Unicode.org
దేశ విదేశాల్లోని పలు భాషలలో ఉపయోగించుకునేందుకుగాను Font applicationను అభివృద్ధి చేసినప్పటికీ... ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ కార్యకలాపాల కోసం ఆయా భాషల లిపిని వినియోగించుకునే పరిస్థితులు బాగా పెరిగాయి. అంతేగాక, అయోమయాన్ని నివారించి అప్లికేష్లను అభివృద్ధి చేయడం కోసం ప్రామాణీకరించిన ఒక ఎన్‌కోడింగ్ ఫార్మేట్ అవసరం ఏర్పడింది.
ఈ పరిస్థితుల మధ్య ప్లాట్‌ఫాం, ప్రోగ్రాం, భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఉన్న ప్రతి అక్షరానికీ ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించడం Unicode ఎన్‌కోడింగ్ లక్ష్యంగా ఉంది. Microsoft, Apple, Hewlett-Packard (HP), Oracle లాంటి ఎన్నో అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సంస్థలు Unicode ప్రమాణాలను అనుసరిస్తున్నాయి. Internet Explorer (IE), Mozilla Firefox, Google Chrome, Opera, Safari తదితర ఆధునిక బ్రౌజర్లు, Windows, Mac OS మరియు Linux లాంటి ఆపరేటింగ్ వ్యవస్థలు Unicode ఎన్‌కోడింగ్‌కు మద్దతునిస్తున్నాయి.
వివిధ భాషల్లో Unicode వాడకం గురించి తెలుసుకోవడానికి, మీ అక్షరాలనూ చేర్చడానికి సంబంధించిన పలు వనరులను Unicode.org మీకు అందిస్తుంది. తాజాగా భారతీయ రూపాయి (INR) సంకేతాన్ని సరికొత్త అక్షరంగా Unicodeలో చేర్చారు. ఇది ఇంకా Original Equipment Manufacturer (OEM) హార్డ్‌వేర్‌తో విడుదల కావలసి ఉంది. అయితే, మన రూపాయి సంకేతాన్ని వెంటనే వాడుకోవడం కోసం దీని యూనికోడ్ అక్షర రూపం అందుబాటులో ఉన్నది.
Unicode సంస్థల వ్యవస్థ లాభాపేక్షరహితంగా Unicode.orgను నిర్వహిస్తున్నది. Unicode అభివృద్ధి, విస్తృతి, ఒక ప్రమాణంగా దీని వాడకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా Unicode సంస్థల వ్యవస్థ ముందడుగు వేస్తున్నది. కంప్యూటర్‌లో ఒక అక్షరాకృతి ఏ విధంగా మేప్ చేయబడి ఉంటుందనే ఆసక్తికరమైన వాస్తవాన్ని తెలుసుకోవడం కోసం “Where is my Character?” అనే విభాగాన్ని వీక్షించండి.