మీరెక్కడున్నా మీ PCని కాపాడే Windows Intune
కంపెనీల్లో PCలను ఉపయోగించి వివిద కార్యకలాపాల్ని నిర్వహించే ఉద్యోగులకు ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా మనసు మనసులో ఉండదు. ఇంట్లో ఉన్నా, బజారులో ఉన్నా వీరి దృష్టంతా ఆఫీస్‌లోని తమ కంప్యూటర్ పైనే ఉంటుంది. తమ సిస్టం ఎలా ఉందో ? రేపు ఆఫీస్‌కు వెళ్ళే సమయానికి అది సరిగ్గా పనిచేస్తుందో లేదో ? లేదా కొలీగ్స్ ఎవరైనా అందులోని ఫైల్స్‌ని పాడు చేశారో ఏమో ? వైరస్ బారిన పడిందేమో ? నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతుందో లేదో?.. ఇలా ఎన్నో అనుమానాలు పట్టి పీడిస్తుంటాయి. PC నిర్వహణకు సంబంధించిన ఇలాంటి సవాళ్ళన్నిటికీ జవాబుగా Windows Intuneని మన ముందుకు తీసుకువచ్చింది Microsoft సంస్థ. Windows cloud సర్వీసెస్ మరియు Windows 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ల ద్వారా మీ PC భద్రత, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. Windows 7 Enterprise లేదా standardize వెర్షన్లతో మీ కంప్యుటర్లు, యూజర్లు ఎక్కడి నుంచైనా గరిష్ఠ సామర్థ్యంతో పని చేసుకునేలా వెబ్ ఆధారిత కన్సోల్ ద్వారా తోడ్పాటు లభిస్తుంది.
సాంకేతిక వనరులపై తక్కువ పెట్టుబడి ద్వారా అత్యధిక సాంకేతిక ఫలితాల్ని పొందడానికిగాను అపురూపమైన అవకాశమిస్తున్న వ్యవస్థగా Windows Intuneని పేర్కొనవచ్చు. సంస్థలోని IT నిపుణులు గానీ, పలు వ్యాపారాలకు సంబంధించిన PCల నిర్వహణ కోసం సొల్యూషన్ ప్రొవైడర్లుగానీ దీనిని ఉపయోగించుకోవచ్చు. మీ PCలన్నిటి నిర్వహణ మరియు రక్షణతో బాటు hard-to-reach PCs, non-domain joined PCs, ఫీల్డ్‌లో ఉండే ఉద్యోగులు, మీ సంస్థ స్వాధీనమైన ఇతర సంస్థల IT కార్యకలాపాలకు సైతం సాంకేతికంగా లబ్ధి చేకూర్చుతుంది.
PC నిర్వహణ మరియు పూర్తిస్థాయి రక్షణకోసం Windows 7 Enterprise upgrade subscriptionతో Windows cloud సర్వీసులను ఏకతాటిపైకి తీసుకువచ్చే సంపూర్ణ Microsoft సొల్యూషన్ కావడం వల్లే Windows Intune ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వెబ్ ఆధారిత కన్సోల్ సాయంతో మీ PC పరిస్థితిని, అప్‌డేట్ మరియు మాల్‌వేర్ (Microsoft Malware Protection Engineతో) స్థితిగతుల్ని, సెక్యూరిటీ పాలసీలు, అలెర్ట్స్ తదితరాల్ని నిశితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవచ్చు. మీకు కావలసిందల్లా ఒక ఇంటర్నెట్ కనెక్షన్, మీ PCల్లో Windows Intune క్లయింట్ ఇన్‌స్టాల్ అయి ఉండటం.
మీ వ్యాపార ఆస్తులు, లైసెన్స్ కార్యకలాపాల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించే మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ఆస్తుల్ని ఒక కంట కనిపెట్టే బాధ్యతను కూడా Windows Intune తీసుకుంటుంది. మీరు, మీ యూజర్లు ఉన్న ప్రదేశాలతో నిమిత్తం లేకుండా Remote assistanceతో సదరు PCల్లోని సమస్యల్ని పరిష్కరిస్తుంది. సొల్యూషన్ ప్రొవైడర్లు లేదా IT కన్సల్టెంట్లు వారి కస్టమర్ల PCలను నిర్వహించేందుకు Windows Intuneను ఉపయోగించినట్లయితే Multi-Account Console ద్వారా ఒకేసారి ఆ కస్టమర్ల అకౌంట్లను వీక్షించేందుకు, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు వీలవుతుంది. మీ పర్యవేక్షణలో ఉన్న ఒకొక్క PC సాంకేతిక సామర్థ్యంపై పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు నివేదికలు అందుకుని నెట్‌వర్క్‌ను పటిష్ఠంగా ఉంచేందుకు అన్నివిధాలా Windows Intune సహకరిస్తుంది.