ఢిల్లీలో 15వ ప్రపంచ సంస్కృత సదస్సు

 

               సంస్కృత అధ్యయన అంతర్జాతీయ సంఘం (IASS), రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ (RSKS) సంయుక్త ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ సంస్కృత సదస్సు 2012 జనవరి 5 నుంచి 10వ తేదీ వరకూ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్నది. ఈ సదస్సు నిర్వహణకు సంబంధించిన నిర్ణయాన్ని 2009లో జపాన్ నగరమైన క్యోటోలో జరిగిన 14వ అంతర్జాతీయ సంస్కృత సదస్సులోనే తీసుకున్నారు. 15వ అంతర్జాతీయ సదస్సు విషయానికి వస్తే దీనిని 18 ప్రధానాంశాలుగా (ఏకకాలంలో ఆరు సెషన్లు కొనసాగేలా) ఆయా రంగాల్లో నిపుణులైనవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

 

సంబంధిత కన్వీనర్లు వారి విభాగాలకు చెందిన నిర్వహణ ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా పత్రాలను ఎంపిక చేస్తారు. సదస్సు సమయంలో వీరే ఛైర్‌పర్శన్లుగా వారి అంశాలపై జరిగే సెషన్లకు అధ్యక్షత వహిస్తారు లేదా అవసరాన్ని బట్టి అదనంగా ఛైర్‌పర్శన్లను ఆహ్వానించే అవకాశమున్నది.

 

నిర్దిష్ట ప్యానెల్ యొక్క అంశాన్ని ప్రాధాన్యపరిచే ఆలోచనతో ఆయా సెక్షన్ల కన్వీనర్లు తమ సెక్షన్‌కు ఉద్దేశించిన శీర్షికను పాక్షికంగా మార్పు చేసే అవకాశమున్నది. సదస్సును అత్యున్నత పండిత ప్రమాణాల మధ్య నిర్వహించే క్రమంలో కన్వీనర్లు వారి సెక్షన్‌కు సంబంధించి ఉపన్యాసాలు ఇవ్వడానికిగాను ముందుగానే వక్తలను ఎంపిక చేసుకుని ఉండవచ్చు. ఇందుకుగాను పత్రాన్ని సమర్పించదలచిన పండితులు వారి పత్ర శీర్షిక మరియు సారాంశాన్ని న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు ఆయా కన్వీనర్లకు చేరతాయి. వారి వీటిని సమీక్షించి ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. సదస్సు నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో వివిధ సెక్షన్లలో సమర్పించే పత్రాలకు కన్వీనర్లే సంపాదకులుగా వ్యవహరిస్తారు.

 

రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ (RSKS) భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన న్యూఢిల్లీలో ఏర్పాటైన డీమ్డ్ టు బి యూనివర్శిటీ.

 

మరిన్ని వివరాలకు వీక్షించండి: http://www.sanskrit.nic.in

 

సంప్రదించవలసిన చిరునామా:

15 World Sanskrit Conference,
Rashtriya Sanskrit Sansthan
Deemed to be University,
Under MHRD, Govt. of India
56-57, Institutional Area
D-Block, Janakpuri,
New Delhi-110058
E-mail: wscrsks@yahoo.com.
cc : wscrsks@gmail.com

Read More on...