సరికొత్త సైబర్ లోకం Microsoft Windows 8.0
టెక్నలజీలో సరికొత్త విప్లవం దిశగా భూగోళమంతా దృష్టి సారించింది. కార్పోరేట్లు, సాంకేతిక నిపుణుల కళ్ళన్నీ ఇంకా మెరుగైన Operating System వైపే ఉన్నాయి. ఆ క్షణాలు Microsoft Corporationతో ఆవిష్కృతమవుతున్నాయి. Microsoft Corporation మరో OSను సైబర్ లోకానికి అందించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. దీనికి తాత్కాలికంగా Windows 8.0 అని పేరు పెట్టారు.
అంతర్గతంగా Windows 8.0 అనే సంకేత నామంతో పిలుస్తున్న ఈ Windows తదుపరి versionను Microsoft Corporation తన hardward భాగస్వామ్య సంస్థలకు ప్రదర్శించి యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందించే పరికరాల రూపకల్పనలో వాటికి సహకరించే ప్రయత్నం చేసింది. Tabletలతో పాటు సరికొత్త touch-centric hardwareకు అనుగుణంగా Windows 8.0ను అభివృద్ధిపరచడం గురించి భాగస్వామ్య సంస్థలకు Microsoft తెలియజేసింది. అదే సమయంలో ప్రస్తుతం Windows నుంచి ప్రజలు కోరుకుంటున్న సౌలభ్యం, అనుసంధానం, శక్తి సామర్థ్యాలను అందించడంలో ఏమాత్రం రాజీపడే సమస్య లేదు.
Windows 8.0 సాంకేతిక ప్రదర్శన దీని సామర్థ్యానికి సంబంధించిన పలు కీలకాంశాలను వెల్లడించింది. ఇది పూర్వపు prototypesతో పాటు x86 మరియు ARM ఆధారిత ఆర్కిటెక్చర్లతో సైతం సమర్థవంతంగా పనిచేసే సత్తాను చాటుకుంది. Windows తదుపరి వెర్షన్ పై Microsoftతో కలసి పనిచేసేందుకు Silicon చిప్ తయారు చేసే సంస్థలు AMD, Intel Corporation, NVIDIA Corp., Qualcomm Inc. మరియు Texas Instruments Inc. సంస్థలు గత జనవరి నెలలోనే ప్రణాళికలను ప్రకటించాయి.
యూజర్లు PCని స్విచాన్ చేసి, వారికి తెలిసిన అప్లికేషన్లతో ఎలా పనిచేస్తున్నారన్నది మొదలుకొని deviceతో వారి అనుభవం అనేది Windows 8తో ఒక సహజమైన పొడిగింపు కావాలనేది Microsoft లక్ష్యం. Windows 95 రోజుల నుంచీ Windows డిజైన్‌లో Microsoft చేపట్టని ప్రాథమికమైన మార్పునకు ఇది దర్పణంగా నిలుస్తుంది. తద్వారా సరికొత్త PC డిజైన్లను ఆవిష్కరించేందుకు తన hardware భాగస్వామ్య సంస్థలకు Microsoft సంస్థ భారీగా అవకాశాలను ఇస్తున్నది.
Device పనితీరుకు అనుగుణమై సహజంగా ఇమిడిపోయే నియంత్రణలతో ఈ Windows 8 Operating System పై అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయనే దిశగా కూడా యూజర్లకు ఒక సరికొత్త అనుభూతి లభిస్తుంది. ఇక డెవలపర్లు మరింత సమగ్రత, అనుగుణ్యతను అందిస్తూ PCలో పనిచేసేలా HTML5 మరియు JavaScript లాంటి వెబ్ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతారు.
సరికొత్త Operating System కోసం అప్లికేషన్లను రూపొందించే క్రమంలో డెవలపర్లకు తోడ్పోటునిచ్చేందుకుగాను Microsoft కొత్తగా నిర్వహించబోయే BUILD సదస్సుకు లాంఛనంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.