Windows Live Meshతో సింక్రనైజ్
రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లలోని ఫోల్డర్లను సింక్రనైజ్ (peer-to-peer) చేయాలనుకుంటున్నారా? అయితే Windows Live Meshతోఇది ఎంతో సులభంగా, కచ్చితంగా పూర్తవుతుంది. ఫోల్డర్లు ఎంత పెద్దవయినా కావచ్చు, ఎంత ఎక్కువ డేటా అయినా ఉండవచ్చు. ఒక కంప్యూటర్‌లో మీరు ఏవైనా మార్పులు చేస్తే... మిగిలిన కంప్యూటర్లు ఆన్‌లైన్‌లో ఏకకాలంలో సింక్రనైజ్ అవుతాయి. సింక్రనైజ్డ్ ఫోల్డర్లలోని సమాచారమంతా అన్ని కంప్యూటర్లలోనూ సేవ్ అవుతుంది. ఇంటర్నెట్‌తో కనెక్ట్ కాని సమయాల్లోనూ మీ పనులు చేసుకోవచ్చు. తర్వాత ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు సింక్రనైజేషన్ పూర్తవుతుంది.
ఒక ఫోల్డర్‌ను సింక్రనైజ్ చేయాలనుకుంటే... ముందు Windows Live Meshను ప్రారంభించి Sync a folder పై క్లిక్ చెయ్యాలి. తర్వాత మీకు కావలసిన ఫోల్డర్‌ను ఎంచుకుని Syncపైన క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత ఈ ఫోల్డర్‌ను ఎక్కడ సింక్రనైజ్ చెయ్యాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్లను కూడా ఎంపిక చేసుకుని OKనొక్కండి. మీరు ఎంచుకున్న PCలలోని మీ personal folder లో సదరు ఫోల్డర్ సేవ్ అవుతుంది.Startమెనులో మీ పేరుపై క్లిక్ చెయ్యడం ద్వారా మీరు ఈ ఫోల్డర్‌ను పొందవచ్చు.
మీరు Windows Live SkyDriveలో కూడా సింక్రనైజ్ చేయడం కోసం ఫోల్డర్లను ఎంపిక చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఎక్కడున్నప్పటికీ వాటిని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మామూలుగా సింక్రనైజ్ చేసిన ఫోల్డర్లను కలిగి ఉన్న కంప్యూటర్లు ఆన్‌లైన్‌లో లేనప్పుడు SkyDriveలో సింక్రనైజ్ చేసి ఉన్న ఫోల్డర్లలోని సమాచారాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.
ఇదెలాగంటే... ముందు Windows Live Meshను ప్రారంభించి Sync a folder పై క్లిక్ చెయ్యాలి. తర్వాత మీకు కావలసిన ఫోల్డర్‌ను ఎంచుకుని Syncపైన క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత SkyDrive synced storage ఎంపిక చేసుకుని OKనొక్కండి.
SkyDrive synced storageలో సింక్రనైజ్ చేసిన ఫోల్డర్‌ను పొందడానికి మీరు Devices websiteలోకి వెళ్ళి SkyDrive synced storageపైన క్లిక్ చెయ్యిండి.
Windows 7లేదాWindows Vistaఉన్న కంప్యూటర్ల మధ్య Windows Live Meshతో సింక్రనైజ్ ప్రోగ్రాం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. Internet Explorerలో ఫేవరెట్స్‌ను సింక్రనైజ్ చేసుకోవచ్చు. Microsoft Office ఇన్‌స్టాల్ అయి ఉంటే మీ styles, templates, custom dictionary, email signaturesను సింక్రనైజ్ చేయవచ్చు. రెండు కంప్యూటర్ల మధ్య మీ ప్రోగ్రాం సెట్టింగ్స్‌ను సింక్రనైజ్ చేసినప్పుడు ఏ ఒక్క కంప్యూటర్‌లో మార్పు జరిగినా అవి రెండవ కంప్యూటర్‌లో ప్రతిబింబిస్తాయి.
ఇందుకోసం ఏం చెయ్యాలంటే...
ముందుగా ఒక కంప్యూటర్‌లో Windows Live Mesh ప్రారంభించండి. అందులోProgram settingsకు వెళ్ళిమీరు సింక్రనైజ్ చేయదలచిన వాటికిTurn on syncingపైన క్లిక్ చెయ్యండి.తర్వాత మిగిలిన కంప్యూటర్లలో ప్రతి ఒక్క దానిలోనూ Windows Live Mesh ప్రారంభించి, మీరు సింక్రనైజ్ చేయదలచిన ప్రోగ్రాం సెట్టింగులకు వెళ్ళి Turn on syncingపైన క్లిక్ చెయ్యండి.