Windows Marketplace
ఆపరేటింగ్ సిస్టమ్స్, పొడక్టివిటీ సూట్స్, అప్లికేషన్ల వంటి పలు Microsoft సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉండే ఒకే చోట లభించే online షాప్ Windows Marketplace. మీ Windows Live ID ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
పలువురు విక్రేతలు, ఉత్పత్తి కేటలాగ్‌లను మీరు వీక్షించేందుకు గాను Windows Marketplace మీకు digital locker సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీరు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ను సురక్షితంగా Digital Locker Assistant ద్వారా మీరు download చేసుకోవచ్చు. ఈ సదుపాయం USలోని కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
ఆ తర్వాత 2008లో Windows Marketplaceను కొనసాగించబోవడం లేదని Microsoft ప్రకటించింది. దీనికి బదులు ప్రజలంతా వారికి సమీపాన గల Microsoft storeకు వెళ్ళాల్సి ఉంటుంది. 2009లో Mobile కోసం Windows Marketplace ప్రారంభమైంది. తర్వాత దీనిని Windows Phone 7 Marketplaceగా పునర్వ్యవస్థీకరించారు.
Windows Marketplace ప్రస్తుతం Microsoft storeకు దారి తీస్తుంది. Microsoft storeలో Windows, Office Productivity Suite, Design Tools, Developer Tools, Books, Netbooks, Laptops, Widows Phones, Gaming, Accessories మరియు మరెన్నో రకాల వైవిధ్యభరితమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
షాపింగ్ ఇంటర్‌ఫేస్‌ను చాలా తేలికగా ఉపయోగించుకోవచ్చు. పలు ముఖ్యమైన ఉత్పత్తులను ఇది హోం పేజీలో ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. మీకు కావలసిన, అసలైన నాణ్యతా ప్రమాణాలున్న సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్‌ను ఎంతో నమ్మకంగా కేవలం కొన్ని క్లిక్‌లతో కొనుగోలు చేసుకోవచ్చు. తగిన ధరలతో సత్వర పంపిణీ కోసం ఆయా దేశాలకు అనుగుణంగా రవాణా మరియు వ్యాపార విధానాల రూపకల్పన జరిగింది.
మరిన్ని వివరాలకోసం www.windowsmarketplace.com సందర్శించండి.