సర్వాంతర్యామి Windows Live SkyDrive
మీ ఇంట్లో కావచ్చు లేదా ఆఫీసులో కావచ్చు... గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని కష్టపడి డాక్యుమెంట్లు, ఫోటోలు, ఆడియో లేదా వీడియోలు సిద్ధం చేసుకుని తర్వాత మీ అవసరం మేరకు వాటిని ఉపయోగించుకోవడం మీకు అలవాటైన పనే అయి ఉంటుంది. అయితే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మీ కంప్యూటర్‌లో సమస్యలు తలెత్తితే !... మీరు డేటా బ్యాకప్ తీసుకున్నప్పటికీ ఆ స్టోరేజ్ మీడియా సైతం సమయానికి మిమ్మల్ని ఆదుకోకుంటే !... ఇలాంటి పరిస్థితుల్లో Microsoft మీ కోసం సిద్ధం చేసిన సరికొత్త వ్యవస్థ Windows Live SkyDrive. దీని ద్వారా మీ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు మీకు కావలసిన వ్యక్తులకోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచవచ్చు.
ఉచిత స్టోరేజి... అంతా Live
SkyDrive మీకు 25 GB ఉచిత online స్టోరేజి (మీ ఫైళ్ళు ఉంచుకోవడానికి స్థలం) అందజేస్తుంది. వేలాదిగా మీ డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోల్ని ఇక్కడ పొందుపరచుకోండి. ఫోటోల్ని upload చేసిన తర్వాత వాటికి online slide shows కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. Windows Live Photo Gallery సహాయంతో మీ ఫోటోలను ఎడిట్ చేసుకుని నేరుగా SkyDriveలోకి upload చేసుకోండి. Windows Live Movie Makerను ఉపయోగించుకుని మీ ఫోటోలు, వీడియోలతో ఆకర్షణీయమైన మూవీస్‌ను రూపొందించుకోండి. అంతా సిద్ధమయ్యాక SkyDriveలోకి upload చేసుకొని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు.
మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే... వీటన్నిటితో onlineలోనే మీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. PC లేదా Macతో వీక్షించవచ్చు. మీ సన్నిహితులందరితోనూ పంచుకోవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... password ఉన్న మీ ఫైల్స్‌ను onlineలో ఎవరెవరికి అందుబాటులో ఉంచాలనే నిర్ణయం మీదే. ఈ పనిని మరింత సులభంగా నిర్వహించడానికిగాను Groups ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి edit, view లాంటి అనుమతులు ఇవ్వవచ్చు. ఇందులో social networks, మొబైల్ ఫోన్ యూజర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవన్నీ మీరే స్వయంగా చేసుకోగలిగిన ప్రక్రియలు.
ఇ-మెయిల్, social networks ద్వారా ఫోటోల Sharing
కు సంబంధించి మీరు తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. Windows Live Hotmail ద్వారా భారీ సంఖ్యలో ఫోటోల్ని పంపినప్పుడు వాటిని ఇ-మెయిల్ ద్వారా అందుకునేవారి కోసం SkyDrive ఆటోమేటిక్‌గా ఆ ఫోటోలతో ఆల్బంను తయారు చేసి ఉంచుతుంది.
Microsoft Office Web Applicationsతో సైతం మీరు onlineలో కార్యకలాపాల్ని నిర్వహించుకోవడానికి, అవసరమైన వ్యక్తులతో వాటిని పంచుకోవడానికి Windows Live SkyDrive శక్తిమంతమైన సెట్టింగ్స్‌ను, సదుపాయాల్ని అందిస్తుంది. భూమ్మీద మీరెక్కడున్నా సరే మీ కార్యకలాపాల్ని నిరంతరాయంగా కొనసాగించుకోవడానికి మీకిస్తున్న భరోసా ఇది.