపర్లు, డిజైనర్లు, UX నిపుణులు మరియు బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను ఒక చోట చేర్చే వేదిక ఇది. సాంకేతిక, కోడ్ ఆధారిత అంశాలు మొదలుకొని వివిధ అంశాలకు సంబంధించిన వ్యూహం, వాటిని ఉపయోగించుకోవడం, రూపం గురించిన సెషన్లు ఇక్కడ నడుస్తుంటాయి.
Team Foundation Server 2010 (TFS) గురించి ఇందులో ఉన్న ఒక వ్యాసం ఎంతో ఉపయుక్తంగా ఉంది. తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని రాబట్టే దిశగా డెవలప్‌మెంట్ టీమ్‌లకు ఇక్కడ ఎంతో సమాచారం ఉంది. డెవలప్‌మెంట్ టీమ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్లు, నాణ్యతా నిర్ధారణ విభాగం, ఉన్నతస్థాయిలో యాజమాన్యం ఎంతో ప్రణాళిక, చేయూత మరియు సంప్రదింపుల్ని ఆశించడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో TFS అందించే ఒక సమగ్ర lifecycle మేనేజిమెంట్ టూల్ డెవలపర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక అప్లికేషన్ lifecycleలోని అన్ని దశలు, భాగాల్ని పరిశీలించడానికిగాను మరో టూల్‌కు మారాల్సిన అవసరం ఉండదు. TFS తోడ్పాటు ఉన్నందువల్ల వివిధ అవసరాలు, version control source code, ఆటోమేట్ బిల్డ్స్ మరియు deployments గురించి డెవలపర్లు సులభంగా అర్థం చేసుకోగల్గుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమ్స్‌కు రిమోట్ యాక్సెస్‌ను అందించేలా డిస్ట్రిబ్యూటెడ్ మరియు క్రాస్ ఫంక్షనల్ టీమ్‌లు ఒక స్థిరమైన version control tool ఉండేలా దీనిని మరింత ముఖ్యమైన సాధనంగా తీర్చిదిద్దుతాయి. Visual SourceSafe యూజర్ల డెవలప్‌మెంట్ కార్యకలాపాల్లో వారి అవసరాల్ని తీర్చే శక్తిపూర్ణమైన నిధిగా ఇది ఉపయోగపడుతున్నదనడంలో సందేహంలేదు.