BUILDలో Windows 8 డెవలపర్ ప్రివ్యూ

 

 

           Windows బృందానికి సంబంధించి ఒక జ్ఞాపకంగా మిగిలే పరిణామం ఇటీవలే చేటు చేసుకుంది. అదేమిటంటే.. BUILD కాన్ఫరెన్స్‌లో Windows 8 ప్రివ్యూ. ఈ సరికొత్త OS గురించి చెప్పడానికి, అనుభూతి చెందడానికి ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే కీలకోపన్యాసం తో పాటు http://buildwindows.comలో అందుబాటులో ఉన్న స్ట్రీమ్స్‌ను వీక్షించేందుకు అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంటుంది. తాజాగా జరిగిన BUILD కాన్ఫరెన్స్‌లో డెవలపర్లు మరియు హార్డ్‌వేర్ పార్ట్‌నర్స్ పై దృష్టి సారించగా, 100కు పైగా సెషన్లున్నాయి (పైన తెలిపిన లింక్‌లో వీటిని కాన్ఫరెన్స్ ముగిసిన ఒక రోజు లోపు సమయంలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది). ఇది ప్రాడెక్ట్ ఆవిష్కరణ గానీ, కొత్త పరికరాల ఆవిష్కరణ గానీ కాదు.. కేవలం Windowsలో డెవలపర్‌కు గల అవకాశాల గురించి మాత్రమే..

 

వినియోగదారులకు వైవిధ్యభరితమైన కార్యకలాపాల అనుభూతిని అందించే క్రమంలో చిప్‌సెట్ నుంచీ Windowsలో చోటు చేసుకున్న పునరాకృతీకరణకు Windows 8 ప్రతిబింబంగా ఉంటుంది. ఈ ప్రత్యేక సదస్సు డెవలపర్లను ఉద్దేశించింది కావడం వల్ల Windows ప్లాట్‌ఫాం, టూల్స్, APIలకు సంబంధించిన ఈ పునరాకృతీకరణలపై  కాన్ఫరెన్స్‌లో సవివరంగా చర్చించారు. Windows 8 వినియోగదారులు Tablets, Laptops ఇంకా Desktops ఇలా ఏ రకమైన PCని ఉపయోగిస్తున్నప్పటికీ.. వీరి కోసం అప్లికేషన్ల రూపకల్పనకు గల మార్గాలపై ప్రదర్శన జరిగింది. HTML5 / JavaScript, C/C++ మరియు / లేదా C# / XAML తదితరాలను ఉపయోగించి మెట్రో స్టయిల్ అప్లికేషన్ల కోడింగ్ కోసం సరికొత్త సాధనాల వాడుకను తెలియజేశారు. ఈ లాంగ్వేజీలన్నిటిలోనూ డెవలపర్లు కావడం కోసం చేసిన శ్రమ, వ్యయం Windows 8 వరకూ అడుగులేయగా, Windows 8 సిస్టం సర్వీస్‌లను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడమనే దిశగా ఫలితం ఉంటుందనేది నిస్సందేహం. ఎండ్ యూజర్లకు ఒక OSగా, డెవలపర్లకు ఒక ప్లాట్‌ఫాంగా తుదికంటా తిరుగులోని సేవలందించడంలో Windows 8 రాజీపడదనేది ఇక్కడి చర్చల సారాంశం.

 

BUILD కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారు ARM ప్రాసెసర్లపై Windows 8 పనితీరు పట్ల ఆసక్తిని కనబరిచారు. కాన్ఫరెన్స్‌లో చూపించిన ప్రతి ఒక్కటీ ARM పార్ట్‌నర్స్ మరియు PC తయారీదారులు రూపొందించిన ARM ఆధారిత Windows PCల్లోనూ చక్కగా పనిచేస్తాయి. ARMపై పనిచేసే Windows 8 మీకు ARM ఆధారిత హార్డ్‌వేర్‌తో పాటుగా అందుబాటులో ఉంటుంది. ARM ఆనేది ఎంతో ప్రత్యేకమైనది అయినందువల్ల ARMకు సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మధ్య ఇంజనీరింగ్‌లో అత్యంత లోతైన సమన్వయం ఉండాలి. ఈ ప్రత్యేకతను పూర్తిస్థాయిలో ప్రతిబింబించేలా Windows 8 చూసుకుంటుంది. ఇక నుంచీ మెట్రో స్టయిల్ అప్లికేషన్ల రూపకల్పనలో ఉపయోగించే సరికొత్త డెవలప్‌మెంట్ టూల్స్ అన్నీ x86 (32 మరియు 64 బిట్) లేదా ARM architecturesలో సునాయాసంగా పనిచేస్తాయి. మీరు సంప్రదాయ C/C++ కోడ్‌ను ఉపయోగించినప్పటికీ, మీరు ఎంచుకునే నిర్దిష్ట హార్డ్‌వేర్‌ను లక్ష్యం చేసుకునేలా మెట్రో స్టయిల్ అప్లికేషన్లను ఈ టూల్స్ ప్రేరేపిస్తాయి. టెస్టింగ్ కోసం కొత్త PCలు సిద్ధంగా ఉన్నందువల్ల, PC తయారీదార్లు డెవలపర్లకోసం సీడ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తారు.

 

ప్రివ్యూ రిలీజ్‌ను ప్రయత్నించాలనుకుంటే Windows 8 డెవలపర్ ప్రివ్యూను డౌన్‌లోడ్ చేసుకుని వెంటనే మొదలుపెట్టండి. ఇందులో అప్లికేషన్ల రూపకల్పన కోసం డెవలప్‌మెంట్ టూల్స్‌తో కూడిన 64-బిట్ (x64 బిట్) బిల్డ్, డెవలప్‌మెంట్ టూల్స్ లేకుండా 32-బిట్ (x32 బిట్) బిల్డ్ ఉంటాయి. ఈ రిలీజ్‌లలో నమూనా అప్లికేషన్ల సూట్ కూడా ఉంటుంది. (ఇవి అప్లికేషన్ల చిత్రాలు మాత్రమే, Windows 8తో పంపిణీ చేయడానికి ఉద్దేశించిన అప్లికేషన్లు కావని గుర్తించాలి). ఇక ISOలు http://dev.windows.com ద్వారా లింక్ అయి ఉన్నాయి.

 

ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ప్రీ-రిలీజ్ కోడ్ ఉపయోగించి Windows 7 ఇన్‌స్టలేషన్ నుంచి అప్‌గ్రేడ్ కావడానికి ఇందులో కుదరదు. క్లీన్ ఇన్‌స్టాల్స్‌కు మాత్రమే మద్దతు ఉంది. ఇది కేవలం డెవలపర్ ప్రివ్యూ రిలీజ్ తప్ప ప్రొడక్షన్‌కు ఉద్దేశించినది కాదని మరోమారు గుర్తుచేసుకోవాల్సి ఉంది. ఇది బీటా రిలీజ్ కాదు. రాబోయే మరికొన్ని వారాలు, నెలలకాలంలో రిలీజ్‌ను పలు క్వాలిటీ అప్‌డేట్లు, డ్రైవర్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది.

Read More on...